రాజమౌళి మహేశ్ బాబు ట్వీట్ వార్- ఒకరికొకరి పంచ్‌లు, సెటైర్లు- ప్రియాంక చోప్రాను లాగుతూ-SSMB29పై చివరిలో దెబ్బేసిన జక్కన్న
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు మధ్య ట్విటర్ వార్ జరిగింది. ఎక్స్‌లో ఒకరిపై మరొకరు సెటైర్లు, పంచ్‌లు వేసుకుంటూ యుద్ధం చేశారు. మధ్యలో ప్రియాంక చోప్రాను కూడా లాగారు. ఇదంతా వీరి ముగ్గురి కాంబినేషన్‌లో వస్తున్న ఎస్ఎస్ఎంబీ 29 మూవీ గురించే. కానీ, చివరిలో జక్కన్న పెద్ద దెబ్బేశారు.
ప్రస్తుతం టాలీవుడ్‌లో తెగ హాట్ టాపిక్‌గా మారిన సినిమా ఎస్ఎస్ఎంబీ 29. ఈ సినిమాకు తెలుగు ఇండస్ట్రీలోనే కాదు యావత్ వరల్డ్ వైడ్‌గా హైప్ క్రియేట్ అవుతోంది. అందుకు కారణం ముగ్గురు స్టార్స్ ఈ సినిమాతో కొలబారేట్ అవడం. వారే దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా.

ఎస్ఎస్ఎంబీ 29 కోసం
రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా తెరకెక్కుతున్న సినిమా ఎస్ఎస్ఎంబీ 29. ఈ సినిమా కోసం యావత్ సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు. గ్లోబ్ ట్రాటర్ అంటూ మొదలైన ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్నారు.
ఇటీవల మహేశ్ బాబు బర్త్ డే సందర్భంగా ఈ సినిమా అప్డేట్ నవంబర్‌లో వస్తుందని రాజమౌళి ప్రకటించారు. నవంబర్ రానే వచ్చింది. దీంతో సోషల్ మీడియాలో #noveMBerwillbehiSStoRic, #noveMBer ట్రెండ్ మొదలైంది. ఈ నేపథ్యంలోనే రాజమౌళి, మహేశ్ బాబు మధ్య ట్వీట్ వార్ మొదలైంది.
సోషల్ మీడియాలో ట్రెండ్
ఎస్ఎస్ఎంబీ29 అప్డేట్ గురించి జక్కన్న, మహేశ్ ఇద్దరు ఒకరిపై మరొకరు సెటైర్లు, పంచ్‌లు వేసుకుంటూ ట్వీట్లతో యుద్థం చేశారు. వీరిద్దరి కన్వర్జేషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. "ఆల్రెడీ నవంబర్ వచ్చేసింది" అని ట్వీట్ వేసిన మహేశ్ బాబు ఎదురుచూస్తున్నట్లుగా కళ్ల ఎమోజీ పెట్టాడు.
దానికి రాజమౌళి "అవును, నవంబర్ వచ్చేసింది. ఈ నెలలో ఏ సినిమాలకి రివ్యూ ఇద్దాం అనుకుంటున్నావ్" అని పంచ్ వేశారు. అందుకు "మీరు ఎప్పటినుంచే తయారు చేస్తున్న మహాభారతం సినిమాకు ఇస్తాను" అంటూ రివర్స్ పంచ్ ఇచ్చాడు మహేశ్ బాబు.
ఒక్కోటిగా వెల్లడిస్తాం
"ముందుగా నవంబర్‌లో మీరు మాకు ఏదో హామీ ఇచ్చారు. దయచేసి మాట నిలబెట్టుకోండి" అని సూపర్ స్టార్ ట్వీట్ వేశాడు. "మహేశ్ ఇప్పుడే కదా మొదలైంది. నెమ్మదిగా మేము ఒక్కొక్కటిగా వెల్లడిస్తాం" అని రాజమౌళి సమాధానం ఇచ్చారు.
"ఎంత నెమ్మదిగా ఇస్తారు సార్. 2030లో స్టార్ట్ చేద్దామా. మీ సమాచారం కోసం మన దేశీ పాప ప్రియాంక చోప్రా జనవరి నుంచి హైదరాబాద్‌లోని ప్రతి వీధిలో తన ఇన్‌స్టా స్టోరీలు పోస్ట్ చేస్తోంది" అని ప్రియాంక చోప్రాను మధ్యలోకి లాగి మరి సెటైర్లు వేశాడు మహేశ్ బాబు.
బ్లైండ్‌గా ఏసేస్తా
"హలో హీరో.. సెట్‌లో నువ్వు నాతో పంచుకునే కథలన్నీ లీక్ చేయాలనుకుంటున్నావా. మైండ్‌లో ఫిక్స్ అయితే బ్లైండ్‌గా ఏసేస్తా" అంటూ ప్రియాంక చోప్రా మహేశ్ బాబుకే అతని స్టైల్‌లో రిప్లై ఇచ్చింది. "ప్రియాంక చోప్రా నటిస్తుందనే విషయాన్ని నువ్వెందుకు బయటపెట్టావ్ మహేశ్. నువ్వు సర్‌ప్రైజ్‌ని నాశనం చేశావ్" అని రాజమౌళి అన్నారు.
"మీ ఉద్దేశంలో పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఒక సర్‌ప్రైజ్ అని చెప్పాలనుకుంటున్నారా" అని మరో లీక్ వేస్తూ పంచ్ ఇచ్చాడు మహేష్ బాబు. "రాజమౌళి సార్. నేను ఇలాగే హైదరాబాద్‌కు వెకేషన్‌కు తిరిగితే నా కుటుంబం నన్ను అనుమానించడం స్టార్ట్ చేస్తారు" అని పృథ్వీరాజ్ సుకుమారన్ రియాక్ట్ అయ్యాడు.
ఇప్పటికీ సర్‌ప్రైజ్ అనుకుంటే
"మహేశ్.. ఇప్పుడు నువ్వు అన్నీ నాశనం చేశావు" అని రాజమౌళి కోప్పడ్డారు. "సరే ఒక సంధి చేసుకుందాం. ఇప్పటికే అందరికీ తెలిసిన ఏదో ఒక విషయాన్ని రేపు ప్రకటించండి. మీరు ఇప్పటికే దాన్ని సర్‌ప్రైజ్ అని అనుకుంటే" అని లాస్ట్ పంచ్ మహేశ్ బాబు ఇచ్చాడు.

"డీల్ ఓకే. కానీ, అతిగా వ్యంగంగా మాట్లాడినందుకు జరిమానాగా మీ ఫస్ట్ లుక్ రిలీజ్‌ను ఆలస్యం చేయాలని నిర్ణయించుకున్నాను" అని షాక్ ఇచ్చాడు రాజమౌళి. ఇలా జరిగిన ట్వీట్ యుద్ధంలో చివరిలో మహేశ్ బాబు అభిమానులకు జక్కన్న దెబ్బేశాడు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


