ఫరియా అబ్దుల్లా బెల్లీ డ్యాన్స్, మంచు మనోజ్ లవ్ ప్రపోజల్.. ఇవాళ, రేపు జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ 2025 పార్ట్ 2
జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ 2025 పార్ట్ 2 ఈవెంట్ ఇవాళ, రేపు ప్రసారం కానుంది. అక్టోబర్ 17, 18 రెండు తేదీల్లో ప్రసారం అయ్యే ఈ వేడుకలో హీరోయిన్ ఫరియా అబ్ధుల్లా బెల్లీ డ్యాన్స్‌తో గ్లామర్ ట్రీట్ ఇవ్వనుండగా.. హీరో మంచు మనోజ్ తన భార్యకు లవ్ ప్రపోజ్ చేయడం ఆసక్తిగా ఉండనున్నాయి.
తెలుగు ప్రేక్షకులకు నిరంతరం వినోదాన్ని అందించే ఛానల్ జీ తెలుగు. నటీనటులను ప్రోత్సహించేందుకు ప్రతి సంవత్సరం మాదిరిగానే 2025 సంవత్సరానికిగానూ ప్రతిష్టాత్మక జీ తెలుగు కుటుంబం అవార్డ్స్‌ను అందించనుంది. టాలీవుడ్ ప్రముఖులు, జీ తెలుగు తారల సందడితో కోలాహలంగా జరిగిన ఈ కార్యక్రమం మొదటి భాగం ఇప్పటికే ప్రసారం అయింది.

సిద్ధమైన జీ తెలుగు
ఇక తాజాగా జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ 2025 రెండో భాగాన్ని ప్రసారం చేయనుంది జీ తెలుగు. ఈ మెగా ఈవెంట్ రెడ్ కార్పెట్ పార్ట్-2 శుక్రవారం, అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం పార్ట్ 2ను శనివారం మీ ముందుకు తెచ్చేందుకు సిద్ధమైంది జీ తెలుగు ఛానెల్.
రెండు తేదీల్లో
అలరించే ప్రదర్శనలు, హృదయాన్ని హత్తుకునే క్షణాలు, మరపురాని అనుభవాలతో తెలుగు టెలివిజన్ స్ఫూర్తిని ప్రతిబింబించే జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ 2025 రెడ్ కార్పెట్, పార్ట్-2 అక్టోబర్ 17,18 తేదీల్లో సాయంత్రం 5 గంటలకు జీ తెలుగులో ప్రసారం కానున్నాయని ప్రకటించారు.
ఇవాళ, రేపు ప్రసారం
అంటే, ఈ ఈవెంట్ ఇవాళ, రేపు ప్రసారం కానున్నాయి. తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ 2025 పార్ట్ 2 అద్భుతమైన ప్రదర్శనలు, అలరించే సంభాషణలు, కన్నీళ్లు పెట్టించే ఉద్వేగ క్షణాలతో మీ ముందుకు రానుంది.
ఫరియా అబ్ధుల్లా బెల్లీ డ్యాన్స్
ఎనర్జిటిక్ యాంకర్స్ సుధీర్, రవి ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా వ్యవహరించనున్నారు. దశావతారం ప్రేరణతో చేసిన నృత్యం, నాస్టాల్జిక్ రెట్రో సాంగ్స్ ఫెర్ఫామెన్స్, మెగాస్టార్ చిరంజీవి ఐకానిక్ సాంగ్స్‌కి సీరియల్ హీరోయిన్లతో కలిసి సుధీర్ చేసిన డాన్స్, ఫరియా అబ్దుల్లా బెల్లీ డాన్స్ ప్రేక్షకులను అలరించనున్నాయి.
ప్రియురాలి కోసం పాట
సీరియల్ టీమ్స్‌తో రవి, సుధీర్ ఆడించే బంతి ఆట అందరినీ కడుపుబ్బా నవ్విస్తుంది. ఆటో విజయశాంతి సీరియల్ నుంచి చిరంజీవి (స్వామినాథన్) తన ప్రియురాలి కోసం పాడే పాట అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. జగద్ధాత్రిగా జీ తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న దీప్తి మన్నె పెళ్లి ప్రకటించడంతో అందరూ కలిసి పెళ్లికూతురుని చేస్తారు.
తల్లిదండ్రులకు ఎమోషనల్ ట్రిబ్యూట్
పడమటి సంధ్యారాగం జంట రఘురాం (సాయి కిరణ్), జానకి (జయశ్రీ) తమ భావాలను మంచి పాటతో పంచుకుంటారు. అమ్మాయిగారు సీరియల్ ఫేమ్ యశ్వంత్ తన తల్లిదండ్రులకు ఎమోషనల్ ట్రిబ్యూట్‌తో ప్రేక్షకులను కదిలిస్తాడు. సరిగమప గాయనీగాయకుల ప్రదర్శన అందరి హృదయాలను తాకుతుంది.
మంచు మనోజ్ ప్రపోజ్
మంచు మనోజ్ తన భార్యకు పాటను అంకితం చేస్తూ జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ 2025 వేదికపై మరోసారి ప్రపోజ్ చేస్తాడు. మిరాయి సినిమా నుంచి హిలేరియస్ బ్లాక్ స్వార్డ్ స్కిట్, రాజా అవార్డు గెలుచుకున్న మూమెంట్ స్పూఫ్‌తో డ్రామా జూనియర్స్ పిల్లలు నవ్వులు పూయిస్తారు. సరదాలు, సంతోషాలు, సంబరాలు, ఉద్వేగాల సమాహారంగా జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ 2025 పార్ట్ 2 సాగనుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


