కొడుకును కూతురిలా చూసుకునే డిఫరెంట్ ఫాదర్, రాజమౌళిలా అతనికి అన్ని క్రాఫ్ట్స్‌పై పట్టుంది: రాజీవ్ కనకాల కామెంట్స్

తెలుగులో నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు రాజీవ్ కనకాల. టాలీవుడ్‌లో ఎన్నో సినిమాలతో మెప్పించిన ఆయన నటించిన మరో లేటెస్ట్ మూవీ లవ్ ఓటీపీ. రాజీవ్ కనకాల ప్రధాన పాత్ర పోషించిన లవ్ ఓటీపీ మూవీ ట్రైలర్‌ను ఇవాళ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌లో రాజీవ్ కనకాల ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Published on: Oct 22, 2025, 19:28:23 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

శ్రీమతి. పుష్ప మణిరెడ్డి సమర్పణలో భావప్రీత ప్రొడక్షన్స్ బ్యానర్ మీద విజయ్ ఎం రెడ్డి నిర్మించిన సరికొత్త తెలుగు సినిమా లవ్ ఓటీపీ. ఈ సినిమాలో అనీష్ హీరోగా చేయడంతోపాటు స్వీయ దర్శకత్వం వహించారు. అలాగే, లవ్ ఓటీపీ సినిమాలో ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల ప్రధాన పాత్రలో నటించారు.

కొడుకును కూతురిలా చూసుకునే డిఫరెంట్ ఫాదర్, రాజమౌళిలా అతనికి అన్ని క్రాఫ్ట్స్‌పై పట్టుంది: రాజీవ్ కనకాల కామెంట్స్
కొడుకును కూతురిలా చూసుకునే డిఫరెంట్ ఫాదర్, రాజమౌళిలా అతనికి అన్ని క్రాఫ్ట్స్‌పై పట్టుంది: రాజీవ్ కనకాల కామెంట్స్

లవ్ ఓటీపీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్

వీరితోపాటు జాన్విక, నాట్య రంగ వంటి వారు కీలక పాత్రల్ని పోషించారు. లవ్ ఓటీపీ సినిమాను నవంబర్ 14న థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. ఈ మేరకు బుధవారం అంటే ఇవాళ (అక్టోబర్ 22) ‘లవ్ ఓటీపీ’ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ క్రమంలో నిర్వహించిన లవ్ ఓటీపీ ట్రైల్ లాంచ్ ఈవెంట్‌లో నటుడు రాజీవ్ కనకాల ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

పగలబడి నవ్వుకునేలా ఉంటుంది

రాజీవ్ కనకాల మాట్లాడుతూ .. "‘లవ్ ఓటీపీ’ చిత్రాన్ని తెలుగు, కన్నడ భాషల్లో చిత్రీకరించాం. ఈ ప్రయాణంలో నన్ను అనీష్, అతని టీం మెంబర్స్ ఎంతో సపోర్ట్ చేశారు. ఇందులో నేను తండ్రి పాత్రను పోషించాను. కొడుకుని కూతురిలా చూసుకునే ఓ డిఫరెంట్ ఫాదర్ కారెక్టర్‌ను చేశాను. థియేటర్లో అందరూ ఎంజాయ్ చేసేలా, పగలబడి నవ్వుకునేలా ఈ చిత్రం ఉంటుంది" అని అన్నారు.

జాన్వికకి మంచి ఫ్యూచర్

"భావప్రీత బ్యానర్ మీద విజయ్ గారు ఈ మూవీని భారీ ఎత్తున నిర్మించారు. అనీష్ గారు తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. జాన్వికకి తెలుగులో మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఆనంద్ గారి మ్యూజిక్ చాలా బాగుంటుంది. నా సినిమాలకు, రోషన్ చిత్రాలకు మ్యూజిక్ చేసే అవకాశాన్ని ఆనంద్‌కు ఇస్తానని మాటిస్తున్నాను" అని రాజీవ్ కనకాల చెప్పారు.

బాబా భాస్కర్‌లో చాలా ఎనర్జీ

"హర్ష గారి విజువల్స్ అద్భుతంగా వచ్చాయి. ప్రవీణ్ గారు ఈ మూవీని చాలా బాగా మార్కెటింగ్ చేస్తున్నారు. నాట్య రంగ అద్భుతమైన నటుడు. బాబా భాస్కర్‌లో చాలా ఎనర్జీ ఉంటుంది. అనీష్ ఈ మూవీని ఇష్టపడి, కష్టపడి చేశాడు" అని నటుడు రాజీవ్ కనకాల తెలిపారు.

అన్ని క్రాఫ్ట్‌ల మీద పట్టు

"రాజమౌళిలా అన్ని క్రాఫ్ట్‌ల మీద పట్టున్న అనీష్‌కు మంచి పేరు రావాలి. నవంబర్ 14న ఈ చిత్రం రాబోతోంది. అందరూ తప్పకుండా లవ్ ఓటీపీ సినిమా చూసి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను" అని తన స్పీచ్ ముగించారు రాజీవ్ కనకాల.

లవ్, మాస్ సాంగ్స్ బాగుంటాయి

ఇదే ఈవెంట్‌లో నటుడు, కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్ మాట్లాడుతూ .. "‘లవ్ ఓటీపీ’లో నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన అనీష్ గారికి థాంక్స్. నిర్మాత గారు మాకు ఎంతో సపోర్ట్ చేశారు. ఇందులో లవ్, మాస్ సాంగ్స్ ఇలా అన్నీ బాగుంటాయి. ఈ చిత్రం చాలా బాగా వచ్చింది. నవంబర్ 14న ఈ మూవీ రాబోతోంది. అందరూ చూసి సపోర్ట్ చేయండి" అని అన్నారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More