అమ్మగా మరో బాలీవుడ్ హీరోయిన్.. రాజ్యసభ ఎంపీకి తండ్రిగా ప్రమోషన్.. పరిణీతి చోప్రా ఫ్యామిలీకి ముందే దీపావళి
మరో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ పరిణీతి చోప్రా తల్లి అయింది. ఆమె ఆదివారం మధ్యాహ్నం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. రాజ్యసభ ఎంపీ అయిన ఆమె భర్త రాఘవ్ చద్దా తండ్రిగా ప్రమోషన్ పొందాడు. దీంతో ఆ కుటుంబానికి ముందుగానే దీపావళి వచ్చినట్లయింది.
బాలీవుడ్ మరో హీరోయిన్ తల్లి అయింది. పరిణీతి చోప్రా ఆదివారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. నటి పరిణీతి చోప్రా, రాజ్యసభ ఎంపీ అయిన ఆమె భర్త రాఘవ్ చద్దా తమ మొదటి బిడ్డకు స్వాగతం పలికి, వారి జీవితంలో ఒక కొత్త అధ్యాయంలోకి అడుగుపెట్టారు. ఆదివారం (అక్టోబర్ 19) పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఉమ్మడి పోస్ట్ ద్వారా ఈ శుభవార్తను పంచుకున్నారు.

అన్నీ ఉన్నాయి
"అతను చివరికి వచ్చేశాడు! మా అబ్బాయి" అని పోస్టులో పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా పేర్కొన్నారు. "నిజంగా మాకు ఇదివరకు జీవితం ఎలా ఉండేదో గుర్తులేదు! చేతులు నిండుగా ఉన్నాయి, మా హృదయాలు మరింత నిండుగా ఉన్నాయి. మొదట మేమిద్దరం ఒకరికొకరం ఉన్నాము, ఇప్పుడు మాకు అన్నీ ఉన్నాయి" అని ఆ నోట్‌లో జతచేశారు. ఈ జంట "కృతజ్ఞతలతో, పరిణీతి & రాఘవ్" అని సంతకం చేశారు. వారు ఈ నోట్‌ను ఎటువంటి క్యాప్షన్ లేకుండా కేవలం ఒక దిష్టి చుక్క ఎమోజీతో పోస్ట్ చేశారు.
ఆనందంలో ఫ్యామిలీ
అంతకుముందు ఆదివారం పరిణీతి ఆసుపత్రిలో చేరినట్లు తెలిసింది. "పరిణీతి చోప్రా ఢిల్లీలోని ఒక ఆసుపత్రిలో చేరింది. ఈ ప్రత్యేక సమయంలో రాఘవ్ తన భార్యతోనే ఉన్నారు. వారు ఏ క్షణంలోనైనా బిడ్డ రాకను ఆశిస్తున్నారు" అని ఓ సోర్స్ హిందుస్థాన్ టైమ్స్‌కు తెలిపింది. రాఘవ్ మాత్రమే కాదు పరిణీతి, రాఘవ్ కుటుంబాలు కూడా బిడ్డ రాక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తూ ఆమె పక్కనే ఉన్నారు.
"బిడ్డ రాక గురించి కుటుంబం మొత్తం చాలా ఉత్సాహంగా ఉంది, వారందరూ పరిణీతి పక్కనే ఉన్నారు. ఈ దీపావళి వారికి మరింత ప్రత్యేకంగా అనిపిస్తుంది. ఎందుకంటే రాబోయే చిన్నారితో ఇది మరింత ఆనందాన్ని, వేడుకలను తీసుకువస్తోంది" అని ఆ ఫ్యామిలీకి చెందిన ఓ పర్సన్ తెలిపారు.
పరిణీతి, రాఘవ్ గురించి..
ఆగస్టులో పరిణీతి, రాఘవ్ తమ మొదటి బిడ్డ రాబోతున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటించారు. "మా చిన్న విశ్వం వస్తోంది. అపరిమితమైన ఆశీర్వాదం’’ అని వారు ఒక ఉమ్మడి పోస్ట్‌లో రాశారు. దానితో పాటు 1 + 1 = 3 అని రాసి ఉన్న తెలుపు, బంగారు రంగు కేక్ చిత్రాన్ని, చిన్నారి పాదాల డిజైన్‌ను పంచుకున్నారు. పరిణీతి, రాఘవ్ ఒక పార్కులో ప్రేమగా చేతులు పట్టుకుని నడుస్తున్న వీడియోను కూడా పంచుకున్నారు.
గ్రాండ్ గా పెళ్లి
పరిణీతి, రాఘవ్ మే 2023లో న్యూఢిల్లీలోని కపుర్తలా హౌస్‌లో నిశ్చితార్థం చేసుకున్నారు. అదే సంవత్సరం సెప్టెంబర్‌లో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లోని ది లీలా ప్యాలెస్‌లో గ్రాండ్ గా వివాహం చేసుకున్నారు. రాఘవ్ ఆగస్టులో 'ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో'లో త్వరలో బిడ్డ పుట్టబోతున్నట్లు సూచిస్తూ "ఇస్తాం, మీకు ఇస్తాం.. శుభవార్త త్వరలోనే ఇస్తాం!" అని అన్నారు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper












