ఓటీటీ రిలీజ్ రోజు నుంచే ట్రెండింగ్‌లో తెలుగు సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్- తమిళ్, మలయాళం తరహాలో రా అండ్ రస్టిక్‌గా!

ఓటీటీ రిలీజ్ రోజు నుంచే ట్రెండింగ్‌లోకి వచ్చేసింది తెలుగు సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా దక్ష ది డెడ్‌లీ కాన్‌స్పిరసీ. మంచు లక్ష్మీ, మంచు మోహన్ బాబు కీలక పాత్రలు పోషించిన దక్ష ది డెడ్‌లీ కాన్‌స్పిరసీ ఓటీటీ రిలీజ్ అయింది. ఆరోజునుంచే ట్విట్టర్‌లో దక్ష మూవీ ట్రెండ్ అవుతోంది.

Published on: Oct 18, 2025, 09:32:03 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలుగులో కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలు ఇటీవల కాలంలో ఎక్కువగా స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఓటీటీ ఆడియెన్స్ కోరుకున్నవిధంగా థ్రిల్లింగ్ సీన్స్, సర్‌ప్రైజ్ చేసే కథలతో తెలుగు సినిమాలు వస్తున్నాయి. అలాగే, తమిళం, మలయాళం తరహాలో రా అండ్ రస్టిక్‌గా చిత్రాలను తెరకెక్కిస్తున్నారు.

ఓటీటీ రిలీజ్ రోజు నుంచే ట్రెండింగ్‌లో తెలుగు సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్- తమిళ్, మలయాళం తరహాలో రా అండ్ రస్టిక్‌గా!
ఓటీటీ రిలీజ్ రోజు నుంచే ట్రెండింగ్‌లో తెలుగు సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్- తమిళ్, మలయాళం తరహాలో రా అండ్ రస్టిక్‌గా!

పోలీస్ ఆఫీసర్‌గా మంచు లక్ష్మి

అలాంటి సినిమానే తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. ఆ మూవీనే దక్ష ది డెడ్‌లీ కాన్‌స్పిరసీ. తెలుగులో సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో కాస్తా భయపెట్టే హారర్ అంశాలు కూడా ఉన్నాయి. మంచు లక్ష్మీ పోలీస్ ఆఫీసర్‌గా మెయిన్ లీడ్ రోల్ చేసిన ఈ సినిమాలో కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు కీలక పాత్ర పోషించారు.

తండ్రికూతురు తొలిసారిగా

ఇలా తండ్రికూతురు తొలిసారిగా కలిసి నటించిన సినిమా దక్ష ది డెడ్‌లీ కాన్‌స్పిరసీ మంచి బజ్ క్రియేట్ చేసుకుంది. దక్ష ది డెడ్‌లీ కాన్‌స్పిరసీ సినిమాకు వంశీ కృష్ణ మల్లా దర్శకత్వం వహించారు. శ్రీలక్ష్మి ప్రసన్న పిక్చర్స్ అండ్ మంచు ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై రూపుదిద్దుకుంటున్న దక్ష మూవీని రూపొందించారు.

ఏలియన్ దాడి, వింత వ్యాధి

సెప్టెంబర్ 19న థియేటర్లలో విడుదలైన దక్ష ది డెడ్‌లీ కాన్‌స్పిరసీ సినిమా బాగానే ఆకట్టుకుంది. ఓ మాస్క్ మ్యాన్, ఏలియన్ దాడి, వింత వ్యాధి చుట్టూ క్రైమ్, ఇన్వెస్టిగేటివ్, హారర్ అంశాలతో దక్ష సినిమాను తెరకెక్కించారు. కొన్ని సీక్వెన్స్ తమిళ్, మలయాళంలో చూపించేవిధంగా దక్షలో రా అండ్ రస్టిక్ ఎలిమెంట్స్ ఉన్నాయి.

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో

అలాగే, గూస్‌బంప్స్ మూమెంట్స్‌తో కొన్ని సన్నివేశాలు ఉన్నాయి. మంచు లక్ష్మికి ఈ సినిమాతో మంచి పాత్ర పడిందని టాక్ వినిపించింది. అలాగే, మోహన్ బాబు పాత్ర సినిమాకు హైలెట్‌గా నిలిచిందని రివ్యూస్ వచ్చాయి. ఇలాంటి దక్ష ది డెడ్‌లీ కాన్‌స్పిరసీ ఓటీటీలోకి వచ్చేసింది. అక్టోబర్ 17 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో దక్ష ది డెడ్‌లీ కాన్‌స్పిరసీ ఓటీటీ రిలీజ్ అయింది.

నెంబర్ వన్ ట్రెండింగ్‌లో

అయితే, ఓటీటీ రిలీజ్ రోజు నుంచే ట్విటర్‌లో దక్ష మూవీ నెంబర్ వన్ స్థానంలో ట్రెండింగ్ అవుతోంది. ప్రైమ్ వీడియోలోకి దక్ష వచ్చేసింది అన్నట్లుగా ట్విటర్‌లో ట్రెండ్ అవుతోంది దక్ష ది డెడ్‌లీ కాన్‌స్పిరసీ సినిమా. ఈ విషయాన్ని తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేసుకున్నారు మంచు లక్ష్మి.

దివాళీ పండుగకు

"యాయ్.. ట్రెండింగ్ #1 ఆన్ ట్విట్టర్" అని మంచు లక్ష్మీ తన ఇన్‌స్టా స్టోరీలో దక్ష ది డెడ్‌లీ కాన్‌స్పిరసీ ఓటీటీ రిలీజ్ గురించి రాసుకొచ్చారు. ఇకపోతే ఈ దివాళీ పండుగకు ఓటీటీలో ఫ్యామిలీతో చూసేందుకు బెస్ట్ సినిమాల్లో దక్ష ది డెడ్‌లీ కాన్‌స్పిరసీ సినిమా ఉంటుంది. మంచి థ్రిల్లర్స్ నచ్చేవారికి ప్రైమ్‌లోని దక్ష ది డెడ్‌లీ కాన్‌స్పిరసీ మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More