ఇవాళ ఓటీటీలోకి బ్లాక్‌బ‌స్ట‌ర్ రొమాంటిక్ కామెడీ.. లిటిల్ హార్ట్స్ స్ట్రీమింగ్

చిన్న సినిమాగా వచ్చిన పెను విజయాన్ని అందుకున్న తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. లిటిల్ హార్ట్స్ సినిమా ఇవాళ నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది.  

Oct 1, 2025, 06:13:23 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ మూవీ ‘లిటిల్ హార్ట్స్’ వచ్చేసింది. థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోపే ఈ మూవీ ఎక్స్ టెండెడ్ కట్ తో డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. ఇవాళ నుంచి మూవీ ఓటీటీలో అందుబాటులో ఉంది. చిన్న సినిమాగా రిలీజైన లిటిల్ హార్ట్స్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది.

లిటిల్ హార్ట్స్ పోస్టర్ (x/etvwin)
లిటిల్ హార్ట్స్ పోస్టర్ (x/etvwin)

లిటిల్ హార్ట్స్ ఓటీటీ

లేటెస్ట్ తెలుగు బ్లాక్ బస్టర్ మూవీ లిటిల్ హార్ట్స్ ఓటీటీలోకి వచ్చేసింది. ఇవాళ (అక్టోబర్ 1) నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీని ప్రొడ్యూస్ చేసిన సంస్థ ఈటీవీ విన్ ఓటీటీలోనే సినిమా రిలీజైంది. థియేటర్లో రిలీజైన సినిమాకు మరికొంత భాగం యాడ్ చేసి ఓటీటీలోకి తీసుకొచ్చారు. ఇందులో మౌళి తనూజ్, శివానీ నాగారం హీరో హీరోయిన్లు.

నెల రోజుల్లోపే ఓటీటీలోకి

లిటిల్ హార్ట్స్ మూవీ థియటర్లో రిలీజైన నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా సెప్టెంబర్ 5, 2025న థియేటర్లో విడుదలైంది. మంచి పాజిటివ్ టాక్ తో కలెక్షన్లు కుమ్మేసింది. రూ.2.5 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.40 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని అంచనా. లిటిల్ హార్ట్స్ లో మౌళి తనూజ్, శివానీ నగరం, రాజీవ్ కనకాల, ఎస్ఎస్ కాంచి, అనిత చౌదరి, సత్య, నిఖిల్ తదితరులు నటించారు. దీనికి సాయి మార్తాండ్ డైరెక్టర్.

లిటిల్ హార్ట్స్ కథ

చదువులో అంతంతమాత్రంగానే ఉండే అఖిల్ (మౌళి తనూజ్)కు ఎంసెట్ లో ర్యాంకు రాదు. పేమెంట్ సీట్ తో ఇంజినీరింగ్ కాలేజీలో చేరాలనుకుంటాడు. కానీ ఫాదర్ గోపాలరావు (రాజీవ్ కనకాల) తన కొడుకును ఎంసెట్ లాంగ్ టర్మ్ కోచింగ్ కు పంపిస్తాడు. మరోవైపు హీరోయిన్ కాత్యాయని (శివానీ నాగారం) పేరేంట్స్ డాక్టర్లు. వాళ్లు తమ కూతుర్ని డాక్టర్ ను చేయాలని ఎంసెట్ లాంగ్ టర్మ్ కోచింగ్ కు పంపిస్తారు. అక్కడ అఖిల్, కాత్యాయని మధ్య పరిచయం కలుగుతుంది.

లవ్ స్టోరీలో ట్విస్ట్

కాత్యాయనికి ప్రపోజ్ చేస్తాడు అఖిల్. కానీ అప్పుడు కాత్యాయని ఓ విషయాన్ని బయటపెడుతుంది. దీంతో లవ్ స్టోరీ కథ మలుపు తిరుగుతుంది. మరి కాత్యాయని చెప్పిన విషయం ఏంటీ? వీళ్ల ప్రేమ విజయవంతమైందా?అన్నదే మిగతా కథ.

ఒకప్పుడు స్మార్ట్ ఫోన్ లు ఎక్కువగా లేనప్పుడు, స్వచ్ఛమైన బాల్యం, టీనేజీని గడిపిన రోజులకు లిటిల్ హార్ట్స్ మనల్ని తీసుకెళ్తుంది. ఈ వారం మంచి రొమాంటిక్ కామెడీ చూడాలనుకే ఓటీటీ ఆడియన్స్ కు లిటిల్ హార్ట్స్ మంచి ఆప్షన్.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More