విశాఖలో ఏఐ హబ్, డేటా సెంటర్.. గూగుల్‌తో ఎయిర్‌టెల్ వ్యూహాత్మక భాగస్వామ్యం!

విశాఖపట్నంలో మెగా ఏఐ హబ్, డేటా సెంటర్‌ను స్థాపించనుంది గూగుల్. ఈ అతిపెద్ద ప్రాజెక్టులో ఎయిర్‌టెల్ కూడా వ్యూహాత్మక భాగస్వామ్యం కలిగి ఉంది. ఈ మేరకు కంపెనీ ప్రకటించింది.

Updated on: Oct 14, 2025 5:20 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారతీ ఎయిర్‌టెల్ లిమిటెడ్ గూగుల్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగా విశాఖపట్నంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) హబ్, డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు. దీనితో దేశవ్యాప్తంగా ఏఐ వినియోగం వేగవంతం, భారతదేశానికి డిజిటల్ మౌలిక సదుపాయలను మరింత బలపరచడం లక్ష్యంగా ఉంది.

గూగుల్‌తో ఎయిర్‌టెల్ వ్యూహాత్మక భాగస్వామ్యం
గూగుల్‌తో ఎయిర్‌టెల్ వ్యూహాత్మక భాగస్వామ్యం

భారతదేశంలో మొట్టమొదటి మెగా ఏఐ హబ్, డేటా సెంటర్‌ విశాఖపట్నంలో ఏర్పాటు అవుతుంది. దీనిలో గూగుల్‌తో ఎయిర్‌టెల్ కూడా భాగస్వామ్యం కలిగి ఉంది. విశాఖలో ఐదు సంవత్సరాలలో 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనుంది గూగుల్.

ఇందులో భాగంగా భారతదేశంలో ఏఐ, డిజిటల్ వ్యవస్థను బలోపేతం చేసేలా దేశవ్యాప్తంగా హై-స్పీడ్ ఫైబర్, సబ్‌సీ కనెక్టివిటీని నిర్మించనుంది ఎయిర్‌టెల్. ఈ ప్రాజెక్టు భారతదేశాన్ని ప్రపంచ ఏఐ మ్యాప్‌లో ఉంచుతుందని ఎయిర్‌టెల్ పేర్కొంది.

ఐదు ఏళ్ల కాలంలో సుమారు 15 బిలియన్ యూఎస్ డాలర్లను పెట్టుబడి పెట్టనుంది గూగుల్. గిగావాట్ స్థాయి డేటా సెంటర్ ఆపరేషన్లు, సబ్‌సీ నెట్‌వర్క్, క్లీన్ ఎనర్జీ లాంటి మౌలిక సదుపాయాలు ఉంటాయి. ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేయడంలో ఎయిర్‌టెల్ కూడా తనదైన పాత్ర పోషించనుంది. గూగుల్, ఎయిర్‌టెల్ సంయుక్తంగా రూపొందించే డేటా సెంటర్, కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ విశాఖలో నిర్మాణం కానుంది. ఈ ప్రాజెక్టుతో వేగవంతమైన కనెక్టివిటీతోపాటు భారతదేశ డిజిటల్ వ్యవస్థ రూపురేఖలు మారిపోనున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో భారీ డేటా సెంటర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్‌ను ఏర్పాటు చేసేందుకు గూగుల్, ఏపీ ప్రభుత్వం తాజాగా ఒప్పంద చేసుకున్న విషయం తెలిసిందే. ఇది అమెరికా వెలుపల దాని అతిపెద్ద ఏఐ హబ్. ఢిల్లీలో భారత్ ఏఐ శక్తి పేరిట నిర్వహించిన కార్యక్రమంలో గూగుల్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కీలక ఒప్పందం మీద సంతకాలు చేశాయి.

ఈ ప్రాజెక్టుతో వైజాగ్ ఏఐ సిటీగా మారనుంది. ఆసియాలో గూగుల్ ఏర్పాటు చేస్తున్న పెద్ద ప్రాజెక్టు ఇది. 1,88,220 ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉందని అంచనా. గూగుల్‌ క్లౌడ్‌ ఆధారిత కార్యక్రమాలతో ప్రతీ ఏటా.. రూ.9,553 కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.47,720 కోట్ల ఉత్పాదకత జరుగుతుందంటున్నారు. 'ఇది అమెరికా వెలుపల మేం పెట్టుబడి పెట్టే అతిపెద్ద ఏఐ హబ్.' అని గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ అన్నారు.

News/Andhra Pradesh/విశాఖలో ఏఐ హబ్, డేటా సెంటర్.. గూగుల్‌తో ఎయిర్‌టెల్ వ్యూహాత్మక భాగస్వామ్యం!
News/Andhra Pradesh/విశాఖలో ఏఐ హబ్, డేటా సెంటర్.. గూగుల్‌తో ఎయిర్‌టెల్ వ్యూహాత్మక భాగస్వామ్యం!