జియో హాట్‌స్టార్‌లో ఇవాళ టాప్ 10 ఓటీటీ ట్రెండింగ్ సినిమాలు- అన్నీ తెలుగులోనే స్ట్రీమింగ్- కచ్చితంగా చూడాల్సినవి మాత్రం 4

జియో హాట్‌స్టార్‌లో ఇవాళ టాప్ 10 ఓటీటీ ట్రెండింగ్ సినిమాల జాబితాను సదరు ప్లాట్‌ఫామ్ తెలిపింది. ఈ టాప్ 10 ట్రెండింగ్ సినిమాలన్నీ కూడా తెలుగులోనే ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. అయితే, వీటిలో కచ్చితంగా చూడాల్సినవి మాత్రం కేవలం నాలుగే ఉన్నాయి. నేటి జియో హాట్‌స్టార్ టాప్ 10 ఓటీటీ సినిమాలేంటో లుక్కేద్దాం.

Published on: Oct 25, 2025, 18:30:17 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో జియో హాట్‌స్టార్ ఒకటి. ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్‌తో సౌత్, నార్త్ ఓటీటీ ఆడియెన్స్‌ను అలరిస్తుంటుంది హాట్‌స్టార్. అయితే, నేటి (అక్టోబర్ 25) టాప్ 10 తెలుగు ఓటీటీ ట్రెండింగ్ సినిమాలను జియో హాట్‌స్టార్ ప్లాట్‌ఫామ్‌లో చూపించింది. అన్నీ తెలుగులోనే స్ట్రీమింగ్ అవుతోన్న అందులో 4 మాత్రం కచ్చితంగా చూడాల్సినవిగా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి.

జియో హాట్‌స్టార్‌లో ఇవాళ టాప్ 10 ఓటీటీ ట్రెండింగ్ సినిమాలు- అన్నీ తెలుగులోనే స్ట్రీమింగ్- కచ్చితంగా చూడాల్సినవి మాత్రం 4
జియో హాట్‌స్టార్‌లో ఇవాళ టాప్ 10 ఓటీటీ ట్రెండింగ్ సినిమాలు- అన్నీ తెలుగులోనే స్ట్రీమింగ్- కచ్చితంగా చూడాల్సినవి మాత్రం 4

బిగ్ బాస్ 9 తెలుగు

టాలీవుడ్ కింగ్ నాగార్జున హోస్ట్‌గా చేస్తున్న బుల్లితెర మెగా పాపులర్ షో బిగ్ బాస్ 9 తెలుగు. ఈ తొమ్మిదో సీజన్ జియో హాట్‌స్టార్‌ ట్రెండింగ్‌లో ఇవాళ టాప్ 1 ప్లేసులో స్థానం దక్కించుకుంది. ప్రస్తుతం 15 మంది కంటెస్టెంట్స్ ఉన్న బిగ్ బాస్ తెలుగు 9 నుంచి ఈ వారం ఒకరు ఎలిమినేట్ కానున్నారు.

భద్రకాళి ఓటీటీ

విజయ్ ఆంటోనీ పవర్ బ్రోకర్‌గా నటించిన పొలిటికల్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ భద్రకాళి. అక్టోబర్ 24 నుంచి జియో హాట్‌స్టార్‌లో తెలుగులో భద్రకాళి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇవాళ టాప్ 2లో ట్రెండింగ్‌లో ఉంది ఈ సినిమా. ఓటీటీ రిలీజ్ నుంచే ట్రెండింగ్‌లోకి వచ్చిన భద్రకాళి కచ్చితంగా చూడాల్సిన మూవీ.

హార్ట్ బీట్ సీజన్ 2 ఓటీటీ

తెలుగులో డబ్ అయిన తమిళ మెడికల్ రొమాంటిక్ కామెడీ సిరీస్ హార్ట్ బీట్. మొదటి సీజన్ హిట్ కావడంతో రెండో సీజన్‌ను ఓటీటీ ప్రీమియర్ చేస్తున్నారు. హాట్‌స్టార్‌లో టాప్ 3 స్థానంలో హార్ట్ బీట్ సీజన్ 2 ట్రెండింగ్‌లో ఉంది.

మిరాయ్ ఓటీటీ

తేజ సజ్జా, మంచు మనోజ్ హీరో, విలన్‌గా నటించిన మైథలాజికల్ ఫాంటసీ అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మిరాయ్ ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చినప్పటి నుంచి ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. నేడు టాప్ 4 ఓటీటీ ట్రెండింగ్‌లో ఉన్న తెలుగు మూవీ మిరాయ్ కూడా చూసేందుకు బెస్ట్ ఆప్షన్.

పోలీస్ పోలీస్ - రాంబో ఇన్ లవ్

తెలుగులో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న సిరీస్ పోలీస్ పోలీస్ జియో హాట్‌స్టార్‌లో టాప్ 5 స్థానంలో ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. దీని తర్వాత తెలుగు లవ్ రొమాంటిక్ కామెడీ సిరీస్ రాంబో ఇన్ లవ్ టాప్ 6 ప్లేసులో ట్రెండ్ అవుతోంది.

ఆదివారం విత్ స్టార్ మా పరివారం

బ్యూటిపుల్ యాంకర్ శ్రీముఖి హోస్ట్‌గా చేస్తున్న ఫ్యామిలీ కామెడీ షో ఆదివారం విత్ స్టార్ మా పరివారం. ఈ షోలో స్టార్ మా ఛానెల్‌లోని పలు సీరియల్ నటీనటులు పాల్గొని వినోదం పంచుతారు. ఈ ప్రోగ్రామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో టాప్ 7 ప్లేస్ దక్కించుకుంది.

సెర్చ్ ది నైనా మర్డర్ కేస్ ఓటీటీ

హిందీలో తెరకెక్కిన క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సిరీస్ సెర్చ్ ది నైనా మర్డర్ కేస్. జియో హాట్‌స్టార్‌లో తెలుగులోనూ ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చిన ఈ సిరీస్ ఇవాళ టాప్ 8 స్థానంలో ట్రెండింగ్‌లో ఉంది. కారులో ఓ శవం దొరకడం, అది ఎవరిదో ఛేదించడం, ట్విస్టులు, థ్రిల్లర్స్‌తో సాగే ఈ సిరీస్ మస్ట్ వాచ్ ఓటీటీ సిరీస్ అని చెప్పొచ్చు.

డోరమాన్ - హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ ఓటీటీ

డోరమాన్ అండ్ హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ ఈ రెండు చిన్న పిల్లలు మెచ్చే షో, సినిమా. డోరమాన్ తెలుగులో స్ట్రీమింగ్ అవుతూ టాప్ 9 స్థానం దక్కించుకుంది. ఇక ఇంగ్లీష్ ఫాంటసీ అడ్వెంచర్ కామెడీ మూవీ హాట్‌స్టార్‌లో తెలుగులో హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ ఓటీటీ రిలీజ్ అయింది. ఇవాళ టాప్ 10 స్థానంలో ఉంది. ఈ సినిమా పిల్లలతో పాటు పెద్దలు కూడా చూసే మూవీ.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More