కుబేర ఫస్ట్ రివ్యూ: అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్- ధనుష్‌ను మించిన నటుడు ఇండియాలోనే లేడు- సూపర్ స్టార్ కూడా నేర్చుకోవాలంటూ!

నాగార్జున, ధనుష్, రష్మిక మందన్నా ముఖ్య పాత్రలు పోషించిన లేటెస్ట్ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ కుబేర. డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన కుబేర జూన్ 20న థియేటర్లలో విడుదల కానుంది. అయితే, ఒకరోజు ముందుగానే కుబేర మూవీ రివ్యూ ఇచ్చారు బాలీవుడ్ క్రిటిక్ ఉమైర్ సంధు. మరి కుబేర ఫస్ట్ రివ్యూలోకి వెళితే..!

Jun 19, 2025, 13:10:44 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ముఖ్యంగా బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్‌ను సైతం ధనుష్ దగ్గర యాక్టింగ్ నేర్చుకోమన్నట్లుగా బాలీవుడ్ క్రిటిక్ ఉమైర్ సంధు ట్వీట్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఇక కుబేర మూవీ ఫస్ట్ రివ్యూ ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కుబేర ఫస్ట్ రివ్యూ: అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్- ధనుష్‌ను మించిన నటుడు ఇండియాలోనే లేడు- సూపర్ స్టార్ కూడా నేర్చుకోవాలంటూ!
కుబేర ఫస్ట్ రివ్యూ: అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్- ధనుష్‌ను మించిన నటుడు ఇండియాలోనే లేడు- సూపర్ స్టార్ కూడా నేర్చుకోవాలంటూ!

మరొక ట్వీట్‌లో "నటనలో విలక్షణత చూపించే విధానంలో ఇండియాలో ఇప్పటికీ నెంబర్ వన్ నటుడు అంటే ధనుష్ మాత్రమే. ఏమైనా డౌట్స్ ఉన్నాయా హేటర్స్" అని ఉమైర్ సంధు షాకింగ్‌గా రాసుకొచ్చారు. మొత్తానికి కుబేర సినిమాలో ధనుష్ యాక్టింగ్ అదిరిపోయిందని, అతనికి మించిన నటుడు ఇండియాలో ఎవరు లేరన్నట్లుగా ఉమైర్ సంధు ట్వీట్స్ ఉన్నాయి.

ప్రస్తుతం టాలీవుడ్‌లో క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్న సినిమాల్లో కుబేర ఒకటి. టాలీవుడ్ కింగ్ నాగార్జున, తమిళ స్టార్ హీరో ధనుష్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తొలిసారి కలిసి నటించిన సినిమానే కుబేర. ఈ సినిమాకు డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు.

జూన్ 20న థియేట్రికల్ రిలీజ్

తెలుగు, తమిళ భాషల్లో బైలింగువల్‌గా తెరకెక్కించిన కుబేర సినిమాను అమిగోస్ క్రియేషన్స్, ఎస్‌వీసిఎల్ఎల్‌పీ బ్యానర్స్‌పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్మోహన్ రావు నిర్మాతలుగా వ్యవహరించిన నిర్మించారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన కుబేర జూన్ 20న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియాగా థియేటర్లలో విడుదల కానుంది.

కుబేర ఫస్ట్ రివ్యూ

థియేట్రికల్ రిలీజ్‌కు ఒకటిరెండు రోజుల ముందుగానే కుబేర మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. బాలీవుడ్‌లో కాంట్రవర్సీ క్రిటిక్‌గా పేరు తెచ్చుకున్న ఉమైర్ సంధు కుబేరా మూవీ రివ్యూ ఇచ్చారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో కుబేర ఫస్ట్ రివ్యూ అంటూ పోస్టులు షేర్ చేశారు ఉమైర్ సంధు. మరి ఉమైర్ సంధు ఇచ్చిన కుబేర ఫస్ట్ రివ్యూ ఎలా ఉందో చూద్దాం.

పవర్‌ఫుల్ క్రైమ్ థ్రిల్లర్

"ఫస్ట్ రివ్యూ ఆఫ్ కుబేరా: నాగార్జున, ధనుష్, రష్మిక మందన్నా అద్భుతంగా నటించిన పవర్‌ఫుల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ కుబేర. కుబేర స్టోరీ ఎంగేజింగ్‌గా ఉంది. క్లైమాక్స్ అయితే అదిరిపోయింది. ధనుష్ నుంచి విలక్షణమైన నటనను ఆమీర్ ఖాన్ నేర్చుకోవాలి. కచ్చితంగా చూడండి" అని రాసుకొచ్చిన ఉమైర్ సంధు కుబేర మూవీకి ఐదుకు 3.5 స్టార్ రేటింగ్ ఇచ్చారు.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More