హీరో నితిన్ తండ్రి విడుదల చేస్తున్న సినిమా ఆర్యన్- డార్క్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌గా- ఐయామ్ ది గాయ్ సాంగ్ రిలీజ్
తమిళ హీరో విష్ణు విశాల్ నటించిన లేటెస్ట్ డార్క్ అండ్ సస్పెన్స్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ ఆర్యన్. ఈ సినిమాను తెలుగులో హీరో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి విడుదల చేస్తున్నారు. తాజాగా ఆర్యన్ సినిమా నుంచి ఐయామ్ ది గాయ్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన హీరో విష్ణు విశాల్ డిఫరెంట్ చిత్రాలతో ఆకట్టుకుంటున్నాడు. విష్ణు విశాల్ నటించిన లేటెస్ట్ మూవీ ఆర్యన్. విష్ణు విశాల్ స్టూడియోస్, శుభ్ర, ఆర్యన్ రమేష్‌లతో కలిసి నిర్మించిన సినిమా ఇది. గ్రిప్పింగ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రవీణ్ కె దర్శకత్వం వహించారు.

డార్క్ అండ్ సస్పెన్స్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్
డార్క్ అండ్ సస్పెన్స్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఆర్యన్ మూవీ టీజర్‌ను మేకర్స్ ఇటీవల విడుదల చేశారు. ఈ టీజర్‌కి దీనికి అద్భుతమైన స్పందన వచ్చింది. తాజాగా ఆర్యన్ సినిమా నుంచి ఐయామ్ ది గాయ్ సాంగ్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. జిబ్రాన్ స్వరపరిచిన ఈ పాటకు సామ్రాట్ సాహిత్యం అందించారు.
ఆర్యన్ ఐయామ్ ది గాయ్ సాంగ్ రిలీజ్
జిబ్రాన్, శ్రీకాంత్ హరిహరన్ ఐయామ్ ది గాయ్ పాటను అద్భుతంగా పాడారు. ఈ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. దీంతో ఆర్యన్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది. ఇకపోతే ఆర్యన్ చిత్రం అక్టోబర్ 31న విడుదల కానుంది. హీరో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి ఈ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో శ్రేష్ట్ మూవీస్ ద్వారా విడుదల చేయనున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ రిలీజ్
అనేక బ్లాక్ బస్టర్లను అందించిన ప్రొడక్షన్ , డిస్ట్రిబ్యూషన్ బ్యానర్ మద్దతుతో ఈ ఆర్యన్ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. శ్రేష్ట్ మూవీస్ గతంలో విక్రమ్, అమరన్, థగ్ లైఫ్ వంటి చిత్రాలను విడుదల చేశారు. కాగా, విష్ణు విశాల్ హీరోగా చేసిన ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్, మానస చౌదరి హీరోయిన్లుగా చేస్తున్నారు.
పోలీస్ ఆఫీసర్‌గా
డైరెక్టర్, నటుడు సెల్వరాఘవన్ కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రంలో విష్ణు విశాల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. వీరితోపాటు సాయి రోనక్, తారక్ పొన్నప్ప, మాల పార్వతి, అవినాష్, అభిషేక్ జోసెఫ్ జార్జ్ సహాయక పాత్రల్లో నటిస్తున్నారు.
సహా రచయితగా
విష్ణు విశాల్ ఎఫ్ఐఆర్ చిత్రానికి దర్శకత్వం వహించిన మను ఆనంద్ ఆర్యన్ మూవీకి సహ రచయితగా పనిచేశారు. హరీష్ కన్నన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించగా, జిబ్రాన్ సంగీతం అందించారు. శాన్ లోకేష్ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. కాగా, ఆర్యన్ ట్రైలర్, ఆడియో లాంచ్‌కు సంబంధించిన అప్‌డేట్‌లు త్వరలో అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


