రెండు రోజులపాటు జీ తెలుగు కుటుంబం అవార్డ్స్- సౌందర్య లహరిగా హీరో శ్రీకాంత్ భార్య ఊహా- లయ, ఇంద్రజ, రాశి, లైలాతో సందడి!

జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ 2025 పార్ట్ 1 రెండు రోజుల పాటు సాగనుంది. రెడ్ కార్పెట్ కార్యక్రమం ఓ రోజున, అవార్డుల ప్రదానోత్సవం మరో రోజున నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో సీరియల్ హీరో హీరోయిన్ల డ్యాన్సులతో పాటు లయ, ఇంద్రజ, రాశి, లైలాతో హీరో శ్రీకాంత్ సందడి చేయనున్నారు.

Published on: Oct 9, 2025, 13:31:32 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నిరంతరం ప్రేక్షకులకు వినోదం అందిస్తూ రెండు దశాబ్దాలుగా విజయవంతంగా కొనసాగుతున్న ఛానల్​ జీ తెలుగు. అచంచలమైన అంకితభావంతో అలరిస్తూ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టడంలో జీ తెలుగు ఎదుగుదల కొనసాగుతూనే ఉంది.

రెండు రోజులపాటు జీ తెలుగు కుటుంబం అవార్డ్స్- సౌందర్య లహరిగా హీరో శ్రీకాంత్ భార్య ఊహా- లయ, ఇంద్రజ, రాశి, లైలాతో సందడి!
రెండు రోజులపాటు జీ తెలుగు కుటుంబం అవార్డ్స్- సౌందర్య లహరిగా హీరో శ్రీకాంత్ భార్య ఊహా- లయ, ఇంద్రజ, రాశి, లైలాతో సందడి!

జీ తెలుగు కుటుంబం అవార్డ్స్

జీ తెలుగు ఉన్నతికి కృషి చేస్తున్న ప్రతిభావంతులైన నటీనటులు, కళాకారులు, దర్శకులు, రచయితలు, నిర్మాతలకు ప్రతి సంవత్సరం ప్రతిష్ఠాత్మక జీ తెలుగు కుటుంబం అవార్డులను ప్రదానం చేస్తూ అదే ఉత్సాహంతో ముందుకు సాగాలని ప్రోత్సహిస్తుంది.

ప్రతి ఏటా ఘనంగా జరిగే జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ వేడుక ఈ సంవత్సరం ‘వసుధైవ కుటుంబం’ నేపథ్యంతో మరింత వైభవంగా జరుగనుంది. జీ తెలుగు కుటుంబం అవార్డ్స్​ 2025 పార్ట్​‌‌-1 రెడ్​ కార్పెట్‌పై బుల్లితెర తారలు, వెండితెర ప్రముఖులు సందడి చేయనున్నారు.

రెండు రోజుల పాటు

అక్టోబర్​ 10 శుక్రవారం, అక్టోబర్ 11 శనివారం సాయంత్రం 5 గంటలకు ప్రతిష్టాత్మక జీ తెలుగు కుటుంబం అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం మొదటి భాగం జరగనుంది. అంటే, రెండు రోజులపాటు జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ 2025 పార్ట్ 1 నిర్వహించనున్నారు.

జీ తెలుగు ఇరవై సంవత్సరాల ప్రస్థానాన్ని ప్రతిబింబించేలా ఈ ఏడాది జీ తెలుగు కుటుంబం అవార్డ్స్​ 2025 వేడుక ఆసక్తికరంగా సాగనుంది. అక్టోబర్​ 10, శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారం కానున్న రెడ్​ కార్పెట్​ కార్యక్రమంలో అందంగా ముస్తాబైన టాలీవుడ్​ తారలు, ప్రముఖులు, బుల్లితెర నటీనటులు, ప్రత్యేక అతిథులు సందడి చేయనున్నారు.

యాంకర్స్‌గా ప్రదీప్, శ్రీముఖి

అంగరంగ వైభవంగా జరగనున్న జీ తెలుగు కుటుంబం అవార్డ్స్​ కార్యక్రమం మొదటి భాగానికి ఎనర్జిటిక్ యాంకర్స్ ప్రదీప్​ మాచిరాజు- శ్రీముఖి వ్యాఖ్యాతలుగా వ్యవహరించనున్నారు. ప్రదీప్​ కామెడీ​ పంచ్‌లు, శ్రీముఖి ఆకట్టుకునే మాటల కలబోతతో ఈ కార్యక్రమం ఆహ్లాదభరితంగా సాగనుంది.

జీ తెలుగు నటీనటులు తమ సీరియల్​ కుటుంబాలతో కలిసి వేదికపైకి రావడంతో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ప్రదీప్​, శ్రీముఖి వారిని పరిచయం చేస్తూ వారు నటిస్తున్న సీరియల్స్​ కథల నేపథ్యాన్ని వివరిస్తూ ప్రేక్షకులను అలరిస్తారు.

కళ్లకు గంతలు కట్టుకుని

అద్భుతమైన ప్రదర్శనలు, అలరించే కామెడీ పంచులతో సాగే ఈ కార్యక్రమంలో హీరో శ్రీకాంత్​ కళ్లకు గంతలు కట్టుకుని తన సౌందర్యలహరిని వెతుకుతాడు. అందరు అమ్మాయిల మధ్య ఉన్న తన భార్య ఊహని కనిపెట్టి అందరినీ ఆశ్చర్యపరుస్తాడు. జీ తెలుగు సీరియల్​ హీరోయిన్లు వారికి పలు బహుమతులు అందిస్తారు.

అంతేకాదు, శ్రీకాంత్ 90వ దశకంలో తనతో నటించిన హీరోయిన్లు లయ, ఇంద్రజ, రాశి, లైలా, ఇతరులతో కలిసి డాన్స్​ చేసి అలరిస్తారు. ప్రముఖ నటుడు అలీ, ఇంద్రజ తమ ఫేమస్​ సాంగ్​ ‘నీ జీన్సు ప్యాంటు చూసి బుల్లెమ్మో’ పాటకు మరోసారి జీ తెలుగు కుటుంబం అవార్డ్స్​ వేదికపై నర్తించి అందరినీ జ్ఞాపకాల్లోకి తీసుకెళ్తారు.

సీరియల్ హీరో హీరోయిన్ల డ్యాన్స్

సీరియల్ హీరో, హీరోయిన్లు చేసిన అద్భుతమైన డాన్స్ ప్రదర్శనలు, అవార్డ్స్ అందుకున్న అనంతరం పలువురు నటీనటులు చేసే భావోద్వేగభరిత ప్రసంగాలు ప్రేక్షకుల మనస్సులను గెలుచుకుంటాయని మేకర్స్ చెబుతున్నారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More