ప్రేమిస్తున్నా రివ్యూ.. డిఫరెంట్‌గా లవ్ ప్రపోజల్.. బోల్డ్‌‌గా ఎమోషనల్ డెప్త్ ఉన్న స్వచ్ఛమైన ప్రేమకథ మెప్పించిందా?

సాత్విక్ వర్మ, ప్రీతీ నేహా హీరోహీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ బొల్డ్ రొమాంటిక్ సినిమా ప్రేమిస్తున్నా. భాను దర్శకత్వం వహించిన ప్రేమిస్తున్నా సినిమా ఇవాళ (నవంబర్ 7) థియేటర్లలో విడుదలైంది. మంచి అంచనాలతో నేడు రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉందో నేటి ప్రేమిస్తున్నా రివ్యూలో తెలుసుకుందాం.

Published on: Nov 7, 2025, 20:37:44 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఇవాళ (నవంబర్ 7) థియేటర్లలో ఎన్నో తెలుగు సినిమాలు విడుదల అయ్యాయి. వాటిలో బోల్డ్ రొమాంటిక్ ఎమోషనల్ డ్రామా చిత్రంగా వచ్చిందే ప్రేమిస్తున్నా. ఈ సినిమాలో సాత్విక్, ప్రీతీ నేహా హీరో హీరోయిన్లుగా నటించారు. భాను దర్శకత్వం వహించిన ఈ సినిమాను వరలక్ష్మీ పుప్పుల సమర్పణలో కనకదుర్గరావు నిర్మించారు.

ప్రేమిస్తున్నా రివ్యూ.. డిఫరెంట్‌గా లవ్ ప్రపోజల్.. బోల్డ్‌‌గా ఎమోషనల్ డెప్త్ ఉన్న స్వచ్ఛమైన ప్రేమకథ మెప్పించిందా?
ప్రేమిస్తున్నా రివ్యూ.. డిఫరెంట్‌గా లవ్ ప్రపోజల్.. బోల్డ్‌‌గా ఎమోషనల్ డెప్త్ ఉన్న స్వచ్ఛమైన ప్రేమకథ మెప్పించిందా?

ప్రేమిస్తున్న పాటలకు యూట్యూబ్‌లో మంచిరెస్పాన్స్ వచ్చింది. పెద్దగా ప్రమోషన్స్ చేయకపోయినప్పటికీ ఒకింత బజ్ క్రియేట్ చేసింది ప్రేమిస్తున్నా. మరి డిఫరెంట్ ప్రపోజల్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో నేటి ప్రేమిస్తున్నా రివ్యూలో తెలుసుకుందాం.

కథ:

హీరో (సాత్విక్ వర్మ)కు తండ్రి లేకపోవడంతో అన్ని తానై పెంచుతుంది తల్లి శారద. రైల్వేలో చిన్న ఉద్యోగం చేసే శారదకు సొంతూరు నుంచి ఘట్కేసర్‌లో రైల్వే కాలనీకి బదిలీ అవుతుంది. వస్తువులు ఇంట్లోకి షిప్ట్ చేస్తున్న సమయంలో సహాయం చేసిన అదే కాలనీకి చెందిన అమ్మాయి (ప్రీతీ నేహా)ని చూసి హీరో ఇష్టపడతాడు.

తొలి చూపులోనే ప్రేమలో పడిపోతాడు. ప్రేమిస్తున్నా అని చెప్పడానికి బదులు నీతో రొమాన్స్ చేయాలని ఉందని చెబుతాడు. టైమ్ టేబుల్ పెట్టుకుని మరి ప్రేమించిన సాత్విక్‌కు ప్రీతి ఓకే చెబుతుంది. కానీ, రొమాన్స్‌కు కండిషన్ పెడుతంది.

ట్విస్టులు

ప్రీతి పెట్టిన కండిషన్ ఏంటీ? ఎంతగానో ప్రేమించిన సాత్విక్‌ను ప్రీతి ఎందుకు దూరం పెట్టింది? ఎంతో మంది అమ్మాయిలు ఉన్న ప్రీతినే సాత్విక్ ఎందుకు ఇష్టపడ్డాడు? వీరిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటీ? ప్రీతి కోసం సాత్విక్ పిచ్చోడిలా ఎందుకు మారాడు? కొడుకు డబ్బులు సంపాదిస్తాడని ఆశపడిన తల్లి శారద సాత్విక్‌ను ఎలా కాపాడుకుంది? అనే విషయాలు తెలియాలంటే ప్రేమిస్తున్నా చూడాల్సిందే.

విశ్లేషణ:

ప్రేమిస్తున్నా సినిమా ప్లాట్ చూస్తే చాలా రొటీన్‌గా ఉంటుంది. లవ్ స్టోరీల్లో ఉండే కామన్ పాయింట్ ప్రేమ, రొమాన్సే. కానీ, వాటిని ఎంత అర్థవంతంగా, లోతుగా చూపిస్తే ఆ కథలు అంత సక్సెస్ అవుతాయి. ప్రేమిస్తున్నా సినిమా కథ కూడా అంతే. ప్రేమించే అమ్మాయిని రొమాన్స్ అడగటం, రొమాన్స్ కూడా లవ్‌లో భాగం అని హీరో వెంటపడే సీన్స్ రెగ్యులర్‌గానే అనిపిస్తాయి.

కానీ, వాటికి సెకండాఫ్‌లో ఇచ్చే జస్టిఫికేషన్ మాత్రం నెక్ట్స్ లెవెల్‌లో ఉంటుంది. ఓ ఎమోషనల్ సీన్‌తో ప్రారంభమైన సినిమా ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లి లవ్ స్టోరీ స్టార్ట్ అవడం, నేరుగా అమ్మాయిని రొమాన్స్ చేయాలని ఉందని అడగడం, హీరోయిన్ ఎంగిలి తినడం వంటివి ఆకట్టుకుంటాయి. అక్కడక్కడ కామెడీ బాగుంటుంది.

హీరోయిన్ ఒప్పుకోవడంతో

హీరో రొమాన్స్‌కు హీరోయిన్ ఓకే చెప్పడంతో కథపై ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. ఆ తర్వాత వచ్చే ఎమోషన్ సీన్స్ కట్టిపడేస్తాయి. ప్రజంట్, పాస్ట్ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ చూపించిన స్క్రీన్ ప్లే బాగుంటుంది. హీరోయిన్ ప్రవర్తన వెనుకున్న నిజం తెలిసాకా అప్పటివరకు ఉన్న ఆలోచనను మార్చేస్తుంది. కేవలం కామంతోనే హీరో రొమాన్స్ అడగటం లేదని వచ్చే క్లారిటీ హై ఇస్తుంది.

ఫస్టాఫ్ కామెడీతో సాగితే సెకండాఫ్ మొత్తం ఎమోషనల్ రైడ్‌లా ఉంటుంది. ముఖ్యంగా కొడుకును తల్లి కాపాడుకునే సీన్స్ ఎమోషనల్ అయ్యేలా చేస్తాయి. అలాగే, రివీల్ అయ్యే ఒక్కో ట్విస్ట్, ప్రీ క్లైమాక్స్ టు క్లైమాక్స్ వరకు స్టోరీ భావోద్వేగానికి గురి చేస్తుంది. ఈ క్రమంలో వచ్చే సంబాషణలు హృద్యంగా ఉంటాయి.

బోల్డ్‌గా స్వచ్ఛమైన ప్రేమకథ

ఒక స్వచ్ఛమైన ప్రేమకథను బోల్డ్‌గా చూపించడం ఫ్యామిలీ ఆడియెన్స్‌కు మాత్రం కాస్తా ఇబ్బందిగా ఉంటుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ ఓకే. సంగీతం ఎమోషన్‌కు బాగా సూట్ అయింది. సాంకేతిక నిర్మాణ విలువలు పర్లేదు. డైరెక్టర్‌గా భాను లవ్ స్టోరీని కొత్తగా చెప్పడంలో సక్సెస్ అయ్యారనుకోవచ్చు.

ఇక సాత్విక్ వర్మ, ప్రీతి నేహా యాక్టింగ్ చాలా బాగుంది. ప్రేమికుల్లా బాగా ఒదిగిపోయి నటించారు. ఫైనల్‌గా చెప్పాలంటే బోల్డ్‌గా కనిపించే డెప్త్ ఉన్న ఎమోషనల్ లవ్ స్టోరీ ప్రేమిస్తున్నా.

రేటింగ్: 3/5

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More