పెళ్లి చేసుకున్న తమిళ బ్లాక్‌బస్టర్ మూవీ డైరెక్టర్.. ప్రేమించిన అమ్మాయి మెడలోనే మూడు ముళ్లు.. ఫొటోలు వైరల్
తమిళ బ్లాక్‌బస్టర్ మూవీ టూరిస్ట్ ఫ్యామిలీకి డైరెక్టర్ అయిన అభిషన్ జీవింత్ పెళ్లి చేసుకున్నాడు. చాలాకాలంగా తాను ప్రేమలో ఉన్న అమ్మాయి మెడలోనే అతడు మూడు ముళ్లు వేశాడు. ఇప్పుడీ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తమిళ బ్లాక్‌బస్టర్ మూవీ టూరిస్ట్ ఫ్యామిలీ గుర్తుందా? ఈ ఏడాది అసలు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసిన మూవీ ఇది. సిమ్రన్ నటించిన ఈ సినిమాను డైరెక్ట్ చేసిన అభిషన్ జీవింత్ ఇప్పుడు ఓ ఇంటివాడయ్యాడు. శుక్రవారం (అక్టోబర్ 31) అతని పెళ్లి జరిగింది.

అభిషన్ జీవింత్ పెళ్లి
టూరిస్ట్ ఫ్యామిలీతో సంచలనం సృష్టించిన డైరెక్టర్ అభిషన్ జీవింత్ తన గర్ల్‌ఫ్రెండ్ అఖిలను పెళ్లి చేసుకున్నాడు. చెన్నైలోని పోయెస్ గార్డెన్ లో వీళ్ల పెళ్లి ఘనంగా జరిగింది. 25 ఏళ్ల వయసులోనే అతడు ఓ ఇంటివాడు కావడం విశేషం. చాలా రోజులుగా వీళ్లిద్దరూ ప్రేమించుకుంటున్నారు.
అంతేకాదు ఈ మధ్యే అతనికి ఓ ఖరీదైన పెళ్లి గిఫ్ట్ కూడా వచ్చిన విషయం తెలిసిందే. టూరిస్ట్ ఫ్యామిలీ మూవీ నిర్మాతే ఈ గిఫ్ట్ ఇచ్చాడు. పెళ్లికి మూడు రోజుల ముందు ఓ ఖరీదైన బీఎండబ్ల్యూ కారును అభిషన్ కు పెళ్లి గిఫ్ట్ గా ఇచ్చిన వార్త తెగ వైరల్ అయింది.
టూరిస్ట్ ఫ్యామిలీ గురించి..
ఈ ఏడాది తమిళంతోపాటు తెలుగులోనూ రిలీజైన మూవీ టూరిస్ట్ ఫ్యామిలీ. కేవలం రూ.7 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి.. బాక్సాఫీస్ దగ్గర సుమారు రూ.90 కోట్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది. తర్వాత ఓటీటీలోనూ రికార్డులు తిరగరాసింది. సిమ్రన్, శశికుమార్ లీడ్ రోల్స్ లో నటించిన సినిమా ఇది. శ్రీలంక నుంచి అక్రమంగా ఇండియాలోకి అడుగుపెట్టి తమిళనాడులోని రామేశ్వరంలో సెటిలవ్వాలని చూసే ఓ కుటుంబం చుట్టూ తిరిగే కథ ఇది.
కామెడీతోపాటు మంచి ఎమోషనల్ టచ్ ఉన్న ఈ సినిమా తమిళ, తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. రాజమౌళి, రజనీకాంత్ లాంటి వాళ్లు కూడా ఈ సినిమాను తెగ మెచ్చుకున్నారు. ఓ యూట్యూబర్ గా కెరీర్ మొదలుపెట్టి టూరిస్టు ఫ్యామిలీతో స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు అభిషన్ జీవింత్. ఈ మూవీ నిర్మాత మగేష్ రాజ్ ఈ మధ్యే అభిషన్ కు పెళ్లి గిఫ్ట్ గా ఖరీదైన బీఎండబ్ల్యూ కారు ఇచ్చాడు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


