ఓటీటీలోకి ఇవాళ వచ్చేసిన హారర్ థ్రిల్లర్- కోరికలు తీర్చమనే 4 దెయ్యాలు- 9.2 రేటింగ్- సంవత్సరం తర్వాత స్ట్రీమింగ్
ఓటీటీలోకి ఇవాళ హారర్ కామెడీ థ్రిల్లర్ మూవీ మిస్టర్ షుడాయి స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. హీరో వెంట తమ కోరికలు తీర్చమని నాలుగు దెయ్యాలు వెంటపడే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. ఐఎమ్‌డీబీ నుంచి 9.2 రేటింగ్ సాధించిన మిస్టర్ షుడాయి ఓటీటీ రిలీజ్ ప్లాట్‌ఫామ్ ఏంటో, ఎక్కడ చూడాలో ఇక్కడ తెలుసుకుందాం.
ఓటీటీలోకి ప్రతివారం అంటే రోజుకొకటి చొప్పున ఎన్నో సినిమాలు స్ట్రీమింగ్ అవుతూనే ఉంటాయి. అయితే, వారంలో గురు, శుక్రవారాల్లో అధికంగా సినిమాలు ఓటీటీ రిలీజ్ అవుతుంటాయి. అలా ఇవాళ కూడా ఐదారు సినిమాల వరకు డిజిటల్ ప్రీమియర్ అయ్యాయి. వాటిలో ఓ సినిమా ఇంట్రెస్టింగ్‌గా మారింది.

కామెడీ హారర్ థ్రిల్లర్
ఆ సినిమా మిస్టర్ షుడాయి. కామెడీ హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు హర్జోత్ సింగ్ దర్శకత్వం వహించారు. మోహంబిర్ బాల్ నిర్మాతగా వ్యవహరించారు. ఇందులో హర్సిమ్రన్, మ్యాండీ థాకర్, కరంజిత్ అన్మోల్ ప్రధాన పాత్రలు పోషించారు. నిషా బానో, సుఖ్విందర్ చాహల్, మల్కీత్ రౌనీ, నవ్ లెహల్, ఖుషి జౌర తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.
రేటింగ్ అండ్ ఫ్రెష్ కంటెంట్
గతేడాది జూన్ 21న థియేటర్లలో విడుదలైన మిస్టర్ షుడాయి సినిమా మంచి రెస్పాన్స్ అందుకుంది. ఏకంగా ఐఎమ్‌డీబీ నుంచి పదికి 9.2 రేటింగ్ సొంతం చేసుకుంది. అంతేకాకుండా రొట్టెన్ టొమాటోస్ నుంచి 80 శాతం ఫ్రెష్ కంటెంట్‌గా పేరు తెచ్చుకుంది. అలాంటి మిస్టర్ షుడాయి ఓటీటీలోకి ఇవాళ (అక్టోబర్ 30) వచ్చేసింది.
చౌపల్ ఓటీటీలో
సుమారు సంవత్సరానికిపైగా కాలం తర్వాత మిస్టర్ షుడాయి ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చింది. చౌపల్ ఓటీటీలో నేటి నుంచి మిస్టర్ షుడాయి డిజిటల్ ప్రీమియర్ అవుతోంది. ఇది ఒక పంజాబీ సినిమా. అందుకే ప్రస్తుతం చౌపల్‌లో కేవలం పంజాబీ భాషలో మాత్రమే మిస్టర్ షుడాయి ఓటీటీ రిలీజ్ అయింది.
లవర్ బ్రేకప్ చెప్పడంతో
మిస్టర్ షుడాయి సినిమా కథ విషయానికొస్తే ఇందులో హీరో తన లవర్ బ్రేకప్ చెప్పి మరో వ్యక్తితో వెళ్లిపోతుంది. దాంతో హీరో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయి సూసైడ్ చేసుకుని చనిపోవాలనుకుంటాడు. కానీ, ఎన్నిసార్లు ప్రయత్నించిన ఆత్మహత్య చేసుకోవడం కుదరదు. ఓసారి మాత్రం అనుకోకుండా రోడ్డుపై నడుస్తుండగా కారు గుద్దుతుంది.
మార్చురీ నుంచి లేచే హీరో
కారు యాక్సిడెంట్‌లో హీరో చనిపోతాడు. డాక్టర్స్ అంతా చనిపోయారని భావించి మార్చురీలో హీరోను పడేస్తారు. తర్వాత అనూహ్యంగా మార్చురిలో నుంచి బతికి లేస్తాడు హీరో. ఆ తర్వాత హీరోకు కేవలం నాలుగు దెయ్యాలు కనిపిస్తుంటాయి. అవి కనిపించి తమ కోరికలు హీరోనే తీర్చాలని వెంటపడతాయి.
దెయ్యాల కోరికలు తీర్చాడా?
అదంతా ముందు అర్థం కానీ హీరో తలబాదుకుంటాడు. మరి వాటి కోరికలు తీర్చేందుకు హీరో ఒప్పుకున్నాడా? వారి కోరికలు ఎలా తీర్చాడు? అసలు వాళ్లు ఎవరు? ఈ క్రమంలో హీరో ఎదుర్కొన్న సమస్యలు ఏంటీ? అనేదే మిగతా మిస్టర్ షుడాయి సినిమా స్టోరీ.
రాక్షసుడు సినిమాల కాకుండా
అయితే, ఇది చూసేందుకు సూర్య నటించిన రాక్షసుడు మూవీ కథలా అనిపిస్తుంది. కానీ, కాన్సెప్ట్ కాస్తా ఒకేలా ఉన్నా ఈ నాలుగు దెయ్యాల కోరికలు తీర్చే విధానం వేరేలా ఉంటుంది. అదే ఇందులో యూనిక్ పాయింట్ అని చెప్పొచ్చు. మరి అదేంటనేది తెలియాలంటే అనేది తెలియాలంటే చౌపల్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న మిస్టర్ షుడాయి చూడాల్సిందే.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


