ఆన్‌లైన్‌లో క‌త్రినా కైఫ్ ప‌ర్స‌న‌ల్ ఫొటోలు-మీరంతా క్రిమినల్స్‌-ప‌ర్మిష‌న్ లేకుండా పిక్స్ తీస్తారా: సోనాక్షి సిన్హా ఫైర్

గర్భవతిగా ఉన్న కత్రినా కైఫ్ తన ఇంటి బాల్కనీలో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవ్వడం కలకలం రేపుతోంది. ఆ ఫొటోలు పబ్లిష్ చేసిన వాళ్లపై మరో బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా ఫైర్ అయింది. సిగ్గుచేటు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. 

Published on: Oct 31, 2025 3:20 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన కత్రినా కైఫ్ పర్సనల్ ఫొటోలు ఆన్ లైన్ లో లీక్ కావడం కలకలం రేపుతోంది. ఇంటి బాల్కనీలో ఆమె నిలబడి ఉన్న పిక్స్ ఓ మీడియా పోర్టల్ పబ్లిష్ చేసింది. దీంతో వివాదం చెలరేగింది. పర్మిషన్ లేకుండా కత్రినా కైఫ్ పర్సనల్ ఫొటోలను ఎలా పబ్లిష్ చేస్తారంటూ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. మరో బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా ఈ ఘటనపై రియాక్టవుతూ ఘాటు కామెంట్లు చేసింది.

సోనాక్షి సిన్హా సంచలన కామెంట్లు
సోనాక్షి సిన్హా సంచలన కామెంట్లు

ఆన్‌లైన్‌లో కత్రినా ఫొటోలు

బాలీవుడ్ స్టార్ కపుల్ జోడీ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు సెప్టెంబర్‌లో ప్రకటించారు. తమ వ్యక్తిగత జీవితాన్ని గోప్యంగా ఈ జంట గోప్యంగానే ఉంచుతోంది. కానీ ఇటీవల కత్రినా తన బాల్కనీలో ఉన్న చిత్రాలు ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమవ్వడం వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. ఇది అభిమానులలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. నటి సోనాక్షి సిన్హా కూడా దీనికి కారణమైన మీడియా పోర్టల్‌ను తప్పుబడుతూ, వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడాన్ని ఖండించారు.

మీడియా పోర్టల్

కత్రినా కైఫ్ చిత్రాన్ని అనుమతి లేకుండా క్లిక్ చేసినందుకు మీడియా పోర్టల్‌పై సోనాక్షి సిన్హా ఆగ్రహం వ్యక్తం చేసింది. శుక్రవారం (అక్టోబర్ 31) ఉదయం ఒక మీడియా పోర్టల్ ముంబైలోని తన నివాసంలోని బాల్కనీలో కూర్చున్న కాబోయే తల్లి చిత్రాలను పంచుకుంది. ఆ చిత్రాలతో పాటు పోర్టల్ పోస్ట్‌కు “ఎక్స్‌క్లూజివ్: డెలివరీ తేదీ దగ్గర పడుతుండగా తన బాల్కనీలోకి వచ్చిన కత్రినా కైఫ్” అని క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫోటోలు సోషల్ మీడియా యూజర్లకు ఆగ్రహం తెప్పించాయి. చాలా మంది నైతిక హద్దులు దాటినందుకు ఆ ప్రచురణ సంస్థను విమర్శించారు.

క్రిమినల్స్

బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా కామెంట్స్ సెక్షన్‌లో తన అసమ్మతిని బలంగా వ్యక్తం చేసింది. “మీకేమైనా పిచ్చా? ఒక మహిళ తన సొంత ఇంట్లో ఉన్నప్పుడు అనుమతి లేకుండా ఫోటో తీసి, దానిని పబ్లిక్ ప్లాట్‌ఫామ్‌లో ప్రచురిస్తారా? మీరంతా నేరస్థుల కన్నా తక్కువేమీ కాదు. సిగ్గుచేటు.” అని రాశారు. అన్ని వైపుల నుంచి వ్యతిరేకత రావడంతో ఆ మీడియా పోర్టల్ కత్రినా కైఫ్ పోస్టును తొలగించింది.

ఫ్యాన్స్ రియాక్షన్

సోనాక్షి మాట్లాడినందుకు అభిమానులు ఆమెను ప్రశంసించారు. ఒక అభిమాని, “ఎవరో ఒకరు చెప్పినందుకు సంతోషం” అని కామెంట్ చేశారు. మరొకరు, “వారిని ఇంత ధైర్యంగా, బలంగా నిలదీయడం గొప్ప విషయం. ఆమె చెప్పింది పూర్తిగా నిజం” అని రాశారు. “వారిని నిలదీయడం ఆమె చేసిన మంచి పని. ఇది చాలా అవసరం” అని ఒకరు, “నిజమే సోనా, ఇది చాలా దారుణం” అని మరొకరు కామెంట్ఛేశారు.

కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ గురించి..

సెప్టెంబర్‌లో కత్రినా, విక్కీ ఇన్‌స్టాగ్రామ్‌లో తమ హృద్యమైన చిత్రాన్ని పంచుకున్నారు. అందులో కత్రినా తన బేబీ బంప్‌ను పట్టుకుని ఉన్నారు. ఆ పోస్ట్‌తో పాటు ఆ జంట.. “సంతోషం, కృతజ్ఞతతో నిండిన హృదయాలతో మా జీవితంలోని ఉత్తమ అధ్యాయాన్ని ప్రారంభించే మార్గంలో ఉన్నాము” అని రాశారు. 2021లో రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్‌లోని సిక్స్ సెన్సెస్ రిసార్ట్, ఫోర్ట్ బర్వారాలో జరిగిన రాజరిక వివాహంలో ఒక్కటైన కత్రినా, విక్కీ పెళ్లికి ముందు కొంతకాలం డేటింగ్ చేశారు. ఈ జంట ఇప్పటివరకు ఏ సినిమాలోనూ కలిసి నటించలేదు.