అఫీషియల్.. ఓటీటీలోకి ధనుష్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్.. హార్ట్ టచింగ్ ఇడ్లీ కొట్టు.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

తమిళ స్టార్ హీరో ధనుష్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ఇడ్లీ కొట్టు మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ పై క్లారిటీ వచ్చింది. తెలుగులో ఈ మూవీ ఇడ్లీ కొట్టు పేరుతో రిలీజైన సంగతి తెలిసిందే. 

Published on: Oct 24, 2025, 11:40:07 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీలోకి మరో తమిళ హార్ట్ టచింగ్ మూవీ రాబోతోంది. స్టార్ హీరో ధనుష్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘ఇడ్లీ కడై’ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ పై క్లారిటీ వచ్చింది. తెలుగులో ఈ మూవీ ఇడ్లీ కొట్టు పేరుతో థియేటర్లలో రిలీజైన సంగతి తెలిసిందే. ఇప్పుడీ సినిమా తెలుగులోనూ ఓటీటీలోకి రానుంది.

ఇడ్లీ కొట్టు పోస్టర్ (x/dhanushkraja)
ఇడ్లీ కొట్టు పోస్టర్ (x/dhanushkraja)

ఇడ్లీ కొట్టు ఓటీటీ

ధనుష్ కొత్త సినిమా ఇడ్లీ కొట్టు ఓటీటీ రిలీజ్ కు రెడీ అయింది. ఈ సినిమా పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో అడుగుపెట్టనుంది. అక్టోబర్ 29 నుంచి ఈ ఓటీటీలో తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. అయిదు భాషల్లో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేయనుంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ సోషల్ మీడియాలో పోస్టు చేసింది.

నెల రోజుల్లోపే ఓటీటీలో

ధనుష్ హీరోగా చేయడంతో పాటు దర్శకత్వం వహించిన మూవీ ఇడ్లీ కొట్టు. ఈ సినిమాకు ఆకాష్ భాస్కరన్ తో కలిసి నిర్మాతగానూ వ్యవహరించాడు. ఈ సినిమా ఇప్పుడు నెల రోజుల్లోపే ఓటీటీలోకి రాబోతుంది. అక్టోబర్ 1న ఈ మూవీ థియేటర్లలో రిలీజైంది. పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కాంతార చాప్టర్ 1తో పోటీ కారణంగా ఇడ్లీ కొట్టు మూవీ కాస్త వెనుకబడింది.

ఇడ్లీ కొట్టు కథ

గ్రామంలోని ఇడ్లీ కొట్టు, దాని చుట్టూ అల్లుకున్న మానవ సంబంధాల నేపథ్యంలో సాగే మనసుకు హత్తుకునే సినిమా ఇడ్లీ కొట్టు. శివ కేశవులు (రాజ్ కిరణ్) ఊర్లో ఇడ్లీ కొట్టు నడుపుతుంటాడు. ఆ హోటల్ ఎంతో ఫేమస్. రుచి సూపర్ గా ఉంటాయి. దీంతో తండ్రి నడుపుతున్న ఇడ్లీ కొట్టును ఫ్రాంఛైజీలా మార్చాలని మురళి (ధనుష్) అనుకుంటాడు.

కానీ అందుకు శివకేశవులు ఒప్పుకోడు. దీంతో తన జీవితం కోసం బ్యాంకాక్ వెళ్తాడు. అక్కడ బిజినెస్ పార్ట్ నర్ విష్ణు వర్ధన్ (సత్యరాజ్) కూతురు మీరా (షాలిని పాండే)తో పెళ్లికి సిద్ధమవుతాడు. కానీ మురళి తండ్రి చనిపోవడంతో తిరిగి గ్రామానికి వస్తాడు. మళ్లీ మురళీ విదేశాలకు వెళ్లాడా? తండ్రి ఇడ్లీ కొట్టును ఏం చేశాడన్నది మిగతా కథ.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More