ఓటీటీలోకి తెలుగులో 12 సినిమాలు.. కచ్చితంగా చూడాల్సినవిగా 8.. హారర్ నుంచి మిస్టరీ థ్రిల్లర్ వరకు!
ఓటీటీలోకి ఈ వారం తెలుగు భాషలో 12 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వీటిలో కచ్చితంగా చూడాల్సినవిగా 8 సినిమాలు ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్, ప్రైమ్ వీడియో, జీ5 ప్లాట్‌ఫామ్స్‌లలో హారర్, కామెడీ, సైకలాజికల్ థ్రిల్లర్ వంటి జోనర్స్‌లలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ఆ తెలుగు సినిమాలు ఏంటో చూద్దాం.
ఓటీటీలోకి ఈ వారం 50 వరకు సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వీటిలో తెలుగు భాషలో ఏకంగా 12 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్, జీ5 తదితర ప్లాట్‌ఫామ్స్‌లలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ఆ సినిమాలు, వాటి జోనర్స్‌పై లుక్కేద్దాం.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
ఇడ్లీ కొట్టు (తెలుగు డబ్బింగ్ తమిళ ఫ్యామిలీ ఎమోషన్ యాక్షన్ డ్రామా చిత్రం)- అక్టోబర్ 29
బల్లాడ్ ఆఫ్ ఏ స్మాల్ ప్లేయర్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ క్రైమ్ సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా మూవీ)- అక్టోబర్ 29
ది విచర్ సీజన్ 4 (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ ఫాంటసీ హారర్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 30
ఐలీన్: క్వీన్ ఆఫ్ సీరియల్ కిల్లర్స్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ ట్రూ డాక్యుమెంటరీ మూవీ)- అక్టోబర్ 30
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
బాంబ్ (తెలుగు, హిందీ డబ్బింగ్ తమిళ కామెడీ డ్రామా మూవీ)- అక్టోబర్ 30
ది హోమ్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ హారర్ థ్రిల్లర్ మిస్టరీ సినిమా)- అక్టోబర్ 28
కాంతార ఛాప్టర్ 1 (తెలుగు డబ్బింగ్ కన్నడ యాక్షన్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా)- అక్టోబర్ 31
జీ5 ఓటీటీ
డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనబడుటలేదు (తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 31
జయమ్ము నిశ్చయంబురా విత్ జగపతి (తెలుగు సెలబ్రిటీ టాక్ షో)- అక్టోబర్ 31
రంగ్‌బాజ్: ది బిహార్ చాప్టర్ (తెలుగు డబ్బింగ్ హిందీ క్రైమ్ థ్రిల్లర్ యాక్షన్ చిత్రం)- అక్టోబర్ 31
మరికొన్ని
కొత్త లోక చాప్టర్ 1- చంద్ర (తెలుగు డబ్బింగ్ మలయాళ సూపర్ వుమెన్ ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- జియో హాట్‌స్టార్ ఓటీటీ - అక్టోబర్ 31
సింధు భైరవి (తెలుగు మ్యూజికల్ డ్రామా చిత్రం)-ఈటీవీ విన్ ఓటీటీ- నవంబర్ 2
తెలుగులో 12- కచ్చితంగా చూడాల్సినవి 8
ఇలా ఈ వారం (అక్టోబర్ 27 నుంచి నవంబర్ 2) తెలుగు భాషలో 12 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వీటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా కాంతార చాప్టర్ 1, కొత్త లోక చాప్టర్ 1 చంద్ర, బాంబ్, ఇడ్లీ కొట్టు, ది విచర్ సీజన్ 4, ది హోమ్, డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనబడుటలేదు, సింధు భైరవితో 8 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


