59 రూపాయలకే జీ5 ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్.. ఈ 7 రోజులు మాత్రమే.. తెలుగుతో సహా 7 భాషల్లో చూడాల్సిన ఓటీటీ సినిమాలు ఇవే!

జీ5 ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఈ దీపావళి పండుగకు అద్భుతమైన ఆఫర్‌ను ప్రకటించింది. కేవలం 59 రూపాయలకే జీ5 ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. దీంతో క్యాష్ బ్యాక్ ఆఫర్స్ కూడా ప్రకటించింది. 7 రోజులు మాత్రమే ఉండనున్న ఈ ఆఫర్‌‌తో తెలుగుతో సహా 7 భాషల ఓటీటీ స్ట్రీమింగ్ సినిమాలు చూడొచ్చు.

Published on: Oct 14, 2025, 10:53:24 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

దీపావళి పండుగను మరింత సందడిగా మార్చేందుకు ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 అద్భుతమైన ఆఫర్‌ను ప్రకటించింది. ఈ మేరకు పండుగ స్పెషల్ ఆఫర్‌ను వినియోగదారులకు అందించింది. ఇండియాలోని సినీ లవర్స్‌కు ఈ పండుగను మరింత ప్రత్యేకంగా మార్చేందుకు జీ5 తన సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్‌లో మార్పులు, చేర్పుల్ని చేసింది.

59 రూపాయలకే జీ5 ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్.. ఈ 7 రోజులు మాత్రమే.. తెలుగుతో సహా 7 భాషల్లో చూడాల్సిన ఓటీటీ సినిమాలు ఇవే!
59 రూపాయలకే జీ5 ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్.. ఈ 7 రోజులు మాత్రమే.. తెలుగుతో సహా 7 భాషల్లో చూడాల్సిన ఓటీటీ సినిమాలు ఇవే!

జీ5 ఓటీటీ ఆఫర్

దీపావళి సందర్భంగా వన్ వీక్ ప్లాన్ (అక్టోబర్ 13 నుంచి 20 వరకు) అంటూ ప్రత్యేకమైన ఓ ఆఫర్‌ను ప్రకటించింది జీ5. హిందీ కంటెంట్‌ను చూడాలని అనుకునేవారు కేవలం రూ. 149 చెల్లించాలి. మామూలుగా అయితే ఈ ప్యాక్ రూ. 199గా ఉంటుంది. పండుగ సందర్భంగా కేవలం రూ. 149కే ఇప్పుడు వస్తుంది.

తెలుగు కంటెంట్ చూసేందుకు

ఇక ప్రాంతీయ భాషల్లో అంటే తెలుగు, తమిళం, మలయాళం వంటి వాటికి అయితే ఈ ప్యాక్ రూ. 99గా ఉండగా.. ఇప్పుడు దీపావళి సందర్భంగా కేవలం రూ. 59కే రానుంది. అంటే, జీ5లోని తెలుగు కంటెంట్‌ను చూసేందుకు 59 రూపాయలతో ఈ ప్లాన్‌ను తీసుకొచ్చింది.

క్యాష్ బ్యాక్ ఆఫర్స్

ఇక అన్ని రకాల యాక్సెస్ కోసం అయితే రూ. 299 ఉండగా.. ఈ దీపావళి స్పెషల్‌గా రూ. 249 కే రానుంది. ఈ సబ్‌స్క్రిప్షన్స్ టైమ్‌లో పండుగను మరింత స్పెషల్‌గా మార్చేందుకు క్యాష్ బ్యాక్ ఆఫర్లను కూడా ప్రకటించింది. పేటీఎమ్ యూపీఐ ఆటో పే, క్రెడ్ యూపీఐ ఆటో పే వంటి వాటిపై క్యాష్ బ్యాక్ ఆఫర్లు కూడా రానున్నాయి.

జియో సావన్ ప్రో కూడా

అంతే కాకుండా ఈ ప్లాన్స్‌తో పాటుగా జియో సావన్‌ ప్రోను మూడు నెలలు ఉచితంగానూ వినియోగించుకోవచ్చు. దీంతో దీపావళి మరింత స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవనుంది. ఈ దీపావళి సందర్భంగా ఎన్నెన్నో కొత్త కథలు, వెబ్ సిరీస్‌లు, సినిమాల్ని జీ5 ఓటీటీ అందిస్తోంది.

హిందీ, మరాఠీ ఓటీటీ సినిమాలు

హిందీ నుంచి భగవత్ చాప్టర్ వన్ -రాక్షస్, సాలీ మోహబ్బత్, హనీమూన్ సే హత్య వంటి ఓటీటీ సిరీస్‌లు ప్రీమియర్ కానున్నాయి. మరాఠీ నుంచి స్థల్, అత తంబ్యాచ్ నాయ్, జరణ్ వంటి కథతలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. బెంగాలీ నుంచి శ్రీమతి దాస్ గుప్తా, మ్రిగయ ది హంట్, అబర్ ప్రోలోయ్ వంటి సిరీస్‌లు వస్తున్నాయి.

తెలుగు ఓటీటీ సినిమాలు

తెలుగు నుంచి కిష్కింధపురి, డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనబడుటలేదు, జయమ్ము నిశ్చయమ్మురా వంటివి ఓటీటీ రిలీజ్ కానున్నాయి. తమిళం నుంచి వేదువన్, హౌస్ మేట్స్, మామన్ వంటి సినిమాలు ఉన్నాయి.

ఏడు భాషల్లో

మలయాళం నుంచి సుమతి వలువు, అభంతర కుట్టవాలి, కమ్మట్టం వంటివి సిద్దంగా ఉన్నాయి. ఇక కన్నడ నుంచి ఏలుమలే, అయ్యన మనే, మరిగల్లు వంటి కథలు అలరిస్తాయి. ఈ ఆఫర్‌తో హిందీ, మరాఠీ, బెంగాలీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ వంటి ఏడు భాషల్లో ఓటీటీ సినిమాలు చూడొచ్చు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More