మహేశ్ బాబు SSMB29 నుంచి విలన్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన రాజమౌళి- అత్యంత క్రూరమైన విరోధి 'కుంభ'గా పృథ్వీరాజ్ సుకుమారన్

మహేశ్ బాబు-రాజమౌళి SSMB29 మూవీ నుంచి అదిరిపోయే సర్‌ప్రైజ్ వచ్చింది. ముందుగా సినిమాలోని విలన్‌ను పరిచయం చేశారు రాజమౌళి. మహేశ్ బాబు సినిమాలో అత్యంత క్రూరమైన కుంభ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపించనున్నట్లు జక్కన్న సోషల్ మీడియా వేదికగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.

Published on: Nov 7, 2025, 13:01:59 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సూపర్ స్టార్ మహేశ్ బాబు-దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా SSMB29. ఈ సినిమా అప్డేట్ కోసం యావత్ సినీ లోకం ఎంతగానో ఎదురుచూస్తోంది. అంతా మహేశ్ బాబు లుక్ కోసం అభిమానులు, ప్రేక్షకులు ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు.

మహేశ్ బాబు SSMB29 నుంచి విలన్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన రాజమౌళి- అత్యంత క్రూరమైన విరోధి 'కుంభ'గా పృథ్వీరాజ్ సుకుమారన్
మహేశ్ బాబు SSMB29 నుంచి విలన్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన రాజమౌళి- అత్యంత క్రూరమైన విరోధి 'కుంభ'గా పృథ్వీరాజ్ సుకుమారన్

మహేశ్ బాబు లుక్ కాకుండా

ఈ క్రమంలో ఎస్ఎస్ఎంబీ29 నుంచి సడెన్ సర్‌ప్రైజ్ వచ్చింది. అయితే, అది మహేశ్ బాబు లుక్ కాదు. SSMB29 సినిమాలోని విలన్‌‌ను మొదటగా పరిచయం చేశారు డైరెక్టర్ రాజమౌళి. ఎవరు ఊహించని విధంగా ఎస్ఎస్ఎంబీ29 నుంచి మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు.

విలన్ రోల్ పరిచయం చేస్తూ

ఎస్ఎస్ఎంబీ29 సినిమాలో హీరోగా మహేశ్ బాబు, హీరోయిన్‌గా గ్లోబల్ బ్యూటి ప్రియాంక చోప్రాతోపాటు హీరో, దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా నుంచి హీరో, హీరోయిన్లవి కాకుండా ముందుగా విలన్ రోల్‌ను పరిచయం చేశారు జక్కన్న.

కుంభ పాత్రలో పృథ్వీరాజ్

ఇదివరకు ఎప్పుడు చూడని విధంగా పృథ్వీరాజ్ సుకుమారన్ లుక్ ఉంది. ఎస్ఎస్ఎంబీ29లో పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ పాత్రలో నటిస్తున్నారు. ఈ విషయం చెబుతూ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు రాజమౌళి. అలాగే, పృథ్వీరాజ్ ఫస్ట్ లుక్‌ ఫొటోను పంచుకున్నారు.

క్రూరమైన విరోధి

"ఈ పోస్ట్‌లో ఈ దుష్ట, క్రూరమైన శక్తిమంతమైన విరోధి కుంభకు ప్రాణం పోయం సృజనాత్మకంగా చాలా సంతృప్తికరంగా ఉంది. తన కుర్చీలో (పాత్రలో) పూర్తిగా ఒదిగిపోయినందుకు పృథ్వీకి కృతజ్ఞతలు" అని రాజమౌళి రాసుకొచ్చారు.

అత్యుత్తమ నటుల్లో ఒకరు

అలాగే, పృథ్వీరాజ్ సుకుమారన్ నటనపై రాజమౌళి ప్రశంసలు కురిపించారు. ఇదే పోస్ట్‌లో "పృథ్వీతో మొదటి షాట్ చేసిన తర్వాత నేను అతని దగ్గరికి వెళ్లి మీరు నాకు తెలిసిన అత్యుత్తమ నటుల్లో ఒకరు అని చెప్పాను" అని రాజమౌళి తెలిపారు.

రొబోటిక్ చైర్‌లో పృథ్వీరాజ్

ఇదిలా ఉంటే, ఎస్ఎస్ఎంబీ29లో కంభ పాత్రలో కనిపించనున్న పృథ్వీరాజ్ సుకుమారన్ రొబోటిక్ చైర్‌లో కూర్చుని ఇంటెన్సివ్‌గా కనిపించాడు. అతని వెనుక చైర్‌కు రొబోటిక్ హ్యాండ్స్ ఉన్నాయి. పృథ్వీరాజ్ సుకుమారన్ కోపంగా చూస్తు ముందుకు కదులుతున్నట్లుగా ఆ పోస్టర్ ఉంది.

డాక్టర్ ఆక్టోపస్ తరహాలో

ఇక పృథ్వీరాజ్ సుకుమారన్ వెనుక ఓ ఆర్మీ, ఆఫ్రికన్ అడవుల్లో ఉండే వాటర్ ప్లాంట్స్ మరింత ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాయి. అయితే, వీల్ చైర్‌కు రొబోటిక్ హ్యాండ్స్‌తో పృథ్వీరాజ్ సుకుమారన్ ఉన్న లుక్ కాస్తా స్పైడర్ మ్యాన్ 2 సినిమాలో డాక్టర్ ఆక్టోపస్ లుక్ తరహాలో ఉందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

వారణాసిగా టైటిల్

స్పైడర్ మ్యాన్ 2లో విలన్ డాక్టర్ ఆక్టోపస్ లుక్ నుంచే రాజమౌళి స్ఫూర్తి పొంది పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ లుక్‌ను క్రియేట్ చేసి ఉంటారని అంటున్నారు. ఇదిలా ఉంటే, ఎస్ఎస్ఎంబీ29 సినిమాకు వారణాసి అనే టైటిల్‌ను మేకర్స్ అనుకుంటున్నట్లు పుకార్లు వినిపిస్తున్న విషయం తెలిసిందే.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More