చిరంజీవ రివ్యూ- జబర్దస్త్ కమెడియన్ అదిరే అభి డైరెక్టర్- ఓటీటీలోకి ఇవాళ వచ్చిన మైథలాజికల్ కామెడీ మూవీ ఎలా ఉందంటే?

ఓటీటీలోకి ఇవాళ స్ట్రీమింగ్‌కు వచ్చిన తెలుగు మైథలాజికల్ కామెడీ మూవీ చిరంజీవ. రాజ్ తరుణ్ హీరోగా సోషల్ మీడియా స్టార్ కుషిత కల్లపు హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ సినిమాకు అభినయ్ కృష్ణ దర్శకత్వం వహించారు. ఆహాలో ఓటీటీ రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉందో నేటి చిరంజీవ రివ్యూలో తెలుసుకుందాం.

Published on: Nov 7, 2025, 05:33:03 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

టైటిల్: చిరంజీవ

ఓటీటీ మూవీ చిరంజీవ రివ్యూ
ఓటీటీ మూవీ చిరంజీవ రివ్యూ

నటీనటులు: రాజ్ తరుణ్, కుషిత కల్లపు, రాజా రవీంద్ర, కిరీటి, సంజయ్ కృష్ణ, టేస్టీ తేజ, గడ్డం నవీన్ తదితరులు

దర్శకత్వం: అభినయ్ కృష్ణ (అదిరే అభి)

సంగీతం: అచ్చు రాజమణి

సినిమాటోగ్రఫీ: రాకేష్ ఎస్ నారాయణ్

ఎడిటింగ్: సాయి మురళి

నిర్మాతలు: రాహుల్ అవుదొడ్డి, సుహాసిని రాహుల్

ఓటీటీ ప్లాట్‌ఫామ్: ఆహా ఓటీటీ

ఓటీటీ రిలీజ్ డేట్: నవంబర్ 07, 2025

జబర్దస్త్ కమెడియన్‌గా అదిరే అభి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు అదిరే అభి దర్శకుడిగా మారిన సినిమా చిరంజీవ. రాజ్ తరుణ్ హీరోగా చేసిన ఈ సినిమాతో సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్ కుషిత కల్లపు హీరోయిన్‌గా డెబ్యూ ఎంట్రీ ఇచ్చింది. తెలుగు మైథలాజికల్ కామెడీ చిత్రంగా తెరకెక్కిన చిరంజీవి ఇవాళ ఓటీటీలోకి వచ్చేసింది.

ఆహాలో నేటి (నవంబర్ 07) నుంచి చిరంజీవ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, నవంబర్ 5నే మీడియాకు చిరంజీవ స్పెషల్ ప్రీమియర్ షోలు వేశారు. మరి ఇవాళ ఓటీటీ రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉందో నేటి చిరంజీవ రివ్యూలో తెలుసుకుందాం.

కథ:

అంబులెన్స్ డ్రైవర్‌గా పనిచేసే శివ (రాజ్ తరుణ్)కు స్పీడ్ ఎక్కువ. పుట్టినప్పుడే మహార్జాతకుడు అనిపించుకున్న శివకు దేవుడు అంటే నమ్మకం ఉండదు. అంబులెన్స్‌ను స్పీడ్‌గా నడుపుతూ ఎదురుగా వచ్చిన ఓ దున్నపోతును గుద్దేస్తాడు శివ. యాక్సిడెంట్ కావడంతో హాస్పిటల్‌లో చేరుతాడు.

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత శివకు అందరి తలలపై వారి ఆయుష్షు కనిపిస్తుంటుంది. ముందుగా అర్థం కాని శివ తనకు అద్భుతమైన శక్తి వచ్చిందని గ్రహిస్తాడు. ఆ శక్తితో శివ ఏం చేశాడు? డబ్బు ఎలా సంపాదించాడు? మధ్యలో సత్తు పహిల్వాన్‌తో శివకు ఎదురైన సమస్య ఏం?టీ ఇద్దరి మధ్య గొడవ ఏంటీ? చివరికి ఏం జరిగింది? అనేదే చిరంజీవ మిగతా కథ.

విశ్లేషణ:

చిరంజీవ సినిమా మైథలాజికల్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన కామెడీ సినిమా. చిరంజీవ అంటే చిరకాలం బతుకు అనే అర్థం వస్తుంది. సినిమా టైటిల్‌తోనే కథ ఏంటో అర్థమైపోతుంది. మనుషుల ఆయుష్షు ఎంతకాలమో తెలిస్తే అంటే మనిషి ఎప్పుడు చనిపోతాడో తెలిస్తే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్‌తో చిరంజీవ తెరకెక్కింది.

ఇలాంటి తరహా కాన్సెప్ట్‌ను ఇదివరకు పాత తెలుగు సినిమాల్లో చూశాం. వచ్చే పవర్ వేరుగా ఉన్న కామన్‌గా ఉన్న పాయింట్ మాత్రం డబ్బు సంపాదించడం. శివ క్యారెక్టర్ ఏంటీ, ఎలాంటి వాడు, యాక్సిడెంట్‌తో ఎదుటి వారి ఆయుష్షు తెలియడం, దాని ద్వారా డబ్బు ఎలా సంపాదించాడు, ఈ క్రమంలో శివకు ఎదురైన సవాళ్లు, సమస్యలు ఏంటీ అనే అంశాలతో చిరంజీవ సినిమా సాగుతుంది.

డిఫరెంట్ పాయింట్

ప్రతి మనిషికి ఉండే కామన్ భయం చనిపోవడం. అది ఎప్పుడో తెలిస్తే ఎలా ఉంటుందనే డిఫరెంట్ పాయింట్‌తో డైరెక్టర్ అభినయ కృష్ణ (అదిరే అభి) చిరంజీవను బాగా తెరకెక్కించాడు. దానికి యుముడి ఎలిమెంట్స్ జోడించి తెరకెక్కించిన తీరు బాగుంది. కామెడీ, శివకు శక్తి రావడం, దాంతో డబ్బు సంపాదించే సీన్స్ బాగున్నాయి.

హీరోయిన్‌తో లవ్ ట్రాక్ కూడా బాగానే ఉంది. రొటీన్ అనిపించినా కూడూ చూస్తున్నంత సేపు పర్వాలేదనిపిస్తుంది. శివకు వచ్చిన పవర్ తెచ్చిన సమస్యలు, వాటిని పరిష్కరించే తీరుతో కథలో ఉత్కంఠత పెరుగుతుంది. కామెడీ, ఎమోషన్ సీన్స్ బాగానే వర్కౌట్ అయ్యాయి. క్లైమాక్స్ బాగుంది. సంగీతం పర్వాలేదు.

సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ సాంకేతిక నిర్మాణ విలువలు అన్ని కుదిరాయి. ఇక రాజ్ తరుణ్ శివ పాత్రలో మంచి ఈజ్‌తో చేశాడు. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన కుషిత కల్లపు అందంగా అట్రాక్ట్ చేసింది. రాజా రవీంద్రతోపాటు మిగతా పాత్రలు ఆకట్టుకుంటాయి.

ఫైనల్‌గా చెప్పాలంటే?

ఇక ఇన్నాళ్లు కమెడియన్‌గా మెప్పించిన అదిరే అభి దర్శకుడుగా వేసిన తొలి అడుగు బాగానే పడిందని చెప్పుకోవచ్చు. చిన్న చిన్న పొరపాట్లు ఉన్నప్పటికీ డైరెక్టర్‌గా దాదాపుగా విజయం సాధించాడు. ఇక ఫైనల్‌గా చెప్పాలంటే యూనిక్ పాయింట్‌తో తెరకెక్కిన చిరంజీవను ఆహా ఓటీటీలో టైమ్ పాస్ కోసం లుక్కేయొచ్చు.

రేటింగ్: 2.75/5

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More