ఓటీటీలోకి తమిళ పొలిటికల్ థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. వేల కోట్లు వెనకేసుకునే ఓ పవర్ బ్రోకర్ స్టోరీ

ఓటీటీలోకి తమిళ పొలిటికల్ థ్రిల్లర్ మూవీ వస్తోంది. ఈ సినిమా తెలుగులోనూ స్ట్రీమింగ్ కానుంది. గత నెలలో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ వచ్చే వారం డిజిటల్ ప్రీమియర్ కానుంది. విజయ్ ఆంటోనీ లీడ్ రోల్లో నటించిన సినిమా ఇది.

Published on: Oct 15, 2025 3:08 PM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తమిళ పొలిటికల్ థ్రిల్లర్ మూవీ శక్తి తిరుమగన్ డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది. ఈ సినిమా తెలుగులో భద్రకాళి పేరుతో రిలీజైన విషయం తెలిసిందే. విజయ్ ఆంటోనీ లీడ్ రోల్లో నటించాడు. గత నెల 19న థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకు ఓ మోస్తరు రెస్పాన్స్ వచ్చింది. ఐఎండీబీలోనూ 8.7 రేటింగ్ నమోదైంది.

ఓటీటీలోకి తమిళ పొలిటికల్ థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. వేల కోట్ల వెనకేసుకునే ఓ పవర్ బ్రోకర్ స్టోరీ
ఓటీటీలోకి తమిళ పొలిటికల్ థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. వేల కోట్ల వెనకేసుకునే ఓ పవర్ బ్రోకర్ స్టోరీ

భద్రకాళి ఓటీటీ రిలీజ్ డేట్

విజయ్ ఆంటోనీ లీడ్ రోల్లో నటించిన సినిమా భద్రకాళి. తమిళంలో శక్తి తిరుమగన్ పేరుతో తెరకెక్కించారు. ఈ సినిమాను అక్టోబర్ 24 నుంచి జియోహాట్‌స్టార్ ఓటీటీ స్ట్రీమింగ్ చేయనుంది. ఈ విషయాన్ని ఆ ఓటీటీ బుధవారం (అక్టోబర్ 15) తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.

“ప్రతి మైండ్ కు ఓ మాస్టర్ ఉంటారు. మాస్టర్‌మైండ్ శక్తి తిరుమగన్ ను అక్టోబర్ 24 నుంచి జియోహాట్‌స్టార్ లో కలవండి.. శక్తి తిరుమగన్ అక్టోబర్ 24 నుంచి కేవలం జియోహాట్‌స్టార్ లో” అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది. దీనికి తెలుగు, తమిళం పోస్టర్లను జత చేసింది.

భద్రకాళి మూవీ గురించి..

భద్రకాళి మూవీ సెప్టెంబర్ 19న థియేటర్లలో రిలీజైంది. అరుణ్ ప్రభు ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. విజయ్ ఆంటోనీయే నిర్మాతగా ఉన్నాడు. ఈ సినిమాలో కిట్టూ అనే ఓ పవర్ బ్రోకర్ గా విజయ్ నటించాడు. ఓ కేంద్ర మంత్రికి సంబంధించిన రూ.800 కోట్ల భూమి వ్యవహారంలోకి అతడు వెళ్తాడు. అయితే ఈ క్రమంలో ఓ ఎమ్మెల్యే హత్యకు గురవుతాడు.

అంతేకాదు మొత్తంగా ఓ బ్రోకర్ గా కిట్టూ ఏకంగా రూ.6 వేల కోట్లకుపైగా వెనకేసుకున్నట్లు తేలుతుంది. అసలు అతడు ఎవరు? అంతలా ఎలా సంపాదించాడు? తర్వాత ఏం జరిగిందన్నది ఈ భద్రకాళి మూవీ స్టోరీ. ఈ మూవీ ప్రేక్షకులకు కాస్త థ్రిల్ పంచింది. థియేటర్లలో ఓ మోస్తరు రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఇప్పుడు నెల రోజుల తర్వాత అంటే అక్టోబర్ 24 నుంచి జియోహాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కు రానుంది.

News/Entertainment/ఓటీటీలోకి తమిళ పొలిటికల్ థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. వేల కోట్లు వెనకేసుకునే ఓ పవర్ బ్రోకర్ స్టోరీ
News/Entertainment/ఓటీటీలోకి తమిళ పొలిటికల్ థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. వేల కోట్లు వెనకేసుకునే ఓ పవర్ బ్రోకర్ స్టోరీ