హారర్ థ్రిల్లర్ కిష్కింధపురి ఓటీటీ.. వచ్చేది ఈ రోజు కాదు.. డిజిటల్ స్ట్రీమింగ్, టీవీ ప్రీమియర్ డేట్ అనౌన్స్ చేసిన జీ5
తెలుగు లేటెస్ట్ బ్లాక్ బస్టర్ థ్రిల్లర్ కిష్కింధపురి సినిమా ఈ రోజు ఓటీటీలోకి రావడం లేదు. ఈ మూవీ అక్టోబర్ 10నే డిజిటల్ స్ట్రీమింగ్ కు వస్తుందనే వార్తలొచ్చాయి. కానీ జీ5 మాత్రం డేట్లు మార్చేసింది.
తెలుగు లేటెస్ట్ బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్ కిష్కింధపురి ఓటీటీ రిలీజ్ డేట్ పై సస్పెన్స్ వీడింది. ఇవాళ (అక్టోబర్ 10) ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు రావడం లేదు. అక్టోబర్ 10న కిష్కింధపురి ఓటీటీలోకి వస్తుందనే వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు జీ5 నెట్ వర్క్ వేరే డేట్లను ప్రకటించింది. ఓటీటీతో పాటు టీవీ ప్రీమియర్ డేట్ నూ అనౌన్స్ చేసింది.

కిష్కింధపురి ఓటీటీ
హారర్ థ్రిల్లర్ కిష్కింధపురి ఓటీటీ రిలీజ్ పై క్లారిటీ వచ్చింది. ఈ సినిమా కొత్త ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ను శుక్రవారం అనౌన్స్ చేశారు. ఈ సినిమా అక్టోబర్ 17న సాయంత్రం 6 గంటల నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందని ప్రకటించారు. ఇక అక్టోబర్ 19న సాయంత్రం 6 గంటలకు టీవీలో వస్తుందని అనౌన్స్ చేశారు. ఈ మూవీ జీ5 ఓటీటీలో, జీ తెలుగు ఛానెల్లో ప్రసారం కానుంది.
హారర్ థ్రిల్లర్
వణికించే హారర్ థ్రిల్లర్ గా కిష్కింధపురి తెరకెక్కింది. ఈ సినిమా సెప్టెంబర్ 12న థియేటర్లలో రిలీజైంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించారు. సుదర్శన్, హైపర్ ఆది, తనికెళ్ల భరణి, శ్రీయాంత్ అయ్యంగార్ తదితరులు నటించారు. ఈ మూవీకి కౌళిక్ పెగళ్లపాటి డైరెక్టర్. సాహు గారపాటి నిర్మించారు.
కిష్కింధపురి కథ ఏమిటంటే?
సువర్ణమాయ అనే రేడియో స్టేషన్ లో ఉన్న వేదవతి దెయ్యం, దాని నుంచి పాపను కాపాడటం చుట్టూ కిష్కింధపురి కథ తిరుగుతుంది. రాఘవ్ (బెల్లంకొండ సాయి శ్రీనివాస్), మైథిలి (అనుపమ పరమేశ్వరన్) లవర్స్. వీళ్లిద్దరు మరో ఫ్రెండ్ తో కలిసి ఘోస్ట్ వాకింగ్ పేరుతో టూర్స్ నిర్వహిస్తారు. పాడుబడిన బంగ్లాలోకి తీసుకెళ్లి, అక్కడ దెయ్యాలున్నాయని నమ్మించి వచ్చిన వాళ్లకు థ్రిల్ పంచుతారు.
సువర్ణమాయ
ఈ క్రమంలోనే కిష్కింధపురి గ్రామానికి దగ్గర్లోనే పాడుబడ్డ సువర్ణ మాయ అనే రేడియో స్టేషన్ కు 11 మందిని తీసుకెళ్తారు. అక్కడి వెళ్లాక పరిస్థితులు తారుమారవుతాయి. అక్కడ రేడియోలో నుంచి ఓ వాయిస్ వినిపిస్తుంది. అది దెయ్యం వేదవతి వాయిస్ అని తెలుస్తుంది. ఆ దెయ్యం 11 మందిలో ఎవరినీ వదిలిపెట్టను అని వార్నింగ్ ఇచ్చి ముగ్గురిని చంపేస్తుంది. ఆ తర్వాత ఓ పాపను చంపాలని చూస్తుంది. కానీ రాఘవ్ పాపను కాపాడటం కోసం దెయ్యానికి ఎదురు వెళ్తాడు.
మరి ఆ తర్వాత ఏం జరిగింది? అసలు దెయ్యంగా మారిన వేదవతి కథ ఏంటీ? ఎందుకు జనాలను చంపుతుంది? అన్నది మూవీ చూసి తెలుసుకోవాల్సింది. హారర్ థ్రిల్లర్ సినిమాలను ఎంజాయ్ చేసే ఆడియన్స్ కు కిష్కింధపురి బెస్ట్ ఆప్షన్.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


