ఓటీటీలోకి వచ్చిన హార్ట్ టచింగ్ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా మూవీ- పెళ్లయిన రోజే భార్యను వదిలేసే భర్త- 7 రేటింగ్- ఎక్కడంటే?

ఓటీటీలోకి రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా చిత్రం గృహప్రవేశ్ స్ట్రీమింగ్ వచ్చేసింది. పెళ్లయిన రోజే భర్త వదిలేసి వెళ్తే అత్తింట్లో భార్య ఎలా గడిపిందనే కాన్సెప్ట్‌తో గృహప్రవేశ్ సినిమా తెరకెక్కింది. ఐఎమ్‌డీబీ నుంచి 7 రేటింగ్ సాధించిన గృహప్రవేశ్ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Oct 25, 2025, 05:33:04 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీలు విపరీతంగా పెరిగిపోవడంతో ఇతర భాషా సినిమాలు సైతం మంచి క్రేజ్ తెచ్చుకుంటాయి. ఆ భాషా, ఈ లాంగ్వెజ్ అనే తేడా లేకుండా ఓటీటీ ఆడియెన్స్ అన్ని రకాల సినిమాలు, జోనర్స్‌ను చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కంటెంట్ బాగుంటే ఏ భాష అయిన సరే ఓటీటీ వాచ్ చేస్తున్నారు ప్రేక్షకులు.

ఓటీటీలోకి వచ్చిన హార్ట్ టచింగ్ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా మూవీ- పెళ్లయిన రోజే భార్యను వదిలేసే భర్త- 7 రేటింగ్- ఎక్కడంటే?
ఓటీటీలోకి వచ్చిన హార్ట్ టచింగ్ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా మూవీ- పెళ్లయిన రోజే భార్యను వదిలేసే భర్త- 7 రేటింగ్- ఎక్కడంటే?

ఓటీటీ రిలీజెస్

ఇక ఎప్పటికప్పుడు సరికొత్త సినిమాలు, డిఫరెంట్ జోనర్ వెబ్ సిరీస్‌లు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతుంటాయి. అలా ఈ వారం కూడా ఓటీటీ రిలీజెస్ ఎక్కువగా అయ్యాయి. అందులో అన్ని రకాల జోనర్స్ ఉన్నాయి. అయితే, వీటిలో నుంచి ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చిన సరికొత్త సినిమా గృహప్రవేశ్.

ఇది ఒక బెంగాలీ మూవీ. గృహ ప్రవేశ్ అంటే తెలుగులో గృహ ప్రవేశం అనే అర్థం వస్తుంది. పెళ్లయిన రోజే భర్త వదిలేసి వెళ్లిపోతే ఆ భార్య అత్తింట్లో ఎలా గడిపిందో అనే కథాంశంగా ఈ సినిమా తెరకెక్కింది. హార్ట్ టచింగ్ సీన్లతో రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాగా గృహప్రవేశ్ రూపొందింది.

గృహప్రవేశ్ నటీనటులు

గృహప్రవేశ్ సినిమాకు ఇంద్రదిప్ దస్‌గుప్తా దర్శకత్వం వహించారు. ఈ మూవీలో కౌశిక్ గంగూలీ, శుభ శ్రీ గంగూలీ, జీతూ కమల్, రుద్రనీల్ ఘోష్, సోహిని సెన్‌గుప్తా, స్నేహా ఛటర్జీ, అబీర్ ఛటర్జీ ముఖ్య పాత్రలు పోషించారు. సిమ్రన్ దాస్ ఈ సినిమాను నిర్మించారు.

జూన్ 13న థియేటర్లలో విడుదలైన గృహప్రవేశ్ సినిమా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. రొమాంటిక్, ఫ్యామిలీ, మ్యూజికల్, ఎమోషనల్ డ్రామా ఎలిమెంట్స్‌తో సాగే గృహప్రవేశ్ సినిమాకు ఐఎమ్‌డీబీ నుంచి 7 రేటింగ్ వచ్చింది. అలాంటి గృహప్రవేశ్ ఓటీటీలోకి వచ్చేసింది. హోయ్‌చోయ్‌లో అక్టోబర్ 24 నుంచి గృహప్రవేశ్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

గృహప్రవేశ్ ఓటీటీ ప్రీమియర్

అయితే, ప్రస్తుతం బెంగాలీ భాషలో మాత్రమే నిన్నటి నుంచి గృహప్రవేశ్ ఓటీటీ ప్రీమియర్ అవుతోంది. కాకపోతే ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో గృహప్రవేశ్ సినిమాను ఓటీటీలో చూడొచ్చు. ఇకపోతే ఈ సినిమా కథ అంతా ఉత్తర కలకత్తాలోని రాజ్‌బరి ప్రాంతంలో జరుగుతుంది.

అక్కడ రాజవంశానికి చెందిన అప్రతిమ్‌కు గొప్ప పేరు ఉంటుంది. అప్రతిమ్‌కు భార్య, ఇద్దరు పనివాళ్లు బిలు, మినాటి ఉంటారు. అప్రతిమ్ కొడుకు షాన్‌కు టిట్లీ అనే యువతితో పెళ్లి చేస్తారు. అయితే, పెళ్లి రోజునే షాన్ ఎవరికి చెప్పకుండా వెళ్లిపోతాడు. కానీ, భార్య టిట్లితో మాత్రం మూడు నెలల్లో కచ్చితంగా వస్తానని ప్రామిస్ చేసి షాన్ వెళ్లిపోతాడు.

గృహప్రవేశ్ కథ, ట్విస్టులు

భర్త కోసం ఎదురుచూస్తు టిట్లీ జీవనం సాగిస్తుంటుంది. ఈ క్రమంలో దుర్గా దేవి పూజ ఫెస్టివల్ తర్వాత అప్రతిమ్ ఇంటికి మొదటి గెస్ట్‌గా డాక్టర్, ఫొటోగ్రాఫర్ మేఘదూత్ వస్తాడు. అతనితో టిట్లీకి మంచి పరిచయం ఏర్పడి స్నేహం పెరుగుతుంది. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడుతుంది.

టిట్లీ, మేఘదూత్ స్నేహం, రిలేషన్‌షిప్ గురించి ఊరంతటా పాకుతుంది. ఆ తర్వాత ఏమైంది? అసలు మేఘదూత్ ఎవరు? అతను తీసుకొచ్చి సందేశం ఏంటీ? మామ అప్రతిమ్‌తో టిట్లీతో జరిగే కాన్‌ఫ్లిక్ట్ ఏంటీ? టిట్లీ భర్త షాన్ తిరిగి వచ్చాడా? అనేది తెలియాలంటే ఓటీటీ స్ట్రీమింగ్ మూవీ గృహప్రవేశ్ చూడాల్సిందే.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More