శ్రీకాంత్ ఇష్యూ వల్ల మా సినిమా పోస్టర్స్ చించేయడం బాధేసింది.. ఇప్పుడే ఓటీటీలోకి రావడం లేదు.. డైరెక్టర్ జయశంకర్ కామెంట్స్
డైరెక్టర్ జయశంకర్ దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ అరి. మైథలాజికల్ టచ్ ఇస్తూ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన అరి సినిమా అక్టోబర్ 10న థియేటర్లలో విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంది. ఈ నేపథ్యంలో అరి సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో డైరెక్టర్ జయశంకర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
ఆర్వీ సినిమాస్ బ్యానర్‌పై రామిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి (ఆర్ వీ రెడ్డి ) సమర్పణలో శ్రీనివాస్ రామిరెడ్డి, డి, శేషురెడ్డి మారంరెడ్డి, డా. తిమ్మప్ప నాయుడు పురిమెట్ల, బీరం సుధాకర్ రెడ్డి నిర్మించిన సినిమా "అరి". లింగ గుణపనేని కో ప్రొడ్యూసర్‌గా ఈ మూవీకి వ్యవహరించారు.

అరిలోని కీలక పాత్రలు
వినోద్ వర్మ, అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్, సురభి ప్రభావతి, శుభలేఖ సుధాకర్, వైవా హర్ష కీలక పాత్రల్లో నటించారు. "పేపర్ బాయ్" చిత్రంతో ప్రతిభావంతమైన దర్శకుడుగా పేరు తెచ్చుకున్న జయశంకర్ ఈ అరి సినిమాను తెరకెక్కించారు.
మంచి వసూళ్లతో అరి
"అరి" సినిమా ఏషియన్ సురేష్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈ నెల అంటే అక్టోబర్ 10వ తేదీన వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు వచ్చి ప్రేక్షాకదరణతో మంచి వసూళ్లు సాధిస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో అరి సినిమా సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు జయశంకర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
మంచి రివ్యూస్, రేటింగ్స్
దర్శకుడు జయశంకర్ మాట్లాడుతూ.. "అరి సినిమాను సక్సెస్ చేసిన ప్రేక్షకులకు, మంచి రివ్యూస్, రేటింగ్స్ ఇచ్చిన మీడియా వారికి థ్యాంక్స్. మూవీకి స్లోగా ఓపెనింగ్స్ వచ్చి పికప్ అవుతుందని ముందే అనుకున్నాం" అని అన్నారు.
కష్టపడిన సినిమాకు ఇలా అయిందేంటని
"అయితే రెండో రోజునే శ్రీకాంత్ అయ్యంగార్ ఇష్యూ వల్ల మా సినిమా పోస్టర్స్‌ను థియేటర్స్ దగ్గర చించివేయడం చూసి బాధగా అనిపించింది. ఎంతో కష్టపడి చేసిన సినిమాకు ఇలా జరుగుతుందేంటని ఇబ్బందిపడ్డాం. ఆ తర్వాత ఆ వివాదం సద్దుమణిగింది. థర్డ్ డే నుంచి అరి సినిమా థియేటర్స్‌లో ప్రేక్షకుల సందడి కనిపించింది" అని జయశంకర్ తెలిపారు.
పరిష్కారం చూపించలేదు
"అరిషడ్వర్గాల గురించి ఎంతోమంది గొప్పవాళ్లు చెబుతూ వచ్చారు. గానీ వాటికి పరిష్కారం చూపించలేదు. ఈ ఆలోచనతోనే అరి చిత్రాన్ని రూపొందించాను. నేను చూసిన సినిమాలు కొన్ని ఇలాంటి కాన్సెప్ట్‌తో చిత్రాన్ని చేసేందుకు స్ఫూర్తినిచ్చాయి" దర్శకుడు జయశంకర్ పేర్కొన్నారు.
ఓటీటీలోకి రావడం లేదు
"ఈ అరి సినిమా కథతో త్వరలోనే పుస్తకాన్ని తీసుకొస్తున్నాం. మా సినిమా ఇప్పుడే ఓటీటీలోకి రావడం లేదు. థియేట్రికల్ రన్ కంప్లీట్ అయ్యాక ఓటీటీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తాం" అని అరి డైరెక్టర్ జయశంకర్ వెల్లడించారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


