ఇవాళ ఓటీటీలోకి విజయ్ ఆంటోనీ తమిళ పొలిటికల్ థ్రిల్లర్.. ఎమ్మెల్యే హత్య.. హీరో మైండ్ గేమ్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఇవాళ ఓటీటీలోకి విజయ్ ఆంటోనీ లేటెస్ట్ పొలిటికల్ థ్రిల్లర్ వచ్చేసింది. సెక్రెటేరియట్ ముందు టీ అమ్ముకొనే వ్యక్తి వ్యవస్థలను శాసించే పవర్ బ్రోకర్ గా ఎలా ఎదిగాడు? ఎమ్మెల్యే హత్య తదితర అంశాలతో ఈ మూవీ ఇంట్రెస్టింగ్ గా ఉంది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది.
బిచ్చగాడు సినిమాతో తెలుగు ఆడియన్స్ కు చేరువైన విజయ్ ఆంటోనీ లేటెస్ట్ మూవీ ‘శక్తి తిరుమాగన్’ ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగులో ఇది భద్రకాళి పేరుతో థియేటర్లలో రిలీజైంది. ఇప్పుడు తెలుగులోనూ డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఇవాళ (అక్టోబర్ 24) నుంచి ఈ పొలిటికల్ థ్రిల్లర్ ఓటీటీలో అందుబాటులోకి వచ్చేసింది.

భద్రకాళి ఓటీటీ
డిఫరెంట్ స్టోరీ లైన్ తో కూడిన సినిమాలు చేస్తూ తనకంటూ స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు విజయ్ ఆంటోనీ. రీసెంట్ గా శక్తి తిరుమాగన్ (భద్రకాళి) అంటూ థియేటర్లలో సందడి చేశాడు. ఈ భద్రకాళి మూవీ శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసింది. జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ తమిళ బ్లాక్ బస్టర్ మూవీ తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తోంది.
నెల తర్వాత
థియేటర్లలో రిలీజైన నెల రోజుల తర్వాత భద్రకాళి ఓటీటీలోకి వచ్చింది. ఈ సినిమా సెప్టెంబర్ 19న థియేటర్లలో విడుదలైంది. విజయ్ ఆంటోనీ, వాగై చంద్రశేఖర్, సునీల్ తదతరులు నటించారు. ఈ పొలిటికల్ థ్రిల్లర్ కు అరుణ్ ప్రభు డైరెక్టర్. హీరో విజయ్ ఆంటోనీ ఈ సినిమాను నిర్మించడమే కాకుండా మ్యూజిక్ కూడా అందించాడు. సెకండాఫ్ స్లోగా ఉండటం ఈ మూవీకి మైనస్ గా మారిందనే టాక్ వినిపించింది.
భద్రకాళి కథ
సెక్రటేరియట్ ముందు కాఫీలు అమ్ముకొనే ఓ వ్యక్తి ప్రభుత్వంలో ఏదైనా పని చేసే పెట్టే పవర్ ఫుల్ బ్రోకర్ గా మారిన తీరు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. వ్యవస్థలను అడ్డుపెట్టుకుని వేల కోట్ల రూపాయాలు కొట్టేస్తాడు. భద్రకాళి సినిమాలో హీరో మైండ్ గేమ్ ఆడియన్స్ కు థ్రిల్ అందిస్తుంది.
సెక్రటేరియట్ లోని ఓ పవర్ బ్రోకర్ కిట్టు (విజయ్ ఆంటోనీ). ఎంతటి కష్టమైనా పని అయినా క్షణాల్లో కంప్లీట్ చేసేస్తాడు. డబ్బులు వెనకేసుకుంటాడు. ఈ క్రమంలో కేంద్రమంత్రి లతకు చెందిన రూ.800 కోట్ల భూముల వ్యవహారంలో వేలు పెడతాడు. ఆ పని కంప్లీట్ అవుతుందనేలోపు ఓ ఎమ్మెల్యే మర్డర్ జరుగుతుంది.
వేల కోట్లు
ఎమ్మెల్యే మర్డర్ తో భద్రకాళి సినిమా కథ మలుపు తీసుకుంటుంది. ఆ తర్వాత కిట్టు గురించి ఎంక్వైరీ చేస్తే సంచలన విషయాలు బయటకు వస్తాయి. అతను ఏకంగా రూ.6200 కోట్లు వెనకేసినట్లు తెలుస్తోంది. మరోవైపు రాష్ట్రపతి కాకుండా అభయంకర్ ను కిట్టు అడ్డుకునే ప్రయత్నం చేస్తాడు. అసలు ఈ కిట్టు ఎవరు? వేల కోట్ల రూపాయలు ఎలా సంపాదించాడు? అనేది మూవీలో చూసి తెలుసుకోవాల్సిందే.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


