ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో తెలుగు సైకలాజికల్ పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్- 800 కోట్ల భూ స్కామ్- 7.5 రేటింగ్- ఎక్కడంటే?

ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో తెలుగు సైకలాజికల్ పొలిటికల్ థ్రిల్లర్ మూవీ భద్రకాళి స్ట్రీమింగ్ కానుంది. బిచ్చగాడు హీరో విజయ్ ఆంటోనీ బ్రోకర్‌గా నటించిన భద్రకాళి సినిమాకు ఐఎమ్‌డీబీ నుంచి 7.5 రేటింగ్ వచ్చింది. రూ. 800 కోట్ల భూ స్కామ్ కాన్సెప్ట్‌తో సాగే భద్రకాళి ఓటీటీ రిలీజ్ ప్లాట్‌ఫామ్ ఏంటో తెలుసుకుందాం.

Published on: Oct 23, 2025, 19:20:10 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బిచ్చగాడు సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరో విజయ్ ఆంటోనీ. ఆయన సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లో మంచి మార్కెట్ ఉంది. అందుకే ఆయన ప్రతి సినిమాను తమిళంతోపాటు తెలుగులోనూ థియేట్రికల్ రిలీజ్ చేస్తుంటారు. ఇక పొలిటికల్ థ్రిల్లర్ సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి.

ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో తెలుగు సైకలాజికల్ పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్- 800 కోట్ల భూ స్కామ్- 7.5 రేటింగ్- ఎక్కడంటే?
ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో తెలుగు సైకలాజికల్ పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్- 800 కోట్ల భూ స్కామ్- 7.5 రేటింగ్- ఎక్కడంటే?

పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌తో

సస్పెన్స్, క్రైమ్, రొమాంటిక్, హారర్, కామెడీ వంటి రెగ్యులర్ జోనర్స్‌లో కాకుండా పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కించే సినిమాల్లో డ్రామా బాగా ఎలివేట్ అయింతే మూవీ అంతలా ఆదరణ పొందుతుంది. అలాంటి సినిమానే భద్రకాళి. ఈ సినిమా తమిళంలో శక్తి తిరుమగన్‌గా తెరకెక్కింది. తెలుగులో మాత్రం సెప్టెంబర్ 19న భద్రకాళి టైటిల్‌తో రిలీజ్ చేశారు.

బ్రోకర్‌గా హీరో విజయ్ ఆంటోనీ

విజయ్ ఆంటోనీ బ్రోకర్‌గా నటించిన భద్రకాళి సినిమాలో హరిణి సుందరరాజన్, వాగై చంద్రశేఖర్, సునీల్ కృపాలనీ, రవీంద్ర, సెల్ మురుగన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అరుణ్ ప్రభు కథ, దర్శకత్వం వహించిన భద్రకాళి సినిమాను విజయ్ ఆంటోనీ కార్పొరేషన్ బ్యానర్‌పై హీరో విజయ్ ఆంటోనీ నిర్మాతగా నిర్మించారు.

800 కోట్ల భూ స్కామ్‌ చుట్టూ

భద్రకాళి సినిమా రూ. 800 కోట్ల భూమి స్కామ్, ఓ బ్రోకర్ చుట్టూ సాగే కథగా తెరకెక్కింది. కేంద్ర మంత్రికి సంబంధించిన 800 కోట్లను పట్టుకునే క్రమంలో బ్రోకర్ దగ్గరి నుంచి వేల కోట్లు బయటపడటం వంటి ఇంట్రెస్టింగ్ ట్విస్టులతో భద్రకాళి మూవీ మంచి టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాకు ఐఎమ్‌డీబీ నుంచి పదికి 7.5 రేటింగ్ వచ్చింది.

భద్రకాళి ఓటీటీ స్ట్రీమింగ్

మరి ఇలాంటి భద్రకాళి ఓటీటీలోకి వచ్చేయనుంది. అది కూడా మరికొన్ని గంటల్లో భద్రకాళి ఓటీటీ స్ట్రీమింగ్ అవనుంది. జియో హాట్‌స్టార్‌లో రేపటి నుంచి అంటే అక్టోబర్ 24 నుంచి భద్రకాళి ఓటీటీ ప్రీమియర్ కానుంది. శుక్రవారం అర్థరాత్రి నుంచే భద్రకాళి మూవీని డిజిటల్ స్ట్రీమింగ్ చేయనుంది డిస్నీ ప్లస్ హాట్‌స్టార్.

నాలుగు భాషల్లో రిలీజ్

అంతేకాకుండా భద్రకాళి నాలుగు భాషల్లో డిజిటల్ ప్రీమియర్ కానుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ వంటి నాలుగు భాషల్లో భద్రకాళి ఓటీటీ రిలీజ్ కానుంది. తమిళంలో భద్రకాళి మూవీ శక్తి తిరుమగన్ టైటిల్‌తో ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.

జియో హాట్‌స్టార్ ఓటీటీలో

భద్రకాళి ఒక డిఫరెంట్ పొలిటికల్ థ్రిల్లర్ మూవీ. తన తెలివితేటలతో ఓ పవర్ బ్రోకర్ రాజకీయ నాయకులను ఎలా శాసించాడో చెప్పే కథ ఇది. మంచి పొలిటికల్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారు భద్రకాళి సినిమాను జియో హాట్‌స్టార్ ఓటీటీలో ఎంచక్కా చూసేయొచ్చు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More