ఓటీటీలోకి సరికొత్త మలయాళ క్రైమ్ థ్రిల్లర్- దృశ్యం డైరెక్టర్ మూవీ- తెలుగుతో సహా 7 భాషల్లో స్ట్రీమింగ్- 7.1 రేటింగ్!
ఓటీటీలోకి సరికొత్త మలయాళ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ మిరాజ్ డిజిటల్ ప్రీమియర్‌కు రానుంది. తాజాగా మిరాజ్ ఓటీటీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. తెలుగుతోపాటు ఏడు భాషల్లో మిరాజ్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. 7.1 రేటింగ్ సాధించిన మిరాజ్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ వివరాలపై ఇక్కడ లుక్కేద్దాం.
ఓటీటీలో వచ్చే మలయాళ సినిమాలకు ఫుల్ క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా మలయాళం నుంచి వచ్చే థ్రిల్లర్ జోనర్ సినిమాలకు దేశవ్యాప్తంగా మంచి పేరు ఉంది. ఇదంతా ఎక్కువగా మొదలైంది దృశ్యం సినిమాతో అని చెప్పుకోవచ్చు. థ్రిల్లర్ జోనర్స్ సినిమాల్లో ఒక ట్రెండ్ సెట్ చేసిన మూవీస్ దృశ్యం అండ్ దృశ్యం 2.

దృశ్యం సినిమాల దర్శకుడు
ఈ రెండు సినిమాలను తెరకెక్కించిన డైరెక్టర్ జీతూ జోసెఫ్. ఈ దృశ్యం సిరీస్‌తో జీతూ జోసెఫ్ నేషనల్ లెవెల్‌లో క్రేజ్ సంపాదించుకున్నారు. ఇప్పుడు ఆయన దృశ్యం 3 సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. అయితే, దృశ్యం 3 కంటే ముందుగా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో ఓ సినిమా వచ్చింది.
ఆకాశమే హద్దురా హీరోయిన్
ఆ మూవీనే మిరాజ్. ఆసిఫ్ అలీ, అపర్ణ బాలమురళి మెయిన్ లీడ్ రోల్స్ చేశారు. సూర్య నటించిన ఆకాశమే హద్దురా సినిమాతో అపర్ణ బాలమురళి తెలుగులోనూ మంచి క్రేజ్ తెచ్చుకుంది. జీతూ జోసెఫ్, అపర్ణ బాలమురళి కాంబినేషన్‌లో తెరకెక్కిన మిరాజ్ సెప్టెంబర్ 19న థియేటర్లలో విడుదలై మంచి హిట్ టాక్ తెచ్చుకుంది.
మిరాజ్ ఓటీటీ రిలీజ్ డేట్
మిరాజ్ ఓటీటీ స్ట్రీమింగ్ కోసం థ్రిల్లర్ ఆడియెన్స్ ఎంతగానో ఎదురుచూశారు. ఇప్పుడు మిరాజ్ ఓటీటీలోకి అడుగుపెట్టనుంది. తాజాగా మిరాజ్ ఓటీటీ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు మేకర్స్. మలయాళంలో క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన మిరాజ్ అక్టోబర్ 20 నుంచి ఓటీటీ ప్రీమియర్ కానుంది.
7 భాషల్లో స్ట్రీమింగ్
ప్రముఖ ప్లాట్‌ఫామ్ సోనీ లివ్‌లో మిరాజ్ ఓటీటీ రిలీజ్ కానుంది. కేవలం మలయాళంలోనే కాకుండా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, బెంగాలీ, మరాఠీ వంటి ఏడు భాషల్లో మిరాజ్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ఐఎమ్‌డీబీ నుంచి పదికి 7.1 రేటింగ్ సాధించిన మిరాజ్ మూవీని అక్టోబర్ 20 నుంచి సోనీ లివ్ ఓటీటీలో ఎంచక్కా వీక్షించవచ్చు.
మిరాజ్ కథ
ఇక మిరాజ్ కథ విషయానికొస్తే.. అభిరామి (అపర్ణ బాలమురళి) తన లవర్ కిరణ్ (హకీమ్ షాజహాన్)ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది. ఈ క్రమంలో పోలీస్ స్టేషన్ నుంచి అభిరామికి కాల్ వస్తుంది. దాంతో పీఎస్‌కు వెళ్లిన అభిరామికి కిరణ్ రైలు ప్రమాదంలో మరణించినట్లు తెలుస్తుంది. దాంతో షాక్‌లోకి వెళ్తుంది అభిరామి.
మిరాజ్ ట్విస్టులు
ఆ షాక్ నుంచి తేరుకోకముందే అభిరామిని ఓ హార్డ్ డిస్క్ గురించి పోలీస్ నుంచి రౌడీ వరకు ప్రశ్నల వర్షం కురిపిస్తారు. కిరణ్‌ది నిజంగా యాక్సిడెంటా? అభిరామిని అడిగిన హార్డ్ డిస్క్‌లో ఏముంది? అభిరామికి ఎదురైన ప్రమాదం ఏంటీ? దాని నుంచి తప్పించుకుందా? అనేటువంటి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో మిరాజ్ తెరకెక్కింది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


