డ్యూడ్ రివ్యూ.. ప్రదీప్ రంగనాథన్ హ్యాట్రిక్ కొట్టాడా? మమితా బైజు, నేహా శెట్టి సినిమా మెప్పించిందా?

తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ యాక్ట్ చేసిన లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ చిత్రం డ్యూడ్. ప్రేమలు హీరోయిన్ మమితా బైజు, నేహా శెట్టి యాక్ట్ చేసిన ఈ సినిమాకు కీర్తిశ్వరన్ దర్శకత్వం వహించారు. ఇవాళ (అక్టోబర్ 17) విడుదలైన ఈ సినిమా ఎలా ఉంది?, ప్రదీప్ హ్యాట్రిక్ కొట్టాడా? లేదా అనేది నేటి డ్యూడ్ రివ్యూలో చూద్దాం.

Published on: Oct 17, 2025, 16:56:02 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

టైటిల్: డ్యూడ్

డ్యూడ్ రివ్యూ.. ప్రదీప్ రంగనాథన్ హ్యాట్రిక్ కొట్టాడా? మమితా బైజు, నేహా శెట్టి సినిమా మెప్పించిందా?
డ్యూడ్ రివ్యూ.. ప్రదీప్ రంగనాథన్ హ్యాట్రిక్ కొట్టాడా? మమితా బైజు, నేహా శెట్టి సినిమా మెప్పించిందా?

నటీనటులు: ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు, నేహా శెట్టి, శరత్ కుమార్, రోహిణి, హృదు హరూన్ తదితరులు

కథ, దర్శకత్వం: కీర్తిశ్వరన్

సంగీతం: సాయి అభ్యంకర్

సినిమాటోగ్రఫీ: నికేత్ బొమ్మి

ఎడిటింగ్: భరత్ విక్రమన్

నిర్మాతలు: నవీన్ యెర్నేనీ, వై రవిశంకర్

విడుదల తేది: అక్టోబర్ 17, 2025

లవ్ టుడే, డ్రాగన్ వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ నటించిన లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ సినిమా డ్యూడ్. కీర్తిశ్వరన్ డైరెక్టర్‌గా పరిచయం అయిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మించారు.

మమితా బైజు, నేహా శెట్టి హీరోయిన్లుగా చేసిన డ్యూడ్ ఇవాళ (అక్టోబర్ 17) థియేటర్లలో విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉంది?, ప్రదీప్ రంగనాథన్ హ్యాట్రిక్ కొట్టాడా? లేదా అనేది నేటి డ్యూడ్ రివ్యూలో తెలుసుకుందాం.

కథ:

మంత్రి ఆదికేశవులు (శరత్ కుమార్) కుమార్తె అయిన కుందన (మమితా బైజు) మేనత్త కొడుకు గగన్ (ప్రదీప్ రంగనాథన్)ను ప్రేమిస్తుంది. ప్రపోజ్ కూడా చేస్తుంది. కానీ, గగన్ రెజెక్ట్ చేస్తాడు. లవ్ ఫెయిల్యూర్ నుంచి బయటపడేందుకు బెంగళూరు వెళ్లిపోతుంది కుందన. దాంతో గగన్ మనసులోని ప్రేమ బయటపడుతుంది.

అదే విషయం వెళ్లి మామ ఆదికేశవులుకు చెబుతాడు గగన్. దానికి సంతోషించిన ఆదికేశవులు కుమార్తె పెళ్లి చేయించడానికి రెడీ అవుతాడు. బెంగళూరు నుంచి వచ్చిన కుందన గగన్‌తో పెళ్లికి ఒప్పుకోదు.

డ్యూడ్ మూవీ ట్విస్టులు

ఆ తర్వాత ఏమైంది గగన్‌తో పెళ్లి ఒప్పుకోకపోడానికి కుందన చెప్పిన కారణాలు ఏంటీ? గగన్-కుందన పెళ్లికి ఏర్పడిన అడ్డంకులు ఏంటీ? అన్నా చెల్లెలు అయిన కుందన తండ్రి, గగన్ తల్లి ఎందుకు మాట్లాడుకోరు? గగన్‌కు ఉన్న మరో లవ్ ట్రాక్ ఏంటీ? పార్థు (హృదూ హరూన్) ఎవరు? గగన్-కుందన్ పెళ్లి చేసుకున్నారా అనేది తెలియాలంటే డ్యూడ్ చూడాల్సిందే.

విశ్లేషణ:

డ్యూడ్ ఒక కామెడీ లవ్ స్టోరీ చిత్రం. లవ్ స్టోరీ సినిమాల్లో సాధారణంగా కథ ఏమాత్రం కొత్తగా ఉండదు. కానీ, దాన్ని మలిచిన తీరు ప్రేక్షకులను మెప్పిస్తుంది. అందులో డ్యూడ్ పూర్తిగా సక్సెస్ అయిందని చెప్పొచ్చు. ఈ కథ రొటీన్‌గా అనిపించిన టేకింగ్ మాత్రం ఫుల్ ఫన్ అండ్ జోష్‌తో సాగిపోతుంది.

లవ్, రెజెక్షన్, పెళ్లి, త్యాగం వంటి అంశాలతో డ్యూడ్ సాగుతుంది. కానీ, చూస్తున్నంతసేపు కొత్తగా ఫ్రెష్‌గా సీన్స్ ఉంటాయి. సినిమా అంతా ఫన్ రైడ్‌తో సాగిపోతుంది. కొన్ని సర్‌ప్రైజ్‌లు బాగుంటాయి. ప్రాంక్‌తో వచ్చే సీన్స్ చాలా నవ్విస్తాయి. క్లైమాక్స్ సన్నివేశాల్లో కీలక పాత్ర పోషిస్తాయి. కొన్ని చోట్ల్ ఎమోషనల్ సీన్స్ గుండెకు గుచ్చుతాయి.

తొలి సినిమాతోనే

ఊహించని మలుపులు వంటివి ఏముండవు కానీ స్క్రీన్ మీద వచ్చే సన్నివేశాలు మెప్పిస్తాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. మ్యూజిక్ చాలా బాగుంది. బీజీఎమ్ ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్, నిర్మాణ విలువలు అన్ని చక్కగా కుదిరాయి. ఆకాశమే హద్దురా సినిమా అసిస్టెంట్‌గా పనిచేసిన కీర్తిశ్వరన తొలి మూవీతో మంచి హిట్ అందుకున్నారని చెప్పొచ్చు.

ఇక డ్యూడ్ మొత్తం ప్రదీప్ రంగనాథనే కనిపిస్తాడు. తన ఎక్స్‌ప్రెషన్స్, కామెడీతో ఫుల్ ఎంటర్‌టైన్ చేస్తాడు. శరత్ కుమార్ యాక్టింగ్ చాలా బాగుంటుంది. సీరియస్‌గా, కామెడీగా బాగా చేశారు. ఇక మమితా బైజుకు మంచి పాత్ర పడింది. తన నటనతో చాలా మెప్పిస్తుంది. నేహా శెట్టి అట్రాక్ట్ చేస్తుంది.

ఫైనల్‌గా చెప్పాలంటే?

రోహిణి, మలయాళ నటుడు హృదు హరూన్ పరిధి మేర ఆకట్టుకుంటారు. ఫైనల్‌గా చెప్పాలంటే ఫుల్ ఫన్ రైడ్‌తో సాగే ఎంటర్‌టైరన్ చిత్రం ఈ డ్యూడ్.

రేటింగ్: 3/5

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More