డైరెక్టర్‌తో మీటింగ్ జరిగింది.. రాత్రంతా ప్రాక్టీస్ చేశాను.. సవాలుగా అనిపించింది.. ప్రేమలు హీరోయిన్ మమితా బైజు కామెంట్స్
ప్రేమలు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న మలయాళ బ్యూటీ మమితా బైజు నటించిన లేటెస్ట్ రొమాంటిక్ మూవీ డ్యూడ్. ప్రదీప్ రంగనాథన్ హీరోగా చేసిన ఈ సినిమాకు కీర్తీశ్వరన్ దర్శకత్వం వహించారు. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడలో విడుదలైన ఈ సినిమా ప్రెస్ మీట్‌లో మమితా బైజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
తెలుగు సినీ ఇండస్ట్రీలో సూపర్ హిట్ కొట్టిన మలయాళ సినిమా ప్రేమలు. ఈ మూవీలో హీరోయిన్‌గా చేసిన మమితా బైజు తెలుగు రాష్ట్రాల్లో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ఇప్పుడు మమితా బైజు హీరోయిన్‌గా చేసిన మరో సినిమా డ్యూడ్. తమిళంలో హీరోగా మారిన డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ ఇందులో కథానాయకుడిగా చేశాడు.

అక్టోబర్ 17న డ్యూడ్ రిలీజ్
ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన డ్యూడ్ సినిమాతో కీర్తిశ్వరన్ డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. శరత్ కుమార్ కీలక పాత్ర పోషించిన డ్యూడ్ సినిమాను అక్టోబర్ 17న తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా హీరోయిన్ మమితా బైజు విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
తొలిసారిగా నన్ను సంప్రదించినప్పుడు
-ప్రేమలు రిలీజ్ తర్వాత మేకర్స్ నన్ను సంప్రదించారు. ఆ తర్వాత డైరెక్టర్‌తో మీటింగ్ జరిగింది. కీర్తి తొలిసారిగా నన్ను సంప్రదించినప్పుడు, కథను చెప్పిన తీరు నాకు బాగా నచ్చింది. కాన్సెప్ట్ కూడా చాలా ఆసక్తికరంగా అనిపించింది.
అలాంటి పాత్ర చేయలేదు
-డ్యూడ్ కథలో నా పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంది. కురల్ పాత్రలో చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఇప్పటివరకూ అలాంటి పాత్ర చేయలేదు.
-“కురల్” చాలా హానెస్ట్ క్యారెక్టర్. ఆమె తన భావోద్వేగాల పట్ల నిబద్ధతగా ఉంటుంది, చుట్టూ ఉన్న వారందరితో స్నేహంగా ఉంటుంది. ఆమె చాలా సూటిగా మాట్లాడుతుంది. ఆ పాత్ర చేయడం చాలా మంచి ఎక్స్‌పీరియన్స్.
సవాలుగా, ఉత్సహాంగా అనిపించింది
-ఈ సినిమాలో కొన్ని ఎమోషనల్ సీన్స్ నాకు సవాలుగా అనిపించాయి. ఆ సీన్స్ కోసం నేను రాత్రంతా డైలాగ్స్ ప్రాక్టీస్ చేశాను. షూట్ సమయంలో వాటి గురించి ఆందోళన లేకుండా సీన్ మీద ఫోకస్ చేశా. నేను ఎప్పుడూ షూట్‌కు ముందు బాగా ప్రిపేర్ అయి ఉండాలని చూసుకుంటాను. అందుకే ఇది నాకు ఒకేసారి సవాలుగా, ఉత్సాహంగా అనిపించింది.
సహజంగా సంతోషంగా మార్చేస్తారు
-ప్రదీప్ రంగనాథన్‌తో కలిసి పనిచేయడం గొప్ప ఎక్స్‌పీరియన్స్. ఆయనతో సెట్‌లో పని చేయడం చాలా ఫన్‌గా, సౌకర్యంగా ఉంటుంది. ఏ సీన్ అయినా సహజంగా, సంతోషంగా మార్చేస్తారు. ఎంత సక్సెస్ వచ్చినా ఆయన చాలా సింపుల్‌గా ఉంటారు.
రియల్ లైఫ్‌లో అంతే
-ప్రదీప్‌తో నటించడం చాలా ఈజీగా అనిపించింది. ప్రేక్షకులతో ఆయనకు ఉండే కనెక్షన్ అది స్క్రీన్‌పై మాత్రమే కాదు, రియల్ లైఫ్‌లో కూడా అంతే లవబుల్‌గా ఉంటుంది. మా పాత్రలు కెమిస్ట్రీ ప్రేక్షకులని ఆకట్టుకుంటాయి. శరత్ కుమార్ లాంటి సినియర్ యాక్టర్‌తో కలిసి పని చేయడం అదృష్టంగా భావిస్తున్నాను.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


