ఓటీటీలోకి ఇవాళ వచ్చిన 5 సినిమాలు- తెలుగులో ఒకే ఒక్కటి ఇంట్రెస్టింగ్- హారర్ నుంచి బోల్డ్, క్రైమ్ థ్రిల్లర్ వరకు!

ఓటీటీలోకి ఇవాళ ఐదు సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో ఒకే ఒక్కటి మాత్రమే తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా ఓటీటీ రిలీజ్ అయింది. అలాగే, మిగతా నాలుగు సినిమాలు కూడా చూసేందుకు స్పెషల్‌గా ఉన్నాయి. హారర్ నుంచి బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్ వరకు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ఆ సినిమాలు ఏంటో ఇక్కడ చూద్దాం.

Published on: Oct 30, 2025, 12:24:58 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీలోకి ప్రతివారం సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు డిజిటల్ స్ట్రీమింగ్ అయి ఎంటర్‌టైన్ చేస్తుంటాయి. ఈ వారం కూడా ఎన్నో సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. అయితే, వీటిలో ఇవాళ (అక్టోబర్ 30) ఒక్కరోజే ఐదు సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయ.

ఓటీటీలోకి ఇవాళ వచ్చిన 5 సినిమాలు- తెలుగులో ఒకే ఒక్కటి ఇంట్రెస్టింగ్- హారర్ నుంచి బోల్డ్, క్రైమ్ థ్రిల్లర్ వరకు!
ఓటీటీలోకి ఇవాళ వచ్చిన 5 సినిమాలు- తెలుగులో ఒకే ఒక్కటి ఇంట్రెస్టింగ్- హారర్ నుంచి బోల్డ్, క్రైమ్ థ్రిల్లర్ వరకు!

టుడే ఓటీటీ రిలీజ్ సినిమాలు

వాటిలో ఒక్కటి మాత్రమే ఇంట్రెస్టింగ్‌గా తెలుగులో ఓటీటీ రిలీజ్ అయింది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, సన్ నెక్ట్స్, హంగామా, చౌపల్ ప్లాట్‌ఫామ్స్‌లలో నేటి నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ఆ సినిమాలు, వాటి జోనర్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

బ్లాక్ మెయిల్ ఓటీటీ

తమిళంలో క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన సినిమా బ్లాక్ మెయిల్. మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా నటించిన ఈ సినిమాలో తేజు అశ్విని, చంద్రిక రవి, బిందు మాధవి హీరోయిన్లుగా చేశారు. అలాగే, ఈ సినిమాలో మరో హీరో శ్రీరామ్ కూడా యాక్ట్ చేశాడు. రమేష్ తిలక్ మరో పాత్ర పోషించాడు.

ము మారన్ దర్శకత్వం వహించిన బ్లాక్ మెయిల్ మంచి విజయం సాధించింది. మంచి హిట్ అందుకున్న బ్లాక్ మెయిల్ ఓటీటీలోకి ఇవాళ వచ్చేసింది. సన్ నెక్ట్స్‌లో నేటి నుంచి బ్లాక్ మెయిల్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

ది విచర్ సీజన్ 4 ఓటీటీ

హాలీవుడ్ సిరీస్‌ల్లో పాపులర్ అయిన వాటిలో ది విచర్ ఒకటి. ఇప్పటికీ మూడు సీజన్స్‌ను సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకున్న ఈ సిరీస్ నుంచి తాజాగా నాలుగో సీజన్ కూడా వచ్చేసింది. హారర్, యాక్షన్, అడ్వెంచర్ ఫాంటసీ థ్రిల్లర్‌గా సాగే ది విచర్ సీజన్ 4 ఓటీటీ రిలీజ్ అయింది.

ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ప్లాట్‌పామ్‌లో ది విచర్ 4 నేటి నుంచి డిజిటల్ ప్రీమియర్ అవుతోంది. ఇంగ్లీష్‌తోపాటు తెలుగు, హిందీ, తమిళం వంటి నాలుగు భాషల్లో ఇవాళ్టీ నుంచి ది విచర్ సీజన్ 4 ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

డర్టీ స్కామ్స్ ఓటీటీ

హిందీలో బోల్డ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన సిరీస్ డర్టీ స్కామ్స్. ఎక్కువగా రొమాంటిక్ సన్నివేశాలతో స్కామ్స్ చేసే కథలతో ఈ సిరీస్ రూపొందింది. అడల్ట్ కంటెంట్, స్కామ్స్, రివేంజ్, మోసం వంటి అంశాలతో తెరకెక్కిన డర్టీ స్కామ్స్ ఓటీటీ రిలీజ్ అయింది. హంగామాలో హిందీ భాషలో నేటి నుంచి డర్టీ స్కామ్స్ ఓటీటీ ప్రీమియర్ అవుతోంది.

మిస్టర్ షుడాయి ఓటీటీ

కామెడీ ఫాంటసీ హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రం మిస్టర్ షుడాయి. హర్జోత్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా థియేటర్లలో జూన్ 21న గతేడాది విడుదలైంది. సంవత్సరం దాటిన తర్వాత మిస్టర్ షుడాయి ఓటీటీలోకి వచ్చేసింది. పంజాబీ చిత్రమైన మిస్టర్ షుడాయి చౌపల్ ఓటీటీలో డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది.

కుయిలి ఓటీటీ

తమిళంలో సోషల్ థ్రిల్లర్ డ్రామా చిత్రంగా తెరకెక్కిందే కుయిలి. ఓ విధవ రాలు రాజకీయాల్లోకి వెళ్తే అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన కుయిలి ఇదివరకే బీసీఐనీట్ (bcineet ott) ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ఇవాళ (అక్టోబర్ 31) మరో ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్‌లో కూడా నేటి నుంచి కుయిలి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More