కృష్ణ లీల మూవీ రివ్యూ.. హీరోయిన్‌ను హీరోనే చంపితే.. పునర్జన్మల కాన్సెప్ట్‌తో డిఫరెంట్ లవ్ స్టోరీ ఎలా ఉందంటే?

బ్యూటిపుల్ హీరోయిన్ ధన్య బాలకృష్ణన్ నటించిన లేటెస్ట్ మూవీ కృష్ణ లీల. ఈ సినిమాలో హీరోగా చేసిన దేవన్ స్వీయ దర్శకత్వం వహించాడు. తిరిగొచ్చిన కాలం అనే ట్యాగ్‌లైన్‌తో నవంబర్ 7న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో నేటి కృష్ణ లీల రివ్యూలో తెలుసుకుందాం.

Published on: Nov 8, 2025, 05:58:34 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలుగులో హీరోయిన్‌గా ధన్య బాలకృష్ణన్ మంచి క్రేజ్ తెచ్చుకుంది. తాజాగా ధన్య బాలకృష్ణన్ హీరోయిన్‌గా చేసిన డిఫరెంట్ లవ్ స్టోరీ మూవీ కృష్ణ లీల. తిరిగొచ్చిన కాలం అనేది ట్యాగ్‌లైన్. ఈ సినిమాలో హీరోగా దేవన్ నటించడంతోపాటు స్వీయ దర్శకత్వం వహించారు.

కృష్ణ లీల మూవీ రివ్యూ.. హీరోయిన్‌ను హీరోనే చంపితే.. పునర్జన్మల కాన్సెప్ట్‌తో డిఫరెంట్ లవ్ స్టోరీ ఎలా ఉందంటే?
కృష్ణ లీల మూవీ రివ్యూ.. హీరోయిన్‌ను హీరోనే చంపితే.. పునర్జన్మల కాన్సెప్ట్‌తో డిఫరెంట్ లవ్ స్టోరీ ఎలా ఉందంటే?

ధన్య బాలకృష్ణన్, దేవన్‌తోపాటు బబ్లూ పృథ్వీ, వినోద్ కుమార్, రజిత, సరయు తదితరులు కీలక పాత్రలు పోషించారు. బేబీ వైష్ణవి సమర్పణలలో మహాసేన్ విజువల్స్ పతాకంపై జ్యోత్స్న జి కృష్ణ లీల సినిమాను నిర్మించారు. నవంబర్ 7న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో నేటి కృష్ణ లీల రివ్యూలో చూద్దాం.

కథ:

యోగా గురువుగా విహారి (దేవన్) అమెరికాలో చాలా పాపులర్. తన చెల్లి పెళ్లి కోసం దేవన్ భారత్‌కు వస్తాడు. హోంమంత్రి (వినోద్ కుమార్) కూతురు బృంద (ధన్య బాలకృష్ణన్)ను చూసిన విహారి ప్రేమిస్తాడు. అబ్బాయిలంటే ఏమాత్రం నచ్చని బృంద దగ్గర ప్రతిసారి రెజెక్షన్‌కు గురి అవుతాడు విహారి.

ఈ క్రమంలో విహారికి గత జన్మ జ్ఞాపకాలు గుర్తుకు వస్తుంటాయి. బృంద పెళ్లికి ఒప్పుకోకపోవడంతో తండ్రి దగ్గర తన మ్యారేజ్ ప్రపోజల్ పెడతాడు విహారి. కానీ, కూతురు కంటే అవమానకరంగా హోమంత్రి దేవన్‌ను తిరస్కరిస్తాడు. ఆ కోపంతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన విహారి హోమ్ మినిస్టర్ కూతురుని చంపేశానని లొంగిపోతాడు.

ట్విస్టులు

ఆ తర్వాత ఏమైంది? నిజంగానే దేవన్ ప్రేమించిన బృందాను చంపేశాడా? పోలీసులు విచారంచి ఏం తేల్చారు? గత జన్మలో బృంద విహారి ఎవరు? మరి బృందకు కూడా గతం గుర్తుకు వస్తుందా? ప్రస్తుతం జన్మలో విహారి-బృంద ప్రేమ ఫలిస్తుందా? గతంలో ఏం జరిగింది? అనే అంశాలతో తెరకెక్కిందే కృష్ణ లీల.

విశ్లేషణ:

లవ్ స్టోరీ సినిమాలు డిఫరెంట్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కడం చూశాం. అందులో పునర్జన్మల కాన్సెప్ట్ ఒకటి. ఈ కథాంశంతో తెలుగులో చాలానే సినిమాలు వచ్చాయి. అయితే, కష్ణ లీల కాన్సెప్ట్ కూడా గత జన్మలతోనే ఉన్నప్పటికీ దైవత్వాన్ని యాడ్ చేసి కొత్తగా ట్రై చేశారు.

ఫస్టాఫ్ అంతా హీరో, హీరోయిన్‌లా ఇంట్రడక్షన్, వారి నేపథ్యం, లవ్ ప్రపోజల్, రెజెక్షన్స్‌తో రెగ్యులర్ ఫార్మాట్‌లోనే సాగుతుంది. హీరోయిన్ తండ్రి హీరోను అవమానించడం, పోలీస్ స్టేషన్‌కు వెళ్లే సన్నివేశాలు కాస్తా జోరు పెంచుతాయి. ఇంటర్వెల్‌లో హీరోయిన్‌ను హీరోనే చంపేశానని చెప్పే ట్విస్ట్ మైండ్ బ్లాక్ చేస్తుంది.

క్లైమాక్స్ వరకు ఎంగేజ్

అది గత జన్మలో అని చెప్పడం సెకండాఫ్‌పై క్యూరియాసిటీ పెంచుతుంది. అయితే, సెకండాఫ్‌లో వెంటనే గత జన్మకు సంబంధించిన కథ చూపించకుండా క్లైమాక్స్ వరకు ఎంగేజ్ అయ్యేలా చేస్తుంది. గత జన్మలో ఏం జరిగిందా అనే క్యూరియాసిటీ మరోవైపు ఇదంతా వద్దు అనే భావన మరోవైపు ప్రేక్షకుడికి కలుగుతాయి.

అయితే, గత జన్మలో లవ్ స్టోరీ రొటీన్‌గా ఉన్నా పాత్రలను తీర్చి దిద్దిన తీరు డిఫరెంట్‌గా ఆకట్టుకునేలా బాగుంటుంది. ఇక క్లైమాక్స్ కూడా భిన్నంగా ఎండ్ అవుతుంది. టెక్నికల్ పరంగా సినిమా బాగుంది. విజువల్స్ ఓకే. ఎడిటింగ్‌లో జాగ్రత్తలు పాటించాల్సింది. సంగీతం పర్వాలేదు.

డైరెక్టర్‌గా, హీరోగా దేవన్ బాగానే కష్టపడ్డాడు. రెండు విభిన్న పాత్రల్లో, బాధ్యతల్లో దేవన్ సక్సెస్ అయ్యాడనే చెప్పుకోవచ్చు. ధన్య బాలకృష్ణన్ గ్లామర్‌గా, గతంలో నటనతో మెప్పించింది. రెండు పాత్రల్లో వైవిధ్యాన్ని బాగా చూపించింది.

ఓ లుక్కేయొచ్చు

వినోద్ కుమార్ నెగెటివ్ రోల్‌లో బాగా చేశారు. ఫైనల్‌గా చెప్పాలంటే పునర్జన్మల కాన్సెప్ట్‌కు దైవత్వాన్ని జోడించి తెరకెక్కించిన డిఫరెంట్ లవ్ స్టోరీగా కృష్ణ లీలపై ఓ లుక్కేయొచ్చు.

రేటింగ్: 2.5/5

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More