ఓటీటీలోకి ఇవాళ వచ్చేసిన తెలుగు రొమాంటిక్ కామెడీ సిరీస్- మనసుకు హత్తుకునే ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా- ఇక్కడ చూసేయండి!

ఓటీటీలోకి ఇవాళ తెలుగు రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ ఆనందలహరి స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. కొత్త హీరో హీరోయిన్లతో తెరకెక్కిన ఈ సిరీస్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా ఉంటుంది. మనసుకు హత్తుకునే సీన్లతో సాగే ఆనందలహరి ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ వివరాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Oct 17, 2025, 14:16:50 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీ కంటెంట్ ఇటీవల కాలంలో ఎక్కువగా పెరిగిపోయింది. తెలుగులోనూ సరికొత్త కాన్సెప్ట్‌లతో ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీసులు దిగుతున్నాయి. అలా తాజాగా ఇవాళ ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు రొమాంటిక్ కామెడీ సిరీస్ ఆనందలహరి.

ఓటీటీలోకి ఇవాళ వచ్చేసిన తెలుగు రొమాంటిక్ కామెడీ సిరీస్- మనసుకు హత్తుకునే ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా- ఇక్కడ చూసేయండి!
ఓటీటీలోకి ఇవాళ వచ్చేసిన తెలుగు రొమాంటిక్ కామెడీ సిరీస్- మనసుకు హత్తుకునే ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా- ఇక్కడ చూసేయండి!

ఓటీటీ రొమాంటిక్ సిరీస్

మనసుకు హత్తుకునే ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాతో తెరకెక్కిన ఈ లవ్ రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ ఆనందలహరి యువ జంట పెళ్లి చుట్టూ తిరుగుతుంది. ఈ సిరీస్‌లో భ్రమరాంబిక తుటిక, అభిషేక్ బొడ్డెపల్లి మెయిన్ లీడ్ రోల్స్ చేశారు. ఆనంద్‌గా అభిషేక్, లహరిగా భ్రమరాంబిక నటించారు.

ఆనందలహరి డైరెక్టర్

ఈ ఆనందలహరి సిరీస్‌కు సాయి వనపల్లి దర్శకత్వం, మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. ప్రవీణ్ ధర్మపురి నిర్మాతగా వ్యవహరించగా.. విజయ్ చాగంటి, రాకేష్ పట్నాయక్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్‌గా ఉన్నారు. జాయ్ సాలమన్ సంగీతం అందించారు. కట్ట రవితేజ, అశోక్ దబ్బరాజు, శ్యామ్ రఘుమజ్జి సినిమాటోగ్రాఫర్స్‌గా వర్క్ చేశారు.

ఇద్దరి గోదారోళ్ల ప్రేమకథ

ఈస్ట్ గోదావరి అబ్బాయి, వెస్ట్ గోదావరి అమ్మాయి మధ్య నడిచే పెళ్లి, లవ్ సీన్లతో ఈ సిరీస్ ఉంది. సిరీస్‌లో కామెడీ, రొమాన్స్, ఫ్యామిలీ డ్రామా, ఎమోషనల్ సీన్స్ బాగానే ఉన్నాయి. ఓ పెళ్లి దాని తర్వాత జంట ప్రవర్తించే తీరు, ప్రేమలో పడటం, కుటుంబ గొడవలు, ఆ తర్వాత విడిపోవడం వంటి కథాంశంతో ఆనందలహరి సాగినట్లు మేకర్స్ రిలీజ్ చేసిన ట్రైలర్ ద్వారా అర్థమవుతోంది.

మనసుకు హత్తుకునే సీన్స్

ఇలాంటి మనసుకు హత్తుకునే సన్నివేశాలతో ఆనందలహరి ఓటీటీలోకి ఇవాళ (అక్టోబర్ 17) వచ్చేసింది. ఆహాలో నేటి నుంచి ఆనందలహరి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. చాలా రోజుల తర్వాత ఆహా ఓటీటీ ఒరిజినల్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇంతకుముందు ఆహా ఒరిజినల్ సినిమాలు, సిరీస్‌లను అందించింది.

ఒరిజినల్ కంటెంట్‌తో

ఇటీవల కాస్తా ఆ ఒరిజినల్ కంటెంట్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు తగ్గాయి. అయితే, మళ్లీ ఆనందలహరి, చిరంజీవ వంటి సిరీస్‌లతో ఆహా తన జోరు పెంచనుందని తెలుస్తోంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More