పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ కత్రినా కైఫ్.. భర్త విక్కీ కౌశల్ పోస్ట్ వైరల్

బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. బాలీవుడ్ క్రేజియెస్ట్ దంపతుల్లో ఒకరైన విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ తమ మొదటి సంతానాన్ని ఆహ్వానించారు. తమకు కుమారుడు పుట్టాడంటూ భార్యాభర్తలు పెట్టిన ఆనందపు పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Published on: Nov 7, 2025, 12:04:52 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఇటీవల బాలీవుడ్ జంటలు వరుసగా తల్లిదండ్రులుగా మారుతున్నారు. ఇటీవల ప్రియాంక చోప్రా కజిన్ సిస్టర్ పరిణీతి చోప్రా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మరో స్టార్ హీరోయిన్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది.

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ కత్రినా కైఫ్.. భర్త విక్కీ కౌశల్ పోస్ట్ వైరల్
పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ కత్రినా కైఫ్.. భర్త విక్కీ కౌశల్ పోస్ట్ వైరల్

క్రేజీయెస్ట్ కపుల్స్‌లో

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని తాజాగా ఇవాళ (నవంబర్ 7) అధికారికంగా కత్రినా కైఫ్-విక్కీ కౌశల్ జంట సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. బాలీవుడ్‌లో అత్యంత క్రేజీయెస్ట్ కపుల్స్‌లో ఒకరిగా కత్రినా కైఫ్-విక్కీ కౌశల్ జంట నిలిచింది.

కత్రినా కైఫ్ బేబీ బంప్ ఫొటోలు

ఈ ఏడాది సెప్టెంబర్‌లో కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ తమ మొదటి బిడ్డను ఆశిస్తున్నట్లు ప్రకటించారు. ఇది చాలా మంది అభిమానులకు సంతోషాన్ని పంచింది. అలాగే కత్రినా కైఫ్ బేబీ బంప్ ఫొటోలు కూడా పోస్ట్ చేసి తన సంతోషాన్ని పంచుకుంది. అయితే, కత్రినా కైఫ్ ప్రెగ్నెంట్ అయిందని అంతకుముందు పుకార్లు రావడంతో బేబి బంప్ ఫొటోలతో క్లారిటీ ఇచ్చారు.

పండంటి మగ బిడ్డను

ఈ నేపథ్యంలోనే తాజాగా నేడు తాము పండంటి మగ బిడ్డను కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నట్లు కత్రినా, విక్కీ జంట సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ఈరోజు ఉదయం విక్కీ కౌశల్ తన అధికారిక సోషల్ హ్యాండిల్‌లో పోస్ట్‌తో గుడ్ న్యూస్ తెలిపాడు. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అపారమైన ప్రేమ, కృతజ్ఞతతో

ఈ పోస్ట్‌లోనే కత్రినా కైఫ్ మగబిడ్డకు జన్మనిచ్చినట్లు పేర్కొన్నాడు విక్కీ కౌశల్. "అపారమైన ప్రేమ, కృతజ్ఞతతో మా ఆనందాల సమూహం వచ్చేసింది. మేము మా మగ బిడ్డను స్వాగితిస్తున్నాం. నవంబర్ 7, 2025. కత్రినా అండ్ విక్కీ" అని విక్కీ కౌశల్ పోస్ట్‌లో రాసుకొచ్చాడు.

ఇండస్ట్రీలో సంతోషం

ఈ పోస్ట్‌నే కత్రినా కైఫ్ కూడా షేర్ చేసింది. కత్రినా కైఫ్ తల్లిగా మారిన విషయం ఇండస్ట్రీలో సంతోషాన్ని పంచుతోంది. ఇక కత్రినా, విక్కీ జంటకు అభిమానులతోపాటు నెటిజన్స్, సినీ సెలబ్రిటీలు శుభాకాంక్షలు చెబుతున్నారు.

కత్రినా కైఫ్ తెలుగు సినిమాలు

ఇదిలా ఉంటే, కత్రినా కైఫ్ తెలుగులో కూడా హీరోయిన్‌గా మెప్పించింది. విక్టరీ వెంకటేష్ మల్లీశ్వరి సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన కత్రినా కైఫ్ ఆ తర్వాత బాలకృష్ణతో అల్లరి పిడుగు మూవీ చేసింది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More