కాంత రివ్యూ- దుల్కర్ సల్మాన్ నట విశ్వరూపం, రానా దగ్గుబాటి అదుర్స్, హీరో-డైరెక్టర్ ఇగో క్లాష్- సినిమాపై సినిమా ఎలా ఉంది?

దుల్కర్ సల్మాన్, రానా దగ్గుబాటి, భాగ్యశ్రీ బోర్సే, సముద్రఖని ప్రధాన పాత్రలు పోషించిన డ్రామా చిత్రం కాంత. సెల్వమణని సెల్వరాజ్ దర్శకత్వం వహించిన కాంత ఇవాళ థియేటర్లలో విడుదలైంది. ఇప్పటికే ఈ మూవీ ప్రీమియర్స్ పడ్డాయి. హీరో, డైరెక్టర్ మధ్య క్లాష్‌తో వచ్చిన ఈ మూవీ ఎలా ఉందో నేటి కాంత రివ్యూలో తెలుసుకుందాం.

Published on: Nov 14, 2025 8:59 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

టైటిల్: కాంత (Kaantha Movie)

కాంత రివ్యూ- దుల్కర్ సల్మాన్ నట విశ్వరూపం, రానా దగ్గుబాటి అదుర్స్, హీరో-డైరెక్టర్ ఇగో క్లాష్- సినిమాపై సినిమా ఎలా ఉంది?
కాంత రివ్యూ- దుల్కర్ సల్మాన్ నట విశ్వరూపం, రానా దగ్గుబాటి అదుర్స్, హీరో-డైరెక్టర్ ఇగో క్లాష్- సినిమాపై సినిమా ఎలా ఉంది?

నటీనటులు: దుల్కర్ సల్మాన్, సముద్రఖని, భాగ్యశ్రీ బోర్సే, దగ్గుబాటి రానా, రవీంద్ర విజయ్ తదితరులు

కథ, దర్శకత్వం: సెల్వమణి సెల్వరాజ్

సంగీతం: జాను చందర్

బీజీఎమ్: జేక్స్ బిజోయ్

సినిమాటోగ్రఫీ: డానీ సాంచెజ్ లోపేజ్

ఎడిటింగ్: లెవెలిన్ ఆంథోని గొంజాల్వేజ్

నిర్మాత: ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్, దగ్గుబాటి రానా, దుల్కర్ సల్మాన్

విడుదల తేది: 14 నవంబర్ 2025

సినీ ఇండస్ట్రీలో ఇంట్రెస్టింగ్‌గా మారిన సినిమా కాంత. హీరో, డైరెక్టర్ మధ్య వచ్చే ఇగో క్లాష్ గురించి సినిమాపైనే తెరెకెక్కిన మూవీ కాంత. దుల్కర్ సల్మాన్, రానా దగ్గుబాటి, సముద్రఖని వంటి స్టార్స్ నటించిన సినిమా ఇది. ఇందులో హీరోయిన్‌గా బ్యూటిఫుల్ భాగ్యశ్రీ బోర్సే చేసింది. అలాగే, పాపులర్ నటుడు రవీంద్ర విజయ్ కీలక పాత్ర పోషించారు.

కాంత మూవీ రివ్యూ

సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన కాంత మూవీ ప్రీమియర్స్ రిలీజ్‌కు ఒకరోజు ముందుగానే పడిపోయాయి. ఇవాళ (నవంబర్ 14) థియేటర్లలో కాంత విడుదల అయింది. మరి ఈ సినిమా ఎలా ఉందో నేటి కాంత రివ్యూ (Kaantha Movie Review)లో తెలుసుకుందాం.

కథ:

అయ్య (సముద్రఖని) ఒక స్టార్ డైరెక్టర్. తన తల్లి జీవితం ఆధారంగా శాంత అనే సినిమా తీయాలనుకుంటాడు. తన అభిమాన శిష్యుడైన నట చక్రవర్తి టీకే మహదేవన్ (దుల్కర్ సల్మాన్) హీరోగా శాంతను తెరకెక్కిస్తాడు. కానీ, సినిమా మధ్యలోనే ఆగిపోతుంది. మళ్లీ కొన్నేళ్లకు శాంత తిరిగి ప్రారంభం అవుతుంది.

అయితే, మహదేవన్ చెప్పిన క్లైమాక్స్‌తో పాటు టైటిల్ కాంత అని ఉండాలని షరతు పెడతాడు హీరో. తన తల్లి కథను తెరపై చూసుకోవాలన్న ఒకే ఒక్క కోరికతో అయ్య సినిమాను తీసేందుకు ఒప్పుకుంటాడు. షూటింగ్ జరిగిన హీరో, డైరెక్టర్ మాట్లాడుకోరు. ఒకరికొకరికి పడదు. ఇక సినిమా పూర్తి కావోస్తున్న సమయంలో బృందంలో ఒకరు హత్యకు గురవుతారు.

ఆ తర్వాత ఏమైంది? ఎవరు హత్యకు గురయ్యారు? ఆ హత్యకు గల కారణాలు ఏంటీ? కేసును ఇన్వెస్టిగేషన్ కోసం వచ్చిన ఇన్‌స్పెక్టర్ దేవరాజ్ (రానా దగ్గుబాటి) నిందితుడిని కనిపెట్టాడా? దేవరాజ్ ప్రభావం కాంతపై ఎలా పడింది? గురు శిష్యుల బంధం చెడిపోడానికి గల కారణాలు ఏంటీ? హీరోయిన్ కుమారి (భాగ్యశ్రీ బోర్సే) పాత్ర ఏంటీ? చివరికీ ఏమైంది? కాంత రిలీజ్ అయిందా? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

సినిమా షూటింగ్ టైమ్‌లో నటీనటులు, టెక్నిషియన్స్, క్రియేటర్స్ మధ్య వచ్చే మనస్పర్థలు, గొడవలు ఆసక్తి కలిగిస్తుంటాయి. ఎవరు ఏం చేశారు, ఎందుకు అనే విషయాలు మూవీ కంటే ఇంట్రెస్టింగ్‌గా చూస్తారు ఆడియెన్స్. అలా డైరెక్టర్, హీరో మధ్య ఉండే అహం, ఇగో క్లాష్ కాన్సెప్ట్‌తో వచ్చిన సినిమానే కాంత.

అలాగే, సినీ రంగంపై వచ్చే సినిమాలా దాదాపుగా చాలా అరుదు. ఎప్పుడో ఓసారి వస్తుంటాయి. ఓల్డ్ సినీ యుగాన్ని చాలా మంది సినీ స్వర్ణయుగంగా పిలుచుకుంటారు. దీనిపై వచ్చిన కాంత అప్పటి యుగాన్ని కళ్లకు కట్టినట్లు చూపించింది. 1950-60 కాలంలో తెరకెక్కినట్లుగా పీరియాడిక్ డ్రామాగా కాంతాను చూపించారు.

హత్య ఎవరు చేశారు?

సినీ పరిశ్రమలో హీరోలు, నటీనటుల క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా వచ్చే సంఘర్షణలను చాలా బాగా చూపించారు డైరెక్టర్. ఇద్దరు గొప్ప వ్యక్తుల అహాన్ని చాలా నాటకీయంగా ఫస్టాఫ్ అంతా చూపించారు. ఒకరిపై మరొకరు పైచేయి సాధించాలనుకునే ఇగోతో ఎక్కడి వరకు వెళ్లారు అనేది ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది.

ప్రముఖ పాత్ర హత్యతో కథ మలుపు తిరుగుతుంది. ఆ హత్య ఎవరు చేశారన్న దానిపై సెకండాఫ్ అంతా సాగుతుంది. అప్పటివరకు పీరియాడిక్ డ్రామాగా ఉన్న సినిమా ఒక్కసారిగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ జోనర్‌గా మారిపోతుంది. అయితే, ఫస్టాఫ్ ఇచ్చిన అంత ఎగ్జైట్‌మెంట్ సెకండాఫ్ ఇవ్వలేకపోయింది.

రానా దగ్గుబాటి ఎంట్రీ స్పెషల్‌

రానా దగ్గుబాటి ఎంట్రీ స్పెషల్‌గా ఉన్నా ఇన్వెస్టిగేషన్ మాత్రం అక్కడక్కడ సాగినట్లు బోర్ తెప్పిస్తుంటుంది. అది తప్పితే సినిమాలో గురు, శిష్యుల మధ్య బంధం, గొడవ, సంఘర్షణ, వారిని కలిపేందుకు హీరోయిన్ ట్రై చేయడం వంటి సీన్స్ ఆకట్టుకుంటాయి. స్వర్ణయుగపు సినిమా గొప్పతనాన్ని చెప్పే సీన్స్ బాగుంటాయి.

ఇక క్లైమాక్స్ ఎమోషనల్‌గా మెప్పిస్తుంది. హత్య, ఎవరు చేశారు, ఎందుకు చేశారనే పెద్ద ట్విస్ట్‌తో కాంత ముగుస్తుంది. దుల్కర్ సల్మాన్ నట విశ్వరూపం చూపించాడు. నట చక్రవర్తి పాత్రలో జీవించేశాడు. అప్పటి హీరోల హావాభావాలను చాలా బాగా పలికించాడు. అయితే, కొన్ని చోట్ల మహానటి సినిమాలో జెమినీ గణేశన్‌ను గుర్తు చేస్తాడు.

సముద్రఖని నటన గుర్తుండిపోతాడు. రాజీపడని దర్శకుడి పాత్రపై తన నటనతో ప్రభావం చూపించారు. దుల్కర్, సముద్రఖని మధ్య వచ్చే సన్నివేశాల్లో హైలెట్ అవ్వడానికి కారణం వారి నటనే. ఇక హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే అభినయంతో కట్టిపడేస్తుంది. గ్లామర్ రోల్స్‌ చేసిన భాగ్యశ్రీ నటిగా ఓ మెట్టు ఎక్కింది. దుల్కర్, భాగ్యశ్రీ కెమిస్ట్రీ వర్కౌట్ అయింది.

ఓవరాల్‌గా చెప్పాలంటే?

ఇక రానా దగ్గుబాటి నటన అదుర్స్ అనిపిస్తుంది. రానా ఎంట్రీతో సినిమాలో సందడి నెలకొంటుంది. కొంతవరకు ఆయన నటన నేటితరం సినిమాలాగే ఉంటుంది. రవీంద్ర విజయ్ యాక్టింగ్ కూడా ఆకట్టుకుంది. టెక్నికల్ పరంగా కాంత అదిరిపోయింది. విజువల్స్ చాలా బాగున్నాయి. అప్పటి సినిమా ఎక్స్‌పీరియెన్స్‌ను ఇచ్చింది. బీజీఎమ్ అదుర్స్. కొన్ని పాటలు బాగున్నాయి. డైరెక్టర్ రచన, టేకింగ్ బాగుంది. సెకండాఫ్‌లో డ్రామా ఎక్కువై థ్రిల్ తగ్గింది.

నిర్మాణ విలువలు, కెమెరా పనితనం చాలా బాగున్నాయి. ఓవరాల్‌గా చెప్పాలంటే సినిమాపైనే వచ్చిన కాంత మూవీ హీరో, డైరెక్టర్ అహం, హత్య, డ్రామా, ఇన్వెస్టిగేషన్‌తో మెప్పిస్తుంది.

రేటింగ్: 3.25/5