జిగ్రీస్ రివ్యూ.. రూపాయి లేకుండా నలుగురి ఫ్రెండ్స్ గోవా ట్రిప్.. సందీప్ రెడ్డి వంగా స్నేహితుడి మూవీ ఎలా ఉందంటే?

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఫ్రెండ్ కృష్ణ వోడపల్లి నిర్మించిన లేటెస్ట్ తెలుగు కామెడీ మూవీ జిగ్రీస్. మ్యాడ్ ఫేమ్ రామ్ నితిన్, కృష్ణ బూరుగుల, ధీరజ్ ఆత్రేయ, మని వాక ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా ప్రీమియర్ షోలను ఒకరోజు ముందుగానే వేశారు. మరి ఈ సినిమా ఎలా ఉందో నేటి జిగ్రీస్ రివ్యూలో తెలుసుకుందాం.

Published on: Nov 13, 2025 12:24 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

టైటిల్: జిగ్రీస్

జిగ్రీస్ రివ్యూ.. రూపాయి లేకుండా నలుగురి ఫ్రెండ్స్ గోవా ట్రిప్.. సందీప్ రెడ్డి వంగా స్నేహితుడి మూవీ ఎలా ఉందంటే?
జిగ్రీస్ రివ్యూ.. రూపాయి లేకుండా నలుగురి ఫ్రెండ్స్ గోవా ట్రిప్.. సందీప్ రెడ్డి వంగా స్నేహితుడి మూవీ ఎలా ఉందంటే?

నటీనటులు: కృష్ణ బూరుగుల, రామ్ నితిన్, ధీరజ్ ఆత్రేయ, మని వాక తదితరులు

కథ, దర్శకత్వం: హరీష్ రెడ్డి ఉప్పుల

సంగీతం: సయ్యద్ కమ్రాన్

సినిమాటోగ్రఫీ: ఈశ్వరాదిత్య

ఎడిటింగ్: చాణక్య రెడ్డి తూరుపు

నిర్మాత: కృష్ణ వోడపల్లి

విడుదల తేది: నవంబర్ 14, 2025

మ్యాడ్ ఫేమ్ రామ్ నితిన్, కృష్ణ బూరుగుల, ధీరజ్ ఆత్రేయ, మని వాక ప్రధాన పాత్రలు పోషించిన లేటెస్ట్ కామెడీ ఫిల్మ్ జిగ్రీస్. ఈ సినిమాను డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా స్నేహితుడు కృష్ణ వోడపల్లి నిర్మించారు. దీంతో ఈ సినిమాకు మంచి హైప్ క్రియేట్ అయింది. అలాగే గత కొంతకాలంగా సోషల్ మీడియాలో జిగ్రీస్ అట్రాక్ట్ చేస్తుంది.

సందీప్ రెడ్డి వంగా నుంచి తరుణ్ భాస్కర్

అందుకు కారణం సినీ సెలబ్రిటీలు జిగ్రీస్ సినిమాపై ప్రశంసలు కురిపించడమే. సందీప్ రెడ్డి వంగా నుంచి హీరో కిరణ్ అబ్బవరం, డైరెక్టర్ తరుణ్ భాస్కర్ సైతం జిగ్రీస్ సినిమాను ప్రచారం చేశారు. దీంతో మంచి బజ్ క్రియేట్ అయింది.

జిగ్రీస్ మూవీ రివ్యూ

హరీష్ రెడ్డి ఉప్పుల దర్శకత్వ వహించిన జిగ్రీస్ మూవీ థియేట్రికల్ రిలీజ్‌కు ఒకరోజు ముందు ప్రీమియర్ షోలు వేశారు. మరి ఈ సినిమా ఎలా ఉందో నేటి జిగ్రీస్ రివ్యూలో తెలుసుకుందాం.

కథ:

కార్తీక్ (కృష్ణ బూరుగుల), ప్రవీణ్ (రామ్ నితిన్), వినయ్ (ధీరజ్ ఆత్రేయ), ప్రశాంత్ (మని వాక) నలుగురు మంచి స్నేహితులు. కాలేజీ తర్వాత ఎవరికి వారు బిజీ అవుతారు. ఓ రోజు నలుగురు కలిసి తాగిన మత్తులో గోవా వెళ్లాలనుకుంటారు. అంతా కలిసి మారుతి 800 కారులో గోవాకు ట్రిప్ వేస్తారు. కానీ, మధ్యలోనే డబ్బు, పర్స్‌లు, మొబైల్స్ అన్ని కింద పడేసుకుని వెళ్తారు.

దారిలో కారు రిపేర్‌కు వస్తుంది. అప్పుడు డబ్బు పోగొట్టుకున్నామని తెలుసుకుంటారు. ఆ తర్వాత ఏమైంది? నలుగురు ఫ్రెండ్స్ ఒక్క రూపాయి లేకుండా గోవాకు ఎలా వెళ్లారు? ఈ క్రమంలో వారు ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటీ? అసలు రాత్రికి రాత్రే గోవాకు వెళ్లాలని ఎందుకు డిసైడ్ అయ్యారు? ఆ మారుతి 800 కారులోనే ఎందుకు వెళ్లాలనుకున్నారు? గోవా ప్రయాణం నలుగురిలో ఎలాంటి మార్పు తీసుకొచ్చింది? ప్రశాంత్‌కు ఏమైంది? అనే విషయాలు తెలియాలంటే జిగ్రీస్ చూడాల్సిందే.

విశ్లేషణ:

నలుగురు ఫ్రెండ్స్ కలిసి చేసే ప్రయాణంలో పెద్దగా స్టోరీ ఏముండదు. కానీ, ఆ నలుగురు చేసే పనులు స్టోరీలు అవుతాయి. అవి నవ్వించొచ్చు, కాస్తా ఎమోషనల్‌కు గురి చేయొచ్చు. అలాంటి సినిమానే జిగ్రీస్. నలుగురు బెస్ట్ ఫ్రెండ్స్ కలిసి గోవాకు వెళ్లడం, అందుకు డబ్బులు లేకపోవడం. ఇదే జిగ్రీస్ స్టోరీ. కానీ, కావాల్సింది అందుకు ఆ నలుగురు చేసింది ఏంటీ, అది మెప్పించాదా అనేదే ముఖ్యం.

ఇందులో నలుగురు ఫ్రెండ్స్ ఎంటర్‌టైన్ చేయడంలో పూర్తిగా సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. ఒక్కో సీన్ కామెడీతో బాగా నవ్వించేలా ఉంది. ముఖ్యంగా లారీ సీన్, ఓ ఊర్లో నాటుకోడి ఎపిసోడ్, కండోమ్ సీన్స్ వంటివి హాయిగా నవ్విస్తాయి. కథలో మావోయిస్టుల బ్లాక్ రావడం, అది మెప్పించే తీరు బాగుంది.

నలుగురు దోస్తులు కలిస్తే

నలుగురు ఫ్రెండ్స్ గోవాకు వెళ్లే క్రమంలో డబ్బులు పోగొట్టుకోవడం, రూపాయి లేకుండా గోవా ట్రిప్ కంప్లీట్ చేయడం, అసలు గోవాకు ఎందుకు వెళ్లారు ఇంతే కథ. ఇందులో పెద్దగా ఆశ్చర్యపరిచే ట్విస్టులు ఏం లేవు. కానీ, వాళ్లు గోవాకు వెళ్లే జర్నీ మాత్రం నవ్విస్తుంది. రియల్ లైఫ్‌లో నలుగురు దోస్తులు కలిస్తే ఎలా ఉంటుందో అలాగే జిగ్రీస్ ఉంది.

ఇక ఫినిషింగ్ టచ్ కింద చివరి 15 నిమిషాలు గుండె బరువెక్కించేలా ఎమోషనల్ ఎపిసోడ్ కన్నీళ్లు తెప్పిస్తుంది. అప్పటి వరకు నవ్వించిన పాత్రలు ఏడిపించేస్తాయి. క్లైమాక్స్ భావోద్వేగం తెప్పించేలా ఉంటుంది. ఇకపోతే నలుగురి యాక్టింగ్ చాలా బాగుంది. ముఖ్యంగా కృష్ణ బూరుగుల పర్ఫామెన్స్ మొదటి నుంచి చివరి వరకు మెప్పిస్తుంది.

రామ్ నితిన్ తన స్టైల్‌లో ఆకట్టుకున్నాడు. ధీరజ్ ఆత్రేయ నాచురల్‌గా అమాయకపు యాక్టింగ్‌తో నవ్వించాడు. మని వాక పాత్ర చుట్టూనే సినిమా సాగుతుంది. ఎమోషనల్ సీన్స్‌లో పర్లేదనిపించాడు. ఇక నలుగురు ఫ్రెండ్స్‌తో కామెడీ, ఎమోషనల్‌గా మెప్పిచడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారు. విజువల్స్ నాచురల్‌గా బాగున్నాయి.

రియల్ లైఫ్ జిగ్రీస్

సంగీతం బాగుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ప్రతి ఒక్కరు తమ బాధ్యతను నిర్వర్తించినట్లు అనిపించింది. ఓవరాల్‌గా చెప్పాలంటే హీరోయిన్, గ్లామర్ లేకుండా సినిమా అంతా నవ్వించి చివరిలో ఎడిపించే రియల్ లైఫ్ జిగ్రీస్.

రేటింగ్: 3/5

News/Entertainment/జిగ్రీస్ రివ్యూ.. రూపాయి లేకుండా నలుగురి ఫ్రెండ్స్ గోవా ట్రిప్.. సందీప్ రెడ్డి వంగా స్నేహితుడి మూవీ ఎలా ఉందంటే?
News/Entertainment/జిగ్రీస్ రివ్యూ.. రూపాయి లేకుండా నలుగురి ఫ్రెండ్స్ గోవా ట్రిప్.. సందీప్ రెడ్డి వంగా స్నేహితుడి మూవీ ఎలా ఉందంటే?