ఓటీటీలోకి నిన్న రిలీజైన నయా హారర్ కామెడీ థ్రిల్లర్ మూవీ థామా- బేతాళిగా రష్మిక మందన్నా- తెలుగులో స్ట్రీమింగ్- ఎక్కడంటే?
ఓటీటీలోకి రష్మిక మందన్నా నయా హారర్ కామెడీ థ్రిల్లర్ మూవీ థామా స్ట్రీమింగ్‌కు కానుంది. ఈ సినిమాలో బేతాళిగా రష్మిక మందన్నా యాక్ట్ చేసింది. అక్టోబర్ 21న థియేటర్లలో విడుదలైన థామా సినిమా మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. ఈ నేపథ్యంలో థామా ఓటీటీ రిలీజ్ ప్లాట్‌ఫామ్ ఇంట్రెస్టింగ్‌గా మారింది.
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా వరుస పెట్టి సినిమాలతో దూసుకుపోతోంది. కిర్రిక్ పార్టీతో తమిళంలో, ఛలో సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా ఇంట్రడ్యూస్ అయిన బ్యూటిఫుల్ రష్మిక మందన్నా టాలీవుడ్‌లో గీత గోవిందం మూవీతో మంచి క్రేజ్ సంపాదించుకుంది.

అమాంతం పెరిగిన గ్రాఫ్
ఆ తర్వాత వరుస పెట్టి స్టార్ హీరోలతో సినిమాలు చేసి నేషనల్ క్రష్‌గా మారిపోయింది. ఇక సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ సరసన పుష్ప మూవీలో నటించిన రష్మిక మందన్నా కెరీర్ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. పుష్ప తర్వాత బాలీవుడ్‌లోనూ ఎన్నో ఛాన్స్‌లు కొట్టేసింది ఈ ముద్దుగుమ్మ.
థియేటర్లలో థామా చిత్రం
గుడ్ బై, మిషన్ మజ్ను, యానిమల్, పుష్ప 2, ఛావా, సికందర్, కుబేర వంటి సినిమాలతో సత్తా చాటింది రష్మిక. ఇక ప్రస్తుతం తెలుగు ది గర్ల్‌ఫ్రెండ్ మూవీతో అలరించడానికి సిద్ధంగా ఉంది రష్మిక మందన్నా. ఇదిలా ఉంటే, తాజాగా థియేటర్లలో విడుదలైన రష్మిక మందన్నా హిందీ చిత్రం థామా (Thamma Movie).
మాడాక్ ఫిల్మ్స్ యూనివర్స్
మాడాక్ ఫిల్మ్ యూనివర్స్‌లో భాగంగా సరికొత్తగా వచ్చిన హారర్ కామెడీ థ్రిల్లర్ మూవీ ఇది. ఇదివరకు ఈ యూనివర్స్‌లో వచ్చిన స్త్రీ, భేడియా, ముంజ్యా, స్త్రీ 2 సినిమాలు వచ్చి మంచి హిట్ అందుకున్నాయి. ఇప్పుడు ఈ ఫిల్మ్ బ్యానర్ నుంచి సరికొత్తగా థామా థియేట్రికల్ రిలీజ్ అయింది.
ముంజ్యా డైరెక్టర్‌తో
నీరెన్ భట్ కథ రాసిన థామాకు ముంజ్యా డైరెక్టర్ ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వం వహించారు. దినేష్ విజన్, అమర్ కౌశిక్ నిర్మించిన థామా సినిమాలో రష్మిక మందన్నాతోపాటు ఆయుష్మాన్ ఖురానా, నవాజుద్ధీన్ సిద్ధిఖి ప్రధాన పాత్రలు పోషించారు. పరేష్ రావల్ కీలక పాత్ర పోషించారు.
బెతాళిగా రష్మిక మందన్నా
థామా ఒక రొమాంటిక్ లవ్ హారర్ కామెడీ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ. ఇందులో రష్మిక మందన్నా బేతాళి (మనిషి రక్తం తాగే తోడేలు వంటి జాతి)గా నటించింది. బేతాళి అయిన రష్మిక, మనిషి అయిన ఆయుష్మాన్ ఖురానాతో లవ్ ట్రాక్, హీరో కూడా బేతాళుడులా మారిపోవడం వంటి అంశాలతో ఇంట్రెస్టింగ్‌గా సినిమాను తెరకెక్కించారు.
థామా ఓటీటీ రైట్స్
కాగా, థామా సినిమా భారీ అంచనాలతో అక్టోబర్ 21న థియేటర్లలోకి వచ్చేసింది. థామా సినిమాకు మంచి రెస్పాన్సే వస్తోంది. ఈ నేపథ్యంలో థామా ఓటీటీ స్ట్రీమింగ్‌పై ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. అయితే, థియేట్రికల్ విడుదలకు ముందే థామా ఓటీటీ రైట్స్ (Thamma OTT Rights) అమ్ముడు పోయాయి.
అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో
ప్రముఖ సంస్థ అమెజాన్ ప్రైమ్ థామా ఓటీటీ హక్కులను కొనుగోలు చేసింది. దీనికి సంబంధించి మాడాక్ ఫిల్మ్స్‌తో ప్రైమ్ వీడియో డీల్ కుదుర్చుకుంది. కాబట్టి, అమెజాన్ ప్రైమ్‌లోనే థామా ఓటీటీ రిలీజ్ కానుంది.
తెలుగులోనూ థామా ఓటీటీ స్ట్రీమింగ్
అంతేకాకుండా హిందీతోపాటు తెలుగులో కూడా థామా ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే, థామా బాక్సాఫీస్ కలెక్షన్స్, ఆడియెన్స్ టాక్, థియేట్రికల్ రన్ వంటి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని ఓటీటీ ప్రీమియర్ చేయనున్నారు మేకర్స్.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


