మెడికల్ షాప్‌లో పని చేస్తున్న తెలుగు యంగ్ హీరో.. సోషల్ మీడియాలో వీడియో వైరల్.. డ్రగ్స్ కేసులో దొరకడం కంటే అంటూ!
తెలుగు యంగ్ హీరోల్లో శివకుమార్ రామచంద్రవరపు ఒకరు. తెలుగులో సహాయ నటుడిగా పరిచయమై హీరోగా మారిన తెలుగు యంగ్ హీరో శివకుమార్ రామచంద్రవరపు ప్రస్తుతం మెడికల్ షాప్‌లో సేల్స్‌మెన్‌గా పనిచేస్తున్న వీడియోలో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..!
సినీ ఇండస్ట్రీలో పరిస్థితి పలువిధాలుగా మారిపోతుంది. అప్పటివరకు హీరోలుగా వెండితెరపై అలరించిన వాళ్లే కొన్నిసార్లు అతి సాధారణ మనిషి జీవితాన్ని గడుపుతుంటారు. అయితే, సినీ కెరీర్ ఆరంభంలో ఎలాంటి పని లేకుండా వాచ్‌మెన్ వంటి ఉద్యోగాలు చేసి ఆ తర్వాత స్టార్ యాక్టర్స్‌గా మారిన వారు ఉన్నారు.

నటన పక్కకు పెట్టి
అలాగే, నటుడిగా వెండితెరపై అలరించి ఎలాంటి అవకాశాలు లేకపోయేసరికి సెక్యూరిటా గార్డ్‌గా జీవితం అనుభవించే వారిని చూశాం. ఇటీవలే బాలీవుడ్ యాక్టర్ సవి సిద్దు సెక్యూరిటీ గార్డ్‌గా పని చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వీడియోలు తగ చక్కర్లు కొట్టాయి. అయితే, తాజాగా ఓ తెలుగు యంగ్ హీరో నటన పక్కకు పెట్టి సేల్స్ మెన్‌గా మారిపోయాడని టాక్ నడుస్తోంది.
మెడికల్ షాప్‌లో
తెలుగు సినిమాల్లో హీరోగా చేసిన ఆ యంగ్ హీరో ఇప్పుడు ఓ మెడికల్ షాప్‌లో మెడిసిన్ అమ్ముతూ కనిపించి షాక్ ఇచ్చాడు. దీంతో ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా వీటిపై మీమ్స్ కూడా వచ్చేస్తున్నాయి. ఆ మీమ్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో చక్కర్లు కొడుతున్నాయి.
పవన్ కల్యాణ్, నాని సినిమాల్లో
ఇంతకీ ఆ హీరో ఎవరంటే శివకుమార్ రామచంద్రవరపు. నాని నిన్ను కోరి, పవన్ కల్యాణ్ వకీల్ సాబ్, నాగ చైతన్య మజిలి, వరుణ్ తేజ్ తొలి ప్రేమ వంటి సినిమాల్లో సహాయ నటుడిగా, కాస్తా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు శివకుమార్ రామచంద్రవరపు.
శివకుమార్ హీరోగా చేసిన సినిమాలు
నటుడిగానే కాకుండా హీరోగా కూడా పలు తెలుగు సినిమాలతో అలరించాడు శివకుమార్ రామచంద్రవరపు. కారం దోశ, బాలుగానీ టాకీస్, సారంగదరియా, నరుడి బ్రతుకు నటన వంటి వెండితెర సినిమాల్లో హీరోగా చేశాడు శివకుమార్ రామచంద్రవరపు. వీటితోపాటు ఓటీటీ సినిమాతో కూడా మెప్పించాడు శివకుమార్.
ఓటీటీ బోల్డ్ మూవీ కూడా
బోల్డ్ అండ్ రొమాంటిక్ కంటెంట్ ఉన్న ఓటీటీ ఎరోటిక్ థ్రిల్లర్ ఎవోల్ సినిమాలో ఒక హీరోగా శివకుమార్ రామచంద్రవరపు నటించాడు. ఆహాలో ఎవోల్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, ఇలా సినిమాలతో బిజీగా ఉన్న శివకుమార్ రామచంద్రవరపు సడెన్‌గా ఓ మెడికల్ షాప్‌లో సేల్స్‌మెన్‌గా కనిపించి షాక్ ఇచ్చాడు.
డ్రగ్స్‌లో దొరకడం కంటే
మెడికల్ షాప్‌లో కస్టమర్స్‌కు మెడిసిన్ ఇస్తూ దర్శనం ఇచ్చాడు శివకుమార్ రామచంద్రవరపు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. దీంతో "అవకాశాలు లేకనే ఇలా ఏదో ఒక పని చేసుకుంటున్నాడు", "డ్రగ్స్ కేసులో దొరకడం కంటే ఇలాంటి పని చేసుకోవడం బెటర్" అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.
సినిమా షూటింగ్ అంటూ
అంతేకాకుండా "అదంతా ఏదో ఒక సినిమా షూటింగ్ అయి ఉంటుంది" అని మరొకరు అన్నారు. ఆ వీడియో విజువల్స్ చూస్తుంటే ఏదో ఒక సినిమాలో శివకుమార్ రామచంద్రవరపు మెడికల్ సేల్స్‌మెన్‌గా పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది. కానీ, అటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో, ఇటు సోషల్ మీడియాలో మెడికల్ షాప్‌లో పనిచేస్తున్న యంగ్ హీరో అంటూ శివకుమార్ రామచంద్రవరపుపై టాక్ నడుస్తోంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


