డైస్ ఈరే రివ్యూ- భయంతో వణికించే హారర్ థ్రిల్లర్- సూపర్ స్టార్ మోహన్ లాల్ కొడుకు ప్రణవ్ మూవీ ఎలా ఉందంటే?
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కుమారుడు ప్రణవ్ మోహన్ లాల్ తెలుగులో ఎంట్రీ ఇచ్చిన సినిమా డైస్ ఈరే. హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ అందుకుంది. తాజాగా నవంబర్ 7న థియేటర్లలో తెలుగులో రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ఎలా ఉందో నేటి డైస్ ఈరే రివ్యూలో తెలుసుకుందాం.
టైటిల్: డైస్ ఈరే (Dies Irae Movie)

నటీనటులు: ప్రణవ్ మోహన్ లాల్, గిబిన్ గోపీనాథ్, సుష్మిత భట్, షైన్ టామ్ చాకూ, జయ కురుప్, అరుణ్ అజికుమార్, శ్రీధాన్య తదితరులు
దర్శకత్వం: రాహుల్ సదాశివన్
సంగీతం: క్రిస్టో జేవియర్
సినిమాటోగ్రఫీ: షెహనాద్ జలాల్
ఎడిటింగ్: షఫీక్ మహమ్మద్ అలీ
నిర్మాతలు: చక్రవర్తి రామచంద్ర, ఎస్ శశికాంత్
తెలుగు రిలీజ్ డేట్: నవంబర్ 7, 2025
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కుమారుడు ప్రణవ్ మోహన్ లాల్ నటించిన లేటెస్ట్ హారర్ థ్రిల్లర్ సినిమా డైస్ ఈరే. భూతకాలం, భ్రమయుగం వంటి హారర్ థ్రిల్లర్స్‌తో మంచి క్రేజ్ తెచ్చుకున్న డైరెక్టర్ రాహుల్ సదాశివన్ ఈ సినిమాను తెరకెక్కించారు. అక్టోబర్ 31న మలయాళం రిలీజ్ అయిన ఈ సినిమా మంచి హిట్ అందుకుంది. దాదాపుగా రూ. 50 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది.
ఇప్పుడు తెలుగు ఆడియెన్స్ ముందుకు తెలుగులో వచ్చేసింది డైస్ ఈరే. నవంబర్ 7న తెలుగు రాష్ట్రాల థియేటర్లలో డైస్ ఈరే రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ఎలా ఉందో నేటి డైస్ ఈరే రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
రోహన్ (ప్రణవ్ మోహన్‌లాల్) ఒక ఆర్కిటెక్ట్. అలాగే, బాగా డబ్బున్న వ్యక్తి కొడుకు. జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ ఒంటరిగా రూమ్‌లో ఉంటాడు. తన ఫ్రెండ్ కని (సుష్మిత భట్) ఆత్మహత్య చేసుకుందని తెలిసి ఆమె తల్లిదండ్రులను పరామర్శించడానికి వెళ్తాడు రోహన్.
అక్కడి నుంచి తన ఇంటికి వచ్చిన రోహన్‌కు విచిత్ర సంఘటనలు ఎదరవుతుంటాయి. పరిస్థితి అంత ఇబ్బందికరంగా మారుతుంది. తనను ఏదో ఆత్మ వెంటాడుతుందని భావిస్తాడు. ఇదే విషయాన్ని కని పక్కింట్లో ఉండే మధు (గిబిన్ గోపీనాథ్) చెప్పి సాయం అడుగుతాడు.
హార్రిఫిక్ ట్విస్టులు
ఆ తర్వాత ఏమైంది? రోహన్‌ను దెయ్యం ఎందుకు వెంటాడింది? దానికి కారణం ఏంటీ? రోహన్ వెంట పడుతున్న దెయ్యం నిజంగా కనియేనా? కని, రోహన్ మధ్య ఉన్న సంబంధం ఏంటీ? కని తమ్ముడు కూడా ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు? అసలు కని ఎందుకు, ఎలా చనిపోయింది? కని గదిలో మాయమైన వస్తువులు ఏంటీ? ఆత్మ నుంచి రోహన్ బయటపడ్డాడా? వంటి విషయాలు తెలియాలంటే డైస్ ఈరే చూడాల్సిందే.
విశ్లేషణ:
ఇప్పటికీ ఎన్నో భాషల్లో ఎన్నో రకాల హారర్ థ్రిల్లర్ సినిమాలు వచ్చాయి. ప్రతిదాంట్లో కామన్‌గా ఉండే ఎలిమెంట్ మనుషులను దెయ్యాలు వెంటాడటం. దానికి ఉండే కథ ఎప్పుడు రెగ్యులర్‌గానే ఉంటుంది. కానీ, దాన్ని నడిపించే కథనం ఎంత థ్రిల్లింగ్‌గా, భయపెట్టేలా ఉంటే ఆ సినిమా చాలా హిట్ అవుతుంది.
అందులో డైస్ ఈరే సూపర్ హిట్ కొట్టిందని చెప్పాలి. అయితే, సినిమా స్టోరీ, జరిగే సంఘటనలను ముందుగానే గెస్ చేసేలా ఉంటాయి. కానీ, అవి మలిచిన తీరు మాత్రం చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. సూసైడ్ నుంచి భయపెట్టిన తీరు వరకు చాలా డిఫరెంట్‌గా ప్రజంట్ చేశారు.
ఫస్టాఫ్ అంతా కని సూసైడ్, రోహన్‌ను దెయ్యం వెంటాడం, కని, రిలేషన్‌తో సాగుతుంది. ఇంటర్వెల్‌లో వచ్చే ట్విస్ట్ మైండ్ బ్లాక్ చేస్తుంది. అప్పటివరకు ఆడియెన్స్ అనుకున్న పాయింట్ మారిపోతుంది. ఇక సెకండాఫ్ అంతా ఇన్వెస్టిగేషన్ మోడ్‌లోకి వెళ్తుంది. ఇలా జరుగుతుందని ప్రేక్షకుడు ముందుగానే గెస్ చేసేలా ఉంటుంది.
కనెక్ట్ చేసే విధానం
కానీ, అది ఎలా జరుగుతుందనేది చాలా థ్రిల్లింగ్‌గా చూపించారు. కథ, సీన్స్ గెస్ చేసేలా ఉన్నా వాటిని కనెక్ట్ చేసే విధానంలో డైరెక్టర్ రాహుల్ సదాశివన్ బెస్ట్ అనిపించుకున్నారు. ఇక కొన్ని సౌండ్స్‌తో భయపెట్టిన తీరు బాగుంది. దెయ్యం వెంటాడే సీన్స్ కూడా బాగున్నాయి.
క్లైమాక్స్ ట్విస్ట్ బాగుంది. రెండో పార్ట్‌కు ఇచ్చే లీడ్ ఫన్నీగా ఉంటూ భయపెట్టేలా ఉంది. సినిమాలో సినిమాటోగ్రఫీ అతిపెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పాలి. విజువల్స్ అదిరపోయాయి. కొన్ని సీన్స్ సీట్‌లో జర్క్ ఇచ్చేలా ఉంటాయి. ఎడిటింగ్ బాగుంది. బీజీఎమ్ అదిరిపోయింది. ఆర్గానిక్‌గా సౌండింగ్స్ ఉన్నాయి.
డిఫరెంట్‌గా చూపించడంలో
రొటీన్ స్టోరీని డిఫరెంట్‌గా చూపించడంలో మరోసారి బెస్ట్ అనిపించుకున్నారు డైరెక్టర్ రాహుల్ సదాశివన్. ప్రణవ్ మోహన్‌లాల్ మెచ్యూర్డ్ పర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్నాడు. సుష్మిత భట్, గిబిన్ గోపీనాథ్ అదరగొట్టారు. ఇతర పాత్రలు కూడా తమ బెస్ట్ ఇచ్చారు. ఫైనల్‌గా చెప్పాలంటే వణుకుపుట్టిన మిస్ అవ్వకూడని హారర్ థ్రిల్లర్ డైస్ ఈరే.
రేటింగ్: 3.5/5
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


