ఓటీటీలోకి మరికొన్ని రోజుల్లో హారర్ థ్రిల్లర్- ఆరోజు సాయంత్రం నుంచి కిష్కింధపురి- సాయి శ్రీనివాస్, అనుపమ ఏం చెప్పారంటే?

ఓటీటీలోకి సూపర్ హిట్ హారర్ థ్రిల్లర్ కిష్కింధపురి స్ట్రీమింగ్ కానుంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ మరోసారి జోడీగా నటించిన కిష్కింధపురి ఓటీటీ రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించారు మేకర్స్. మరికొన్ని రోజుల్లో సాయంత్రం నుంచి కిష్కింధపురి ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ఆ ఓటీటీ ఏంటంటే?

Published on: Oct 10, 2025, 22:00:11 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ మరోసారి హీరో హీరోయిన్లుగా జోడీ కట్టిన సినిమా కిష్కింధపురి. హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో మకరంద్ దేశ్‌పాండే కీలక పాత్ర పోషించారు. సెప్టెంబర్ 12న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.

ఓటీటీలోకి మరికొన్ని రోజుల్లో హారర్ థ్రిల్లర్- ఆరోజు సాయంత్రం నుంచి కిష్కింధపురి- సాయి శ్రీనివాస్, అనుపమ ఏం చెప్పారంటే?
ఓటీటీలోకి మరికొన్ని రోజుల్లో హారర్ థ్రిల్లర్- ఆరోజు సాయంత్రం నుంచి కిష్కింధపురి- సాయి శ్రీనివాస్, అనుపమ ఏం చెప్పారంటే?

సంచలన విజయం

కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించిన ఈ హారర్-థ్రిల్లర్ కిష్కింధపురి థియేటర్లలో సంచలన విజయాన్ని నమోదు చేసి ప్రేక్షకులను అలరించింది. హారర్ థ్రిల్లర్ అభిమానులకు సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించిన కిష్కింధపురి ఓటీటీలోకి వచ్చేయనుంది.

ఇప్పటికే కిష్కింధపురి ఓటీటీ స్ట్రీమింగ్‌పై పలు వార్తలు వచ్చాయి. అయితే, తాజాగా ఇవాళ (అక్టోబర్ 10) కిష్కింధపురి ఓటీటీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. భారతదేశంలో అతిపెద్ద స్వదేశీ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో ఒకటైన జీ5లో కిష్కింధపురి ఓటీటీ ప్రీమియర్ కానుంది.

కిష్కింధపురి ఓటీటీ స్ట్రీమింగ్

అక్టోబర్ 17న సాయంత్రం 6 గంటల నుంచి కిష్కింధపురి ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. సాధారణంగా ఓటీటీ రిలీజ్ డేట్ అర్థరాత్రి నుంచే సినిమాలను స్ట్రీమింగ్ చేస్తారు. కానీ, కిష్కింధపురి మూవీని మాత్రం సాయంత్రం నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ చేయనున్నారు.

షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించిన హారర్ థ్రిల్లర్ కిష్కింధపురి రేడియో స్టేషన్ నేపథ్యంలో సాగుతుంది. వెన్నులో వణుకు పుట్టించే ఎన్నో థ్రిల్లింగ్ మూమెంట్స్‌తో వచ్చిన ఈ చిత్రం ఇక ఇప్పుడు ఓటీటీ ఆడియెన్స్‌ను అలరించేందుకు సిద్దమైంది.

కఠినమైన పాత్రల్లో ఒకటి

ఈ సందర్భంగా హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ .. "నేను పోషించిన అత్యంత కఠినమైన పాత్రలలో ఇది ఒకటి. ఇలాంటి పాత్రలు చేసేటప్పుడు సెట్‌లో మన ముందు ఎలాంటి భయానక పరిస్థితులు ఉండవు. కానీ, మేం మాత్రం ఊహించుకుని అలా నటించాల్సి వస్తుంది. నటుడిగా, అది నన్ను నా కంఫర్ట్ జోన్ నుండి బయటకు తీసుకువచ్చినట్టు అయింది" అని అన్నారు.

"సెట్‌లో నేను నిరంతరం భయం, అనిశ్చితి వాతావరణంలో జీవించాల్సి వచ్చింది. రేడియో స్టేషన్ వింతైన వాతావరణం నాతో పాటు ఇంకా ఉంది. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఓటీటీలో కూడా ఆస్వాదిస్తారని నేను భావిస్తున్నాను" అని బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తెలిపారు.

రకరకాల ఎమోషన్స్‌ను పోషించే

అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ .. "కిష్కింధపురిలో నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. లుక్స్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. రకరకాల ఎమోషన్స్‌ను పోషించే అవకాశం నాకు ఈ చిత్రంతో దక్కింది" అని చెప్పారు.

"ఇందులో నా పాత్ర ‘హారర్ హీరోయిన్’ స్టీరియోటైప్ పాత్ర కాదు. కొన్ని సార్లు భయపడుతుంది, ఇంకొన్ని సార్లు కృంగిపోతుంది.. మరి కొన్ని సార్లు తనని తాను ప్రశ్నించుకుంటుంది.. మళ్లీ వెంటనే రెట్టింపు శక్తితో పైకి లేస్తుంది. నా పాత్రకి ఆడియెన్స్ కనెక్ట్ అవుతారని నేను ఆశిస్తున్నాను" అని అనుపమ పరమేశ్వరన్ తెలిపారు.

వింతైన అనుభవం

"నాకు, ఆ వెంటాడే ప్రదేశాలలో షూటింగ్ అనేది ఒక వింతైన అనుభవం. మన చుట్టూ ఉండే వాతావరణం కూడా మనల్ని మన పాత్రల్లోకి లోతుగా నెట్టివేస్తున్నట్లు అనిపించింది" అని పేర్కొన్నారు అనుపమ పరమేశ్వరన్.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More