యూట్యూబ్‌లో ఆకట్టుకుంటున్న 'ఏమి మాయ ప్రేమలోన' సాంగ్- మనసుకు హత్తుకునే లిరిక్స్‌తో హృద్యమైన ప్రేమగాథ- ట్రెండింగ్‌లో పాట

యూట్యూబ్‌లో అందరి మనసులను ఆకట్టుకుంటున్న లేటెస్ట్ తెలుగు లవ్ రొమాంటిక్ సాంగ్ ఏమి మాయ ప్రేమలోన. ఈ పాటలో అనిల్ ఇనమడుగు, వేణి రావ్ జోడీ కట్టారు. అనిల్ ఇమమడుగు స్వీయ దర్శకత్వం వహించిన ఈ సాంగ్‌లో హృద్యమైన ప్రేమగాథను మనసుకు హత్తుకునే లిరిక్స్‌తో వినిపించి చూపించారు.

Published on: Oct 28, 2025, 11:32:18 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సాధారణంగా సినిమాలో సాంగ్స్ బాగుంటే ఆదరణ దక్కించుకుని మంచి హిట్ అవుతాయి. సినిమా సాంగ్స్ కాకుండా పలు మ్యూజిక్ వీడియోలు కూడా ఇటీవల కాలంలో ఎక్కువగా ఆదరణ పొందుతున్నాయి. లవ్ ఆధారంగా రొమాంటిక్‌ లిరిక్స్‌తో ఎన్నో సాంగ్స్ అవుతున్నాయి. వాటిలో కొన్ని మంచి హిట్స్‌గా నిలుస్తున్నాయి.

యూట్యూబ్‌లో ఆకట్టుకుంటున్న 'ఏమి మాయ ప్రేమలోన' సాంగ్- మనసుకు హత్తుకునే లిరిక్స్‌తో హృద్యమైన ప్రేమగాథ- ట్రెండింగ్‌లో పాట
యూట్యూబ్‌లో ఆకట్టుకుంటున్న 'ఏమి మాయ ప్రేమలోన' సాంగ్- మనసుకు హత్తుకునే లిరిక్స్‌తో హృద్యమైన ప్రేమగాథ- ట్రెండింగ్‌లో పాట

లవ్ రొమాంటిక్ సాంగ్

ఇప్పుడు చెప్పుకునే సాంగ్ కూడా మంచి ఆదరణ పొందుతోంది. యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో దూసుకుపోతు అందరి మన్ననలు పొందుతోంది ఈ సాంగ్. ఆ పాట పేరే 'ఏమి మాయ ప్రేమలోన'. లవ్ రొమాంటిక్ మ్యూజిక్ వీడియోగా ఈ సాంగ్ తెరకెక్కింది. ఇటీవల యూట్యూబ్‌లో రిలీజ్ అయిన ఈ సాంగ్ సోషల్ మీడియాలో మంచి టాక్ తెచ్చుకుంటోంది.

యూట్యూబ్‌లో ట్రెండింగ్

అంతేకాకుండా అధిక వ్యూస్‌తో యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంటోంది. అకి క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై ఈ రొమాంటిక్ సాంగ్ తెరకెక్కింది. హృద్యమైన ప్రేమగాథను మనసుకు హత్తుకునే లిరిక్స్‌తో ఈ సాంగ్‌ను కంపోజ్ చేశారు.

లిరిక్స్, దర్శకత్వం, హీరో ఒకక్కరే

'ఏమి మాయ ప్రేమలోన' సాంగ్‌కు లిరిక్స్ రాయడం, దర్శకత్వం వహించండంతోపాటు హీరోగా ఒక్కరే చేశారు. అతనే అనిల్ ఇనమడుగు. ఇక పాటలో హీరోయిన్‌గా వేణు రావ్ యాక్ట్ చేసింది. సాంగ్‌లో అనిల్ ఇనమడుగు, వేణు రావ్ జోడీ బాగుంది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. అలాగే, పాటలో చూపించిన విజువల్స్ మనసుకు ఆహ్లాదకరంగా ఉన్నాయి.

మార్క్ ప్రశాంత్ సంగీతం

'ఏమి మాయ ప్రేమలోన' పాటకు మార్క్ ప్రశాంత్ సంగీతం అందించారు. అలాగే, దిన్కర్ కలవుల, దివ్య ఐశ్వర్య పాటకు గాత్రాన్ని అందించారు. దసరా కానుకగా విడుదలైన ఈ సాంగ్ అతి తక్కువ కాలంలోనే 1 మిలియన్ వ్యూస్ సాధించింది. యూట్యూబ్‌లో ట్రెండింగ్‌గా మారింది. అలాగే, 'ఏమి మాయ ప్రేమలోన' సాంగ్ క్లిప్స్, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

10 నిమిషాలకు పైగా రన్‌టైమ్

10 నిమిషాలకు పైగా రన్‌టైమ్ ఉన్న 'ఏమి మాయ ప్రేమలోన' సాంగ్ లిరిక్స్ చాలా సింపుల్‌గా, అర్థమయ్యేలా ఉండి, మృదువైన సంగీతంతో అలరిస్తోంది. ఈ పాట ఒక హృద్యమైన అనాథ ప్రేమగాథను చెబుతుంది.

టూరిస్ట్ గైడ్ ప్రేమకథ

కేరళలో టూరిస్ట్ గైడ్‌గా జీవించే ఓ అనాథ యువకుడి లైఫ్‌లోకి ఓ అమ్మాయి రాక, తన పరిచయం, ఆమె పరిచయం అతని జీవితాన్ని ఎలా మార్చేసిందో చూపించారు. అనాథ జీవితంలోకి హీరోయిన్ రావడాన్ని మేఘాల మధ్య ప్రవేశించిన మెరుపుతో పోల్చారు. అది ఎంతో కవితాత్మకమైన అనుభూతిని కలగజేస్తుంది.

యూత్‌ను అట్రాక్ట్ చేస్తూ

ఆ అమ్మాయి పరిచయం ఆ అనాథ జీవితాన్ని ఎటువైపు మళ్లీంచిందో ఇలా కవితాత్మకంగా, అందమైన మధురమైన లిరిక్స్‌తో, అక్కడక్కడ సెంటిమెంట్‌తో అందమైన విజువల్స్‌తో 'ఏమి మాయ ప్రేమలోన' సాంగ్ యూత్‌ను అట్రాక్ట్ చేస్తోంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More