తెలుగులో హారర్ థ్రిల్లర్‌తో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కుమారుడు ప్రణవ్ ఎంట్రీ.. శ్రీ స్రవంతి మూవీస్‌తో రిలీజ్
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కుమారుడు ప్రణవ్ మోహన్ లాల్ తెలుగులో గ్రాండ్‌గా ఎంట్రీ ఇస్తున్న సినిమా డియాస్ ఇరాయ్. మిస్టరీ హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్ రిలీజ్ చేస్తోంది. నవంబర్‌లో డియాస్ ఇరాయ్ తెలుగు వెర్షన్‌ను విడుదల చేయనున్నారు.
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తనయుడిగా చిత్రసీమలో అడుగు పెట్టిన హీరో ప్రణవ్ మోహన్ లాల్. మోహన్ లాల్ కుమారుడిగా హీరోగా ఎంట్రీ ఇచ్చిన ప్రణవ్ మోహన్ లాల్ అతి తక్కువ సమయంలోనే తనకంటూ ఒక స్పెషల్ మార్క్ క్రియేట్ చేసుకున్నారు.

హృదయం మూవీతో
మలయాళంలో సూపర్ హిట్ మూవీ'హృదయం'తో భాషలకు అతీతంగా ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదించుకున్నారు. ఇప్పుడు ప్రణవ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'డియాస్ ఇరాయ్'. మిస్టరీ హారర్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాను తెలుగులో కూడా విడుదల కానుంది.
తెలుగు రాష్ట్రాల్లో
తెలుగు రాష్ట్రాల్లో డియాస్ ఇరాయ్ సినిమాను సుప్రసిద్ధ నిర్మాణ సంస్థ శ్రీ స్రవంతి మూవీస్ విడుదల చేస్తోంది. ఈ సినిమాతో తెలుగులో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు సూపర్ స్టార్ మోహన్ లాల్ కుమారుడు ప్రణవ్. దీంతో ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అవుతోంది.
కమల్ హాసన్ నుంచి ధనుష్ వరకు
అయితే, కమల్ హాసన్ 'పుష్పక విమానం', 'నాయకుడు' నుంచి ధనుష్ 'రఘువరన్ బీటెక్' వరకు తెలుగులో శ్రీ స్రవంతి మూవీస్ విడుదల చేసిన పరభాషా సినిమాలు భారీ విజయాలు సాధించడంతో పాటు విమర్శకుల, ప్రేక్షకుల ప్రశంసలు పొందాయి. అందువల్ల, 'డియాస్ ఇరాయ్' మీద ప్రేక్షకులతో పాటు బిజినెస్ వర్గాల్లో అంచనాలు ఏర్పడ్డాయి.
సెలెక్టివ్‌గా కథల ఎంపిక
'హృదయం' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ప్రణవ్ మోహన్ లాల్ వరుసగా సినిమాలు చేయలేదు. సెలెక్టివ్‌గా కథలు ఎంపిక చేసుకుంటూ వస్తున్నారు. 'భూత కాలం', మమ్ముట్టి 'భ్రమ యుగం' చిత్రాలకు దర్శకత్వం వహించిన రాహుల్ సదాశివన్ ఈ 'డియాస్ ఇరాయ్'ను తెరకెక్కించారు.
తెలుగు రాష్ట్రాల్లో మలయాళ వెర్షన్
మలయాళ, తమిళ భాషల్లో అక్టోబర్ 31న ఈ డియాస్ ఇరాయ్ సినిమా విడుదల కానుంది. తెలుగు రాష్ట్రాల్లోనూ 'డియాస్ ఇరాయ్' మలయాళ వెర్షన్‌ను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు శ్రీ స్రవంతి మూవీస్ అధినేత రవికిశోర్.
నవంబర్‌లో తెలుగు వెర్షన్
సుష్మితా భట్, జిబిన్ గోపీనాథ్, జయ కురుప్, మనోహరి జాయ్, అరుణ్ అజికుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన 'డియాస్ ఇరాయ్' తెలుగు వెర్షన్‌ను నవంబర్ తొలి వారంలో థియేటర్లలో విడుదల చేయనున్నారు.
ఆ సినిమాల జాబితాలో
విభిన్న కథలతో తెరకెక్కిన 'ప్రేమలు', '2018', 'మంజుమ్మేల్ బాయ్స్', 'కొత్త లోక' వంటి మలయాళ సినిమాలకు తెలుగులో చక్కటి ఆదరణ లభించింది. ఆయా సినిమాలు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఆ జాబితాలో 'డియాస్ ఇరాయ్' కూడా చేరుతుందని చిత్ర బృందం భావిస్తోంది.
డియాస్ ఇరాయ్ బ్యానర్
ప్రణవ్ మోహన్ లాల్ హీరోగా రాహుల్ సదాశివన్ రచన, దర్శకత్వంలో రూపొందిన 'డియాస్ ఇరాయ్' చిత్రాన్ని నైట్ షిఫ్ట్ స్టూడియోస్, వైనాట్ స్టూడియోస్ సంస్థలపై చక్రవర్తి రామచంద్ర, ఎస్ శశికాంత్ నిర్మించారు. ఈ చిత్రానికి క్రిస్టో జేవియర్ సంగీతం అందించారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


