జటాధర రివ్యూ- సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా, మహేశ్ బాబు మరదలు శిల్పా హారర్ థ్రిల్లర్- నిధులు, పిశాచాలతో మెప్పించిందా?

హీరో సుధీర్ బాబు నటించిన లేటెస్ట్ హారర్ థ్రిల్లర్ సినిమా జటాధర. బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా, మహేశ్ బాబు మరదలు శిల్పా శిరోద్కర్ కీలక పాత్రలు పోషించిన జటాధర ఇవాళ థియేటర్లలో విడుదలైంది. వెంకట్ కల్యాణ్, అభిషేక్ జైశ్వాల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎలా ఉందో నేటి జటాధర రివ్యూలో తెలుసుకుందాం.

Published on: Nov 07, 2025 2:24 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

టైటిల్: జటాధర

జటాధర రివ్యూ- సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా, మహేశ్ బాబు మరదలు శిల్పా హారర్ థ్రిల్లర్- నిధులు, పిశాచాలతో మెప్పించిందా?
జటాధర రివ్యూ- సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా, మహేశ్ బాబు మరదలు శిల్పా హారర్ థ్రిల్లర్- నిధులు, పిశాచాలతో మెప్పించిందా?

నటీనటులు: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా, శిల్పా శిరోద్కర్, దివ్య ఖోస్లా కుమార్, శ్రీనివాస్ అవసరాల, ప్రదీప్ రావత్ తదితరులు

దర్శకత్వం: వెంకట్ కల్యాణ్, అభిషేక్ జైశ్వాల్

సంగీతం: రాజీవ్ రాజ్

సినిమాటోగ్రఫీ: సమీర్ కల్యాణి

ఎడిటింగ్: కార్తిక శ్రీనివాస్

నిర్మాతలు: ఉమేశ్ కుమార్ భన్సల్, శివిన్ నారంగ్, అరుణ్ అగర్వాల్

విడుదల తేది: నవంబర్ 7, 2025

హీరో సుధీర్ బాబు నటించిన తెలుగు హారర్ థ్రిల్లర్ సినిమా జటాధర. దివ్య ఖోస్లా కుమార్ హీరోయిన్‌గా చేసిన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా, మహేశ్ బాబు మరదలు శిల్పా శిరోద్కర్ కీలక పాత్రలు పోషించారు.

వెంకట్ కల్యాణ్, అభిషేక్ జైశ్వాల్ ఇద్దరు దర్శకత్వం వహించిన జటాధర సినిమా ఇవాళ (నవంబర్ 7) థియేటర్లలో విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో నేటి జటాధర రివ్యూలో తెలుసుకుందాం.

కథ:

సైన్స్‌ను తప్పా దెయ్యాలు, పిశాచాలను అస్సలు నమ్మని ఘోస్ట్ హంటర్ శివ (సుధీర్ బాబు). ఎక్కడ దెయ్యాలున్నాయో తెలిస్తే అక్కడికి వెళ్లి అవి లేవని సైంటిఫిక్‌గా నిరూపిస్తుంటాడు. మరోవైపు ఓ బాబును తన తల్లే చంపుతున్నట్లు ఓ కల ఎప్పుడు శివను వెంటాడుతుంటుంది. ఈ క్రమంలో శివ ఫ్రెండ్ రుద్రారం గ్రామంలోని పాడుబడ్డ ఇంట్లో పరిశోధనకు వెళ్లి చనిపోతాడు.

లంకె బిందెలకు కాపాలాగా ఉండే ధన పిశాచి (సోనాక్షి సిన్హా) అతన్ని చంపిందని ప్రచారం సాగుతుంది. ఇది తెలిసిన శివ రుద్రారంలోకి అడుగుపెడతాడు. ఆ తర్వాత ఏమైంది? ధన పిశాచి నేపథ్యం ఏంటీ? శివకు ధన పిశాచికి ఉన్న శత్రుత్వం ఏంటీ? శివ మేనత్త శోభ (శిల్పా శిరోద్కర్) ఏం చేసింది? శివను వెంటాడే కల ఏం చెప్పింది? వంటి విషయాలు తెలియాలంటే జటాధర చూడాల్సిందే.

విశ్లేషణ:

హారర్ థ్రిల్లర్స్‌లో స్టోరీ ఎలా ఉన్న వాటిని ఎంగేజింగ్‌గా, థ్రిల్లింగ్‌గా తెరకెక్కిస్తే మంచి హిట్ అందుకుంటాయి. చూసే సీన్స్, వచ్చే హారిఫిక్ ఎలిమెంట్స్ ఆడియెన్స్‌కు మంచి థ్రిల్‌ను పంచుతాయి. వాటిలో సక్సెస్ సాధిస్తే ఆ సినిమాకు ఆడియెన్స్ రద్దీ పెరిగినట్లే. అయితే, అందులో జటాధర మోస్తరు విజయం సాధించిందనే చెప్పుకోవాలి.

లంకె బిందెలు, దెయ్యాలు, పిశాచాలు, నిధులు వంటి కాన్సెప్ట్‌తో జటాధరను రూపొందించారు. ధన పిశాచి కథతోనే సినిమాను ప్రారంభించగా హీరో మేనత్త శోభ లంకె బిందెలపై ఆశ పడిన సీన్లతో నేరుగా కథలోకి వెళ్లారు. తర్వాత ఘోస్ట్ హంటర్‌గా శివ ప్రయాణం, దెయ్యాలు లేవని నిరూపించే సీన్లతో పర్వాలేదనిపిస్తుంది.

అప్పటి నుంచి ఇంట్రెస్ట్

ఈ క్రమంలోనే హీరోయిన్ దివ్య ఖోస్లాతో వచ్చే లవ్ సీన్స్ బాగానే ఉన్నా కథకు అడ్డుపడిన ఫీలింగ్ కలుగుతుంది. ఇక, రుద్రారంకు హీరో ఎలాగు వస్తాడని ముందే ఆడియెన్స్ గెస్ చేయడం కామన్. అతను వచ్చే పాయింట్ పెద్ద కొత్తగా ఉండదు. రుద్రారంకు వచ్చాక మాత్రం సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది.

ధన పిశాచితో శివకు ఉన్న విరోధం, మేనత్త శోభ చేసిన అన్యాయం వంటి ఎలిమెంట్స్ ఆకట్టుకుంటాయి. ధన పిశాచి నుంచి శివ ఎలా తప్పించుకున్నాడు, శివను పిశాచి ఎందుకు చంపాలనుకుంది వంటి అంశాలను బాగా చూపించారు. క్లైమాక్స్‌ బాగుంది. ముఖ్యంగా సుధీర్ బాబు శివ తాండవం ఎపిసోడ్ హైలెట్‌గా నిలుస్తుంది.

ఆకట్టుకున్న పాత్రలు

ఇక సుధీర్ బాబు యాక్టింగ్ బాగుంది. సిక్స్ ప్యాక్ బాడీతోపాటు నటనతో మెప్పించాడు. ధన పిశాచిలా సోనాక్షి సిన్హా ఆకట్టుకుంటుంది. శోభ పాత్రలో శిల్పా శిరోద్కర్ బాగా చేశారు. హీరోయిన్ దివ్య ఖోస్లా కుమార్ పాత్రకు పెద్ద ఇంపార్టెన్స్ లేదు. కానీ, అక్కడక్కడ క్యూట్‌గా కనిపించి ఆకట్టుకుంది.

మిగతా పాత్రలు పరిధి మేర మెప్పించాయి. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. శివుడు ఎపిసోడ్‌తో ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్ పర్లేదు. బీజీఎమ్ బాగుంది. సాంగ్స్ ఓకే. డైరెక్టర్స్ కథనంపై మరింత ఫోకస్ పెట్టాల్సింది. ఫైనల్‌గా చెప్పాలంటే కొన్ని చోట్ల మినహా బాగానే మెప్పించే హారర్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ ఉన్న జటాధర.

రేటింగ్: 2.75/5