ఓటీటీలోకి ఇవాళ వచ్చేసిన పవన్ కల్యాణ్ ఓజీ- 5 భాషల్లో స్ట్రీమింగ్- 86 శాతం ఫ్రెష్ కంటెంట్- ఇక్కడ చూసేయండి!
ఓటీటీలోకి ఇవాళ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ఓజీ సినిమా స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఓజీ మూవీకి సుజీత్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఏకంగా ఐదు భాషల్లో ఓజీ ఓటీటీ రిలీజ్ అయింది. మరి ఓజీ ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో ఇక్కడ తెలుసుకుదాం.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన లేటెస్ట్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్లిల్లర్ సినిమా ఓజీ. దే కాల్ హిమ్ ఓజీ అనేది ఫుల్ టైటిల్. యంగ్ డైరెక్టర్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయిన సుజీత్ ఓజీ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో పవన్ కల్యాణ్‌కు జోడీగా ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా చేసింది.

తెలుగులో తొలి చిత్రం
ఇక ఓజీ సినిమాలో ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్‌గా చేశాడు. ఇదే ఇమ్రాన్ హష్మీకి తెలుగులో మొదటి మూవీ. వీరితోపాటు ఓజీ చిత్రంలో ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, ఉపేంద్ర లిమాయే తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు.
వింటేజ్ పవన్ కల్యాణ్ అంటూ
ఇక ఓజీ సినిమాపై ఎన్ని అంచనాలు ఉండేవో తెలిసిందే. భారీ అంచనాల నడుమ సెప్టెంబర్ 25న థియేటర్లలో ఓజీ విడుదలైంది. ఓజీ రిలీజ్ రోజు నుంచి ఫుల్ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ అందించింది. ఎన్నో ఏళ్ల తర్వాత తమ అభిమాన హీరో పవన్ కల్యాణ్‌ను వింటేజ్ లుక్‌లో చూశామని ఫ్యాన్స్ తెగ సంబరపడిపోయారు.
ఓజీ బడ్జెట్ అండ్ కలెక్షన్స్
అలాగే, కలెక్షన్స్ పరంగా కూడా ఓజీ సత్తా చాటింది. రూ. 200 నుంచి 250 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఓజీ సినిమాకు దాదాపుగా రూ. 339 కోట్ల మేర కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం. ఇలా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయిన ఓజీ ఓటీటీలోకి వచ్చేసింది. ఇవాళ్టీ (అక్టోబర్ 23) నుంచి దే కాల్ హిమ్ ఓజీ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
28 రోజుల్లోనే ఓటీటీలోకి
ప్రముఖ దిగ్గజ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఓజీ ఓటీటీ రిలీజ్ అయింది. సెప్టెంబర్ 25న థియేటర్లలో విడుదలైన ఓజీ నెల కాకముందే అంటే సుమారుగా 28 రోజుల్లో ఓటీటీలోకి వచ్చేసింది. ఐదు భాషల్లో ఓజీ ఓటీటీ ప్రీమియర్ అవుతోంది. తెలుగుతోపాటు హిందీ, కన్నడ, తమిళం, మలయాళ భాషల్లో దే కాల్ హిమ్ ఓజీ మూవీ అందుబాటులో ఉంది.
86 శాతం ఫ్రెష్ కంటెంట్
థియేటర్లలో అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టిన ఓజీ ఓటీటీలో ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఇకపోతే ఓజీ సినిమాకు ఐఎమ్‌డీబీ నుంచి పదికి 6.8 రేటింగ్ వచ్చింది. అలాగే, కంటెంట్ ఎంత తాజాదో చెప్పే రొట్టెన్ టొమాటోస్ సంస్థ ఓజీ సినిమాకు 86 శాతం ఫ్రెష్ కంటెంట్ అని సర్టిఫికేట్ ఇచ్చింది.
తమన్ బీజీఎమ్‌కు
ఓజీ సినిమాను డీవీవీ దానయ్య ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి నిర్మించారు. సూపర్ హిట్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఓజీ మూవీకి సంగీతం అందించారు. తమన్ అందించిన బీజీమ్‌కు థియేటర్లలో విజిల్స్ పడ్డాయి.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో చూడొచ్చు
విజువల్స్ అదిరిపోయాయని టాక్ వచ్చింది. ముఖ్యంగా ఓజీ టైటిల్ కార్డ్ అందరిని ఆశ్చర్యపరిచింది. థియేటర్లలో చూడని వాళ్లు, చూసిన వారు మరోసారి ఓజీని నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో వీక్షించవచ్చు.

E-Paper












