డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, అనిల్ రావిపూడి కాంబినేషన్‌గా ఈ దర్శకుడు అనిపిస్తాడు.. నటుడు వీకే నరేష్ కామెంట్స్

తెలుగు సీనియర్ నటుల్లో వీకే నరేష్ ఒకరు. నరేష్ లేటెస్ట్‌గా కీలక పాత్ర పోషించిన సినిమా కె ర్యాంప్. కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజ హీరో హీరోయిన్లుగా నటించిన కె ర్యాంప్ అక్టోబర్ 18న విడుదలైంది. సినిమా రిలీజ్‌కు ముందు నిర్వహించిన కె ర్యాంప్ ప్రెస్ మీట్‌లో నటుడు వీకే నరేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Published on: Oct 19, 2025, 07:01:28 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

టాలీవుడ్ సీనియర్ నటుల్లో వీకే నరేష్ ఒకరు. హీరోగా ఎన్నో సినిమాలతో అలరించిన ఆయన నటుడిగా నట ప్రస్థానం కొనసాగిస్తున్నారు. కామెడీ టైమింగ్‌తో అలరించే వీకే నరేష్ నటించిన లేటెస్ట్ మూవీ కె ర్యాంప్. కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజ హీరో హీరోయిన్లుగా నటించిన రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ మూవీనే కె ర్యాంప్.

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, అనిల్ రావిపూడి కాంబినేషన్‌గా ఈ దర్శకుడు అనిపిస్తాడు.. నటుడు వీకే నరేష్ కామెంట్స్
డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, అనిల్ రావిపూడి కాంబినేషన్‌గా ఈ దర్శకుడు అనిపిస్తాడు.. నటుడు వీకే నరేష్ కామెంట్స్

వీకే నరేష్ కామెంట్స్

జైన్స్ నాని దర్శకత్వం వహించిన కె ర్యాంప్ సినిమా అక్టోబర్ 18న థియేటర్లలో విడుదలైంది. అయితే, సినిమా రిలీజ్‌కు ముందు కె ర్యాంప్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నటుడు వీకే నరేష్ ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పారు.

సెకండ్ ఇన్నింగ్స్‌లో

నటుడు వీకే నరేష్ మాట్లాడుతూ.. "నా కెరీర్‌లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాక సామజవరగమన మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఇప్పుడు "కె ర్యాంప్"లో కూడా కీ రోల్ చేశాను. కిరణ్‌తో కలిసి నటించడం హ్యాపీగా ఉంది. కె ర్యాంప్ పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్" అని అన్నారు.

3 తరాల ఆడియెన్స్ చూసి

"మా మూవీ తప్పకుండా విజయం సాధిస్తుందని నమ్మకం ఉంది. అయితే ఏ రేంజ్ సక్సెస్ అనేది ఈ మూడు రోజుల్లో తెలుస్తుంది. మూడు తరాల ఆడియెన్స్ కలిసి చూసి ఎంజాయ్ చేసే చిత్రమిది. డైరెక్టర్ నాని గురించి చెప్పాలంటే అతను డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, అనిల్ రావిపూడి కాంబినేషన్‌గా అనిపిస్తాడు" అని వీకే నరేష్ అభిప్రాయపడ్డారు.

అల్లర చిల్లరగా

"ఈ రోజు సమాజంలో ఉన్న పరిస్థితులనే సినిమా రెఫ్లెక్ట్ చేస్తుంది. హీరో కుమార్ అనే క్యారెక్టర్‌ కొంచెం అల్లరి చిల్లరగా ఉంటాడు. ఆ క్యారెక్టర్‌కు తగినట్లే ఒకట్రెండు డైలాగ్స్ ఉన్నాయి. ప్రమోషనల్ కంటెంట్ కాదు మీరు సినిమా అంతా చూసి కె ర్యాంప్ ఎలా ఉందో చెప్పండి" అని సీనియర్ హీరో నరేష్ కోరారు.

డిఫరెంట్ క్యారెక్టర్

"ఈ చిత్రంలో నా క్యారెక్టర్ డిఫరెంట్‌గా ఉంటుంది. నేను చేయగలనా అని అనిపించింది. డెసిషన్ తీసుకుని ఓకే నటిస్తాను అని డైరెక్టర్‌కు ధైర్యంగా చెప్పాను. ఈ సినిమా సెకండాఫ్ ఎక్స్‌ట్రార్డినరీగా ఉంటుంది" అని నటుడు వీకే నరేష్ చెప్పుకొచ్చారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More