మరో ఓటీటీలోకి తెలుగులో వచ్చిన శివాత్మిక రాజశేఖర్ తమిళ కామెడీ థ్రిల్లర్- 4 ఓటీటీల్లో స్ట్రీమింగ్- 7 రేటింగ్!

ఓటీటీలో డిఫరెంట్ కాన్సెప్ట్ కామెడీ థ్రిల్లర్ మూవీ తెలుగులోకి వచ్చేసింది. ఆ సినిమానే బాంబ్. ఈ సినిమాలో సీనియర్ హీరో రాజశేఖర్ కుమార్తె శివానీ రాజశేఖర్ హీరోయిన్‌గా చేసింది. ఓజీ నటుడు అర్జున్ దాస్ హీరోగా చేశాడు. 7 రేటింగ్ ఉన్న బాంబ్ ఏకంగా నాలుగు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఆవేంటో లుక్కేద్దాం.

Published on: Nov 3, 2025, 22:47:19 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీలోకి డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలు రావడం విపరీతంగా పెరిగిపోయింది. ప్రతివారం సరికొత్త సినిమాలతో పాటు డిఫరెంట్ జోనర్స్‌లు రిలీజ్ అవుతున్నాయి. అలా రీసెంట్‌గా తమిళంలో డిఫరెంట్ కామెడీ థ్రిల్లర్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చింది. ఆ సినిమా పేరే బాంబ్.

మరో ఓటీటీలోకి తెలుగులో వచ్చిన శివాత్మిక రాజశేఖర్ తమిళ కామెడీ థ్రిల్లర్- 4 ఓటీటీల్లో స్ట్రీమింగ్- 7 రేటింగ్!
మరో ఓటీటీలోకి తెలుగులో వచ్చిన శివాత్మిక రాజశేఖర్ తమిళ కామెడీ థ్రిల్లర్- 4 ఓటీటీల్లో స్ట్రీమింగ్- 7 రేటింగ్!

ఐఎమ్‌డీబీ నుంచి 7 రేటింగ్

సెప్టెంబర్ 12న థియేటర్లలో విడుదలైన బాంబ్ సినిమాకు మంచి పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. అలాగే, ప్రశంసలు అందుకుంది. అంతేకాకుండా ఐఎమ్‌డీబీ నుంచి పదికి 7 రేటింగ్ సాధించుకుంది. బాంబ్ సినిమాలో పవన్ కల్యాణ్ ఓజీ మూవీ నటుడు అర్జున్ దాస్ హీరోగా చేశాడు.

హీరో రాజశేఖర్ కుమార్తె

అలాగే, టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ కుమార్తె శివానీ రాజశేఖర్ హీరోయిన్‌గా చేసింది. అర్జున్ దాస్, శివానీ రాజశేఖర్ జోడీ కట్టిన బాంబ్ సినిమాకు విశాల్ వెంకట్ దర్శకత్వం వహించారు. మణికందన్ మాధవన్, అభిషేక్ సబారిగిరిసన్, విశాల్ వెంకట్ కథ అందించారు. డైరెక్టర్ అయిన విశాల్ వెంకట్ స్క్రీన్ ప్లే బాధ్యతలు కూడా చేపట్టారు.

మొదటగా 3 ఓటీటీల్లో

శక్తి ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్‌లో విడుదలైన బాంబ్ సినిమాకు సుధా సుకుమార్, సుకుమార్ బాలకృష్ణన్ నిర్మాతలుగా వ్యవహరించారు. అర్జున్ దాస్, శివాత్మికతోపాటు కాళి వెంకట్, నాజర్, టీఎస్‌కే తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. తమిళంలో మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న బాంబ్ సినిమా మొదట 3 ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో ప్రీమియర్‌కు వచ్చింది.

బాంబ్ ఓటీటీ స్ట్రీమింగ్

ఆహా తమిళం, సింప్లీ సౌత్, షార్ట్‌ఫ్లిక్స్‌ మూడింట్లో బాంబ్ ఓటీటీ రిలీజ్ అయింది. అయితే, వీటిలో కేవలం తమిళ భాషలో మాత్రమే బాంబ్ ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చింది. రీసెంట్‌గా తెలుగులో కూడా బాంబ్ ఓటీటీ ప్రీమియర్ అయింది. అది కూడా మరో ఓటీటీలో బాంబ్ డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది.

నాలుగు ఓటీటీల్లో

ఆ ఓటీటీనే అమెజాన్ ప్రైమ్ వీడియో. అక్టోబర్ 30 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో తెలుగుతోపాటు హిందీ భాషలో బాంబ్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పుడు బాంబ్ సినిమాను అమెజాన్ ప్రైమ్, ఆహా తమిళ్, సింప్లీ సౌత్, షార్ట్‌ఫ్లిక్స్‌ వంటి నాలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో వీక్షించవచ్చు.

శవం నుంచి గ్యాస్ సౌండ్స్

ఇక బాంబ్ సినిమా కథ విషయానికొస్తే.. ఇది రెండు గ్రామాల మధ్య జరిగే కథ. ఒక ఊరు రెండు గ్రామాలుగా విడిపోతుంది. దేవుడిని ఏమాత్రం నమ్మని హీరో ఫ్రెండ్ సడెన్‌గా రెండు ఊర్ల మధ్య చనిపోతాడు. దాంతో అతని శవాన్ని అక్కడే ఉంచుతారు. కానీ, శవం నుంచి అనూహ్యంగా గ్యాస్ సౌండ్స్ వస్తుంటాయి.

దేవుడంటూ కొట్టుకునే ప్రజలు

దాంతో రెండు గ్రామాల ప్రజలు అతన్ని దేవుడిగా భావిస్తారు. ఆ దేవుడు తమకంటే తమకు కావాలని కొట్టుకుంటారు. కానీ, హీరో మాత్రం తన ఫ్రెండ్ బతికే ఉన్నాడని, ఆ సౌండ్స్ ఎలా వస్తున్నాయో తెలుసుకోవాలనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది తెలియాలంటో 4 ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోన్న బాంబ్ సినిమాను చూడాల్సిందే.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More