ఓటీటీ రిలీజ్ రోజు నుంచే దూసుకుపోతున్న డిఫరెంట్ తెలుగు పొలిటికల్ థ్రిల్లర్- ఏకంగా 5 భాషల్లో ట్రెండింగ్- ఇక్కడ చూసేయండి!

ఓటీటీలోకి తెలుగు పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా దూసుకుపోతోంది భద్రకాళి. ఓటీటీ రిలీజ్ రోజు నాడే టాప్‌ ట్రెండింగ్‌లోకి వచ్చేసింది సినిమా. విజయ్ ఆంటోనీ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా డిఫరెంట్ పొలిటికల్ థ్రిల్లర్‌గా పేరు తెచ్చుకుంది. మరి భద్రకాళి ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Oct 26, 2025, 13:01:15 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీలోకి ప్రతివారం ఎన్నో సినిమాలు స్ట్రీమింగ్‌కు వస్తుంటాయి. వాటిలో కొన్ని మాత్రమే మంచి బజ్ క్రియేట్ చేసి ఆదరణ పొందుతాయి. ఆ తర్వాత ఓటీటీ ట్రెండింగ్‌లో దూసుకుపోతాయి. మరికొన్ని ఓటీటీ రిలీజ్ అయిన రోజు నుంచే టాప్‌లో ట్రెండింగ్‌లోకి వస్తుంటాయి. అలాంటి సినిమా గురించే మనం ఇప్పుడు చెప్పుకునేది.

ఓటీటీ రిలీజ్ రోజు నుంచే దూసుకుపోతున్న డిఫరెంట్ తెలుగు పొలిటికల్ థ్రిల్లర్- ఏకంగా 5 భాషల్లో ట్రెండింగ్- ఇక్కడ చూసేయండి!
ఓటీటీ రిలీజ్ రోజు నుంచే దూసుకుపోతున్న డిఫరెంట్ తెలుగు పొలిటికల్ థ్రిల్లర్- ఏకంగా 5 భాషల్లో ట్రెండింగ్- ఇక్కడ చూసేయండి!

తెలుగులో-తమిళంలో

ఆ సినిమానే భద్రకాళి. తమిళ హీరో విజయ్ ఆంటోనీ నటించిన మరో డిఫరెంట్ మూవీనే భద్రకాళి. డిఫరెంట్ పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్‌గా అటు తమిళంలో, ఇటు తెలుగులో థియేటర్లలో విడుదలైంది ఈ సినిమా. తమిళంలో శక్తి తిరమగన్‌ టైటిల్‌తో రిలీజ్ కాగా తెలుగు రాష్ట్రాల్లో భద్రకాళి పేరుతో విడుదల అయింది.

పాజిటివ్ రివ్యూలు

విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్‌పై మీరా విజయ్ ఆంటోనీ సమర్పించిన భద్రకాళి మూవీని తెలుగు రాష్ట్రాల్లో ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్, రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియాతో కలిసి గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. సెప్టెంబర్ 19న థియేటర్లలో విడుదలైన భద్రకాళి మూవీకి మంచి పాజిటివ్ రివ్యూలు వచ్చాయి.

సైకలాజికల్ ఎలిమెంట్స్ యాడ్ చేసి

భద్రకాళి ఒక డిఫరెంట్ పొలిటికల్ థ్రిల్లర్ అని అభివర్ణించారు. థ్రిల్లింగ్ సీన్స్, మైండ్ గేమ్‌తో సాగే ఈ పొలిటికల్ థ్రిల్లర్‌కు సైకలాజికల్ ఎలిమెంట్స్ యాడ్ చేసి కొత్తగా తెరకెక్కించారని టాక్ వచ్చింది. అరుణ్ ప్రభు దర్శకత్వం వహించిన భద్రకాళి సినిమాకు ఐఎమ్‌డీబీ నుంచి 7.5 రేటింగ్ కూడా సొంతం చేసుకుంది.

భద్రకాళి ఓటీటీ రిలీజ్

ఇంత మంచి టాక్ తెచ్చుకున్న భద్రకాళి ఓటీటీలో దూసుకుపోతోంది. అక్టోబర్ 24న జియో హాట్‌స్టార్‌లో భద్రకాళి ఓటీటీ రిలీజ్ అయింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ వంటి ఐదు భాషల్లో భద్రకాళి ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చింది. అయితే, ఓటీటీ రిలీజ్ అయిన రోజు నుంచే భద్రకాళి ట్రెండింగ్‌లోకి వచ్చేసింది.

ఓటీటీ ట్రెండింగ్‌లో

ఇవాళ (అక్టోబర్ 26) ఏకంగా ఐదు భాషల్లో భద్రకాళి ఓటీటీ ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. తెలుగులో టాప్ 2 ప్లేసులో భద్రకాళి ట్రెండ్ అయితే.. హిందీలో మాత్రం టాప్ 4 స్థానం దక్కించుకుంది. ఇక మలయాళంలో శక్తి తిరమగన్‌గా టాప్ 3 స్థానం, తమిళంలో టాప్ 2 ప్లేసులో, కన్నడ భాషలో టాప్ 3 స్థానంలో భద్రకాళి ఓటీటీ ట్రెండింగ్ అవుతోంది.

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో

ఇలా ఓటీటీలో అదరగొడుతోన్న భద్రకాళి సినిమాను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఎంచక్కా వీక్షించవచ్చు. కాగా, భద్రకాళి సినిమాలో విజయ్ ఆంటోనీతోపాటు హరిణి సుందరరాజన్, వాగై చంద్రశేఖర్, సునీల్ కృపాలనీ, రవీంద్ర, సెల్ మురుగన్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More