రవితేజకు వరుస ఫ్లాప్ లు.. బిజీగా ఉన్నానని సార్ మూవీ గోల్డెన్ ఛాన్స్ మిస్.. బ్లాక్ బస్టర్ కొట్టేసిన ధనుష్.. ఏమైందంటే?

మాస్ జాతర సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా రవితేజ.. ధనుష్ నటించిన వాతి/సార్ సినిమా గురించి వెంకీ అట్లూరితో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. 

Published on: Oct 23, 2025, 08:01:29 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓ వైపు వరుస ఫ్లాప్ లతో సాగుతున్న రవి తేజ ఓ బ్లాక్ బస్టర్ కొట్టే గోల్డన్ ఛాన్స్ ను మిస్ చేసుకున్నాడు. ధనుష్ హీరోగా తమిళంలో వచ్చిన వాతి (తెలుగులో సార్) ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. అయితే నిజానికి ఈ సినిమాలో హీరోగా రవితేజ చేయాల్సిందటా. ఈ విషయాన్ని డైరెక్టర వెంకీ అట్లూరి వెల్లడించాడు.

రవితేజ, ధనుష్
రవితేజ, ధనుష్

రవి తేజకే ముందు

దర్శకులు వెంకీ అట్లూరి, భాను బోగవరపుతో కలిసి తన సినిమా ‘మాస్ జాతర’ ప్రమోషన్ కోసం ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు రవితేజ. ఈ ఇంటర్వ్యూలోనే సార్ కథను ముందుగా రవితేజకే చెప్పానని వెంకీ వెల్లడించాడు. 2023లో వచ్చిన తెలుగు-తమిళ ద్విభాషా హిట్ చిత్రం 'సార్/వాతి' కథను మొదట రవితేజకే చెప్పానని, ఆ తర్వాతే ధనుష్‌తో ముందుకు వెళ్లానని వెంకీ తెలిపాడు. ఆయన ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో, ఆ తర్వాత ధనుష్‌తో పనిచేసే అవకాశం వచ్చిందన్నాడు.

వెంకీ కామెంట్స్

“నిజానికి నేను మొదట 'సార్' కథను రవి తేజకే చెప్పా. అప్పుడు ఆయన 'వెంకీ, నేను కొంచెం బిజీగా ఉన్నాను. నువ్వు ఆగగలవా? లేదంటే నేను నిన్ను బలవంతం చేయను' అని అన్నారు. ఆ తర్వాత 2-3 నెలల్లోనే నేను ధనుష్‌ను ప్రాజెక్ట్‌లోకి తీసుకురాగలిగాను. ఈ విషయం రవి అన్నకు చెప్పినప్పుడు ఆయన అద్భుతమైన నటుడు కాబట్టి రెండోసారి ఆలోచించవద్దని చెప్పారు” అని వెంకీ పేర్కొన్నాడు.

అస్సలు బాగోనని

సినిమా చూసిన తర్వాత తను ఏం చెప్పానో కూడా చెప్పమని రవితేజ నవ్వుతూ అడగ్గా, వెంకీ ఇలా చెప్పాడు. “సినిమా చూశాక, అన్న నాకు ఫోన్ చేసి సినిమా బాగుందని చెప్పారు. కానీ 'నేను ఆ పాత్రను ఇలాగే చేసేవాడిని కాదు' అని అన్నారు” అని వెంకీ చెప్పాడు. రవితేజ మధ్యలో కలుగజేసుకుని “లేదు, ఆ సినిమాకు నేను అస్సలు బాగోను అని నా ఫీలింగ్. కానీ నేను వేరే విధంగా చేసేవాడినని ఇతను పట్టుబడుతున్నాడు” అని స్పష్టం చేశాడు.

వెంకీ అట్లూరి ఫిల్మోగ్రఫీ

'సార్/వాతి' వెంకీకి నాల్గవ చిత్రం. దీనికి ముందు ఆయన 'తొలి ప్రేమ' (2018), 'మిస్టర్ మజ్ను' (2019), 'రంగ్ దే' (2021) వంటి రొమాంటిక్ డ్రామాలకు దర్శకత్వం వహించాడు. భారతదేశంలో విద్యను వ్యాపారంగా ఎలా నడుపుతున్నారనే దానిపై సామాజిక వ్యాఖ్యానంగా నిలిచిన సార్ చిత్రంతో ఆయన జానర్ మార్చి చాలా మందిని ఆశ్చర్యపరిచారు. ఇందులో ధనుష్, సంయుక్త ప్రధాన పాత్రలు పోషించారు.

ఆర్థిక మోసాల నేపథ్యంలో దుల్కర్ సల్మాన్‌తో వెంకీ తీసిన 'లక్కీ భాస్కర్' (2024) కూడా విజయం సాధించింది. ప్రస్తుతం ఆయన సూర్యతో ఇంకా పేరు పెట్టని ఒక చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఏడాది 'కుబేర', 'ఇడ్లీ కడై' చిత్రాలలో చివరిసారిగా కనిపించిన ధనుష్ ప్రస్తుతం ఆనంద్ ఎల్ రాయ్ ‘తేరే ఇష్క్ మే’, విఘ్నేష్ రాజా దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు. రవితేజ చివరిగా 2024లో 'ఈగిల్', 'మిస్టర్ బచ్చన్' చిత్రాలలో కనిపించారు. శ్రీలీల కూడా నటిస్తున్న 'మాస్ జాతర' అక్టోబర్ 31న థియేటర్లలో విడుదల కానుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More