ఇవాళ ఓటీటీలో ధనుష్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ స్ట్రీమింగ్.. డైరెక్టర్ కూడా అతనే.. సోషల్ మీడియా ట్రెండింగ్.. తెలుగులోనూ
ఇవాళ ఓటీటీలోకి తమిళ స్టార్ హీరో ధనుష్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ దూసుకొచ్చింది. చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఓటీటీ ఫ్యాన్స్ కు ట్రీట్ ఇచ్చేలా ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రం ఏ ఓటీటీలో ఉందో చూసేయండి.
డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఎంచుకుంటూ, వైవిధ్యమైన యాక్టింగ్ తో అదరగొడుతున్నాడు హీరో ధనుష్. వరుసగా సక్సెస్ లు అందుకుంటున్నాడు. ఇప్పుడు తన సొంత డైరెక్షన్ లో హీరోగా చేసి మరో హిట్ సొంతం చేసుకున్నాడు. ఆ సినిమానే ‘ఇడ్లీ కడై’. తెలుగులో ఇడ్లీ కొట్టు పేరుతో రిలీజైంది. థియేటర్లలో సత్తాచాటిన ఈ హార్ట్ టచింగ్ మూవీ ఇవాళ (అక్టోబర్ 29) ఓటీటీలో రిలీజైంది.

ఇడ్లీ కడై ఓటీటీ
ధనుష్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ ఇడ్లీ కడై ఓటీటీలోకి వచ్చేసింది. ఈ మూవీ తెలుగులో ఇడ్లీ కొట్టు పేరుతో రిలీజైంది. ఈ సినిమా బుధవారం నుంచే డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లోకి ఇడ్లీ కొట్టు రిలీజైంది. ఈ సినిమాకు ధనుష్ స్వీయ దర్శకత్వం వహించాడు. ప్రొడ్యూసర్ గానూ వ్యవహరించాడు.
థియేటర్ రిలీజ్
ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఇడ్లీ కడై మూవీ అక్టోబర్ 1, 2025లో థియేటర్లలో రిలీజైంది. మంచి ఫీల్ గుడ్ మూవీ ఆడియన్స్ మనసులను తాకింది. ఈ సినిమాలో ధనుష్ తో పాటు అరుణ్ విజయ్, సత్యరాజ్, సముద్ర ఖని, నిత్యా మీనన్, శాలిని పాండే, రాజ్ కిరణ్ తదితరులు నటించారు. ఈ మూవీకి జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ డైరెక్టర్.
నెల రోజుల్లోపే ఓటీటీలో
ధనుష్ హీరోగా చేయడంతో పాటు దర్శకత్వం వహించిన మూవీ ఇడ్లీ కొట్టు. ఈ సినిమాకు ఆకాష్ భాస్కరన్ తో కలిసి నిర్మాతగానూ వ్యవహరించాడు. ఈ సినిమా ఇప్పుడు నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేసింది. తమిళం, తెలుగుతో పాటు కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది ఇడ్లీ కడై.
ఇడ్లీ కొట్టు కథ
గ్రామంలోని ఇడ్లీ కొట్టు, దాని చుట్టూ అల్లుకున్న మానవ సంబంధాల నేపథ్యంలో సాగే మనసుకు హత్తుకునే సినిమా ఇడ్లీ కొట్టు. శివ కేశవులు (రాజ్ కిరణ్) ఊర్లో ఇడ్లీ కొట్టు నడుపుతుంటాడు. ఆ హోటల్ ఎంతో ఫేమస్. రుచి సూపర్ గా ఉంటాయి. దీంతో తండ్రి నడుపుతున్న ఇడ్లీ కొట్టును ఫ్రాంఛైజీలా మార్చాలని మురళి (ధనుష్) అనుకుంటాడు.
కానీ అందుకు శివకేశవులు ఒప్పుకోడు. దీంతో తన జీవితం కోసం బ్యాంకాక్ వెళ్తాడు. అక్కడ బిజినెస్ పార్ట్ నర్ విష్ణు వర్ధన్ (సత్యరాజ్) కూతురు మీరా (షాలిని పాండే)తో పెళ్లికి సిద్ధమవుతాడు. కానీ మురళి తండ్రి చనిపోవడంతో తిరిగి గ్రామానికి వస్తాడు. మళ్లీ మురళీ విదేశాలకు వెళ్లాడా? తండ్రి ఇడ్లీ కొట్టును ఏం చేశాడన్నది మిగతా కథ.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


