ఈ నగరానికి ఏమైంది లాంటి సినిమా.. ప్రభాస్ స్పెషల్‌ పోస్టర్‌తో జిగ్రీస్ రిలీజ్ డేట్.. డైరెక్టర్ ఎవరంటే?

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా చిన్నప్పటి స్నేహితుడు హరీష్ రెడ్డి ఉప్పుల దర్శకత్వం వహించిన సినిమా జిగ్రీస్. ఈ సినిమాలో రామ్ నితిన్, కృష్ణ బురుగుల, మణి వక్కా, ధీరజ్‌ అథేర్య హీరోలుగా చేశారు. ప్రభాస్ బర్త్ డే సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేస్తూ జిగ్రీస్ విడుదల తేదిని ప్రకటించారు మేకర్స్.

Published on: Oct 27, 2025 8:46 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో రామ్ నితిన్. ఇప్పుడు రామ్ నితిన్ నటించిన మరో కొత్త సినిమా జిగ్రీస్. ఈ సినిమాలో రామ్ నితిన్‌తోపాటు కృష్ణ బురుగుల, మణి వక్కా, ధీరజ్‌ అథేర్య హీరోలుగా నటించారు.

ఈ నగరానికి ఏమైంది లాంటి సినిమా.. ప్రభాస్ స్పెషల్‌ పోస్టర్‌తో జిగ్రీస్ రిలీజ్ డేట్.. డైరెక్టర్ ఎవరంటే?
ఈ నగరానికి ఏమైంది లాంటి సినిమా.. ప్రభాస్ స్పెషల్‌ పోస్టర్‌తో జిగ్రీస్ రిలీజ్ డేట్.. డైరెక్టర్ ఎవరంటే?

బిగ్ ఫిష్ మీడియా మార్కెటింగ్

యూత్‌ఫుల్ కామెడీ సినిమాగా తెరకెక్కిన జిగ్రీస్ మూవీకి హరీష్‌ రెడ్డి ఉప్పుల దర్శకత్వం వహించారు. అలాగే, ఈ చిత్రానికి కృష్ణ వోడపల్లి నిర్మాతగా వ్యవహరించారు. మౌంట్ మెరు పిక్చర్స్ బ్యానర్‌పై జిగ్రీస్ చిత్రాన్ని రూపొందించారు. బిగ్ ఫిష్ మీడియా డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్న జిగ్రీస్‌ చిత్రం రిలీజ్‌ డేట్‌ తాజాగా ఫిక్స్ అయింది.

ఈ నగరానికి ఏమైంది వంటి

అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న జిగ్రీస్ నవంబర్ 14 థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. చిల్డ్రన్స్ డే సందర్భంగా థియేటర్లలోకి వస్తున్న జిగ్రీస్ సినిమా ప్రమోషన్స్‌ను జోరుగా చేస్తున్నారు మేకర్స్. ఈ నగరానికి ఏమైంది లాంటి యూత్ ఫుల్ మూవీ రానుందంటూ మేకర్స్ చెబుతున్నారు.

సందీప్ రెడ్డి వంగాతో టీజర్

ఇదివరకు జిగ్రీస్ టీజర్, సాంగ్స్‌ను పాపులర్ సెలబ్రిటీలతో రిలీజ్ చేయిస్తున్నారు. దీంతో జిగ్రీస్ మూవీకి మంచి బజ్ ఏర్పడుతోంది. జిగ్రీస్ టీజర్‌ను సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా రిలీజ్ చేశారు. జిగ్రీస్ టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆద్యంతం కామెడీతో ఆకట్టుకుంది. అలానే యంగ్‌ హీరో కిరణ్‌ అబ్బవరం చేతుల మీదుగా విడుదల అయిన సాంగ్ కూడా జనాల్లోకి వెళ్లింది.

ప్రభాస్ బర్త్ డే స్పెషల్‌గా

ఇక రీసెంట్‌గా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా జిగ్రీస్ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు మేకర్స్. ప్రభాస్ బర్త్ డే సందర్భంగా జిగ్రీస్‌ చిత్ర యూనిట్ ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది. ప్రభాస్ పోస్టర్ రిలీజ్ చేస్తూ బర్త్ డే విషెష్ తెలిపింది జిగ్రీస్ మూవీ టీమ్.

నవంబర్ 14న థియేటర్లలో

అదే పోస్టర్ ద్వారా జిగ్రీస్ రిలీజ్‌ డేట్‌ను కూడా ప్రకటించారు మేకర్స్. నవంబర్ 14న థియేటర్లలో రిలీజ్ కానున్నట్లు జిగ్రీస్‌ టీమ్ పేర్కొంది. ప్రమోషన్ కార్యక్రమాలలో మరింత జోరు పెంచనున్నట్లు మేకర్స్ తెలిపారు.

సందీప్ రెడ్డి వంగా చిన్నప్పటి స్నేహితుడు

అర్జున్ రెడ్డి, యానిమల్ వంటి సెన్సేషనల్ హిట్స్ కొట్టిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా చిన్నప్పటి స్నేహితుడే జిగ్రీస్ డైరెక్టర్ హరీష్‌ రెడ్డి. అందుకే ఈ సినిమాను సందీప్ రెడ్డి దగ్గరుండి మరి ప్రమోషన్ చేస్తున్నారు. జిగ్రీస్ టీమ్ చాలా ప్యాషన్‌తో పనిచేశారని, సినిమా తప్పకుండా మంచి సక్సెస్ అవుతుందని సందీప్ రెడ్డి నమ్మకంగా ఉన్నారు.