ఓటీటీలోకి ఇవాళ వచ్చేసిన నయా మైథలాజికల్ హిస్టరీ థ్రిల్లర్- ఏఐతో చేసిన పౌరాణిక సిరీస్- తెలుగు కలిపి 7 భాషల్లో స్ట్రీమింగ్!
ఓటీటీలోకి ఇవాళ సరికొత్త మైథలాజికల్ హిస్టరీ వార్ యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ మహాభారత్ ఏక్ ధర్మ్‌యుద్ధ్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. తెలుగుతో కలిపి ఏడు భాషల్లో మహాభారత్ ఏక్ ధర్మ్‌యుద్ధ్ ఓటీటీ రిలీజ్ అయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో తెరకెక్కించిన మహాభారత్ ఏక్ ధర్మ్‌యుద్ధ్ ఓటీటీ స్ట్రీమింగ్ తెలుసుకుందాం.
భారతదేశ పురాణాల్లో మహాభారతానికి ప్రత్యేక విశిష్టత ఉంటుంది. మహాభారతంలోని కథలు, పాత్రలు ప్రతి యుగంలో తారసపడుతుంటాయి. మహాభారతం నుంచి నేర్చుకునే మంచి ఎంతో ఉంది. అలాంటి మహాభారతంపై ఎన్ని సినిమాలు, సిరీస్‌లు వచ్చిన ఏమాత్రం బోర్ కొట్టదు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం
మహాభారతాన్ని ఆధారంగా చేసుకుని పలు విధాలుగా సినిమాలు, సిరీస్‌లను తెరకెక్కిస్తుంటారు మేకర్స్. ఇక ఇటీవల కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వాడకం విపరీతంగా పెరిగిపోయింది. కోట్ల భారతీయులు పవిత్రంగా చూసే మహాభారతాన్ని ఏఐతో రూపొందించి సరికొత్తగా తెరకెక్కించారు బాలీవుడ్ నిర్మాతలు.
35 ఏళ్ల తర్వాత
మైథలాజికల్ హిస్టరీ వార్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఓటీటీ వెబ్ సిరీస్ మహాభారత్ ఏక్ ధర్మ్‌యుద్ధ్. ప్రఖ్యాత చెందిన బీఆర్ చోప్రా మహాభారతం తర్వాత దాదాపు 35 సంవత్సరాలకు ఈ పౌరాణిక వెబ్ సిరీస్ తిరిగి వచ్చింది. "మహాభారత్ ఏక్ ధర్మ్‌యుద్ధ్" పేరుతో పూర్తిగా ఏఐ రూపొందించిన పురాణ గాథ ఇది.
కురుక్షేత్రం సంఘటనలతో
ప్రపంచంలోని పురాతన ఇతిహాసాలలో ఒకటి హస్తినాపూర్ సింహాసనం కోసం పాండవులు, కౌరవుల మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం. కురుక్షేత్ర యుద్ధానికి దారితీసిన కారణాలు, సంఘటనలతో కృత్తిమ మేథస్సుతో ఈ మహాభారత్ ఏక్ ధర్మ్‌యుద్ధ్ ఓటీటీ సిరీస్‌ను తెరకెక్కించారు.
మహాభారత్ ఏక్ ధర్మ్‌యుద్ధ్ ఓటీటీ
ఈ సిరీస్‌ను పూర్తిగా ఏఐతో రూపొందించిన పాత్రలన్నీ దాదాపుగా రియాలిటీగా కనిపించడం ఆకట్టుకుంటోంది. ఇలాంటి ఈ సిరీస్ మహాభారత్ ఏక్ ధర్మ్‌యుద్ధ్ ఓటీటీలోకి ఇవాళ (అక్టోబర్ 25) వచ్చేసింది. జియో హాట్‌స్టార్‌లో నేటి నుంచి మహాభారత్ ఏక్ ధర్మ్‌యుద్ధ్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అది కూడా ఏడు భాషల్లో ఓటీటీ ప్రీమియర్ అయింది.
7 భాషల్లో స్ట్రీమింగ్
తెలుగుతో కలిపి హిందీ, మలయాళం, తమిళం, కన్నడ, మరాఠి, బెంగాలి వంటి 7 భాషల్లో మహాభారత్ ఏక్ ధర్మ్‌యుద్ధ్ ఓటీటీ రిలీజ్ అయింది. అయితే, ఇావాళ కేవలం ఒకే ఒక్క ఎపిసోడ్ మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చారు. అది కూడా కేవలం 20 నిమిషాల రన్‌టైమ్‌తో ఉండటం విశేషం.
100 ఎపిసోడ్స్‌తో సిరీస్
కానీ, మహాభారత్ ఏక్ ధర్మ్‌యుద్ధ్ సిరీస్ మొత్తంగా 100 ఎపిసోడ్లుగా ఉంది. ప్రతి శనివారం వారం వారం ఒక్కో ఎపిసోడ్‌ను ఓటీటీ స్ట్రీమింగ్ చేయనున్నారు మేకర్స్. జియో హాట్‌స్టార్ ఓటీటీలోనే కాకుండా టీవీ ఛానెల్ స్టార్ ప్లస్‌లో కూడా మహాభారత్ ఏక్ ధర్మ్‌యుద్ధ్‌ను టీవీ ప్రీమియర్ చేయనున్నారు.
ప్రతి శనివారం కొత్త ఎపిసోడ్
అయితే, స్టార్ ప్లస్‌లో అక్టోబర్ 26 అంటే ఆదివారం రాత్రి 7:30 గంటలకు మొదటి ఎపిసోడ్‌ను ప్రసారం చేయనున్నారు. ఆ తర్వాత ప్రతి శనివారం ఒక్కో కొత్త ఎపిసోడ్‌ను అందుబాటులో ఉంచనున్నారు.
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో
మహాభారతాన్ని ఏఐ విజువల్స్‌తో సరికొత్త అనుభూతిని పొందాలనుకునేవారు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో మహాభారత్ ఏక్ ధర్మ్‌యుద్ధ్ ఓటీటీ సిరీస్‌ను ఎంచక్కా వీక్షించవచ్చు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


